నలభై సంవత్సరాల క్రిందట నేను వ్రాసిన నవల ఇది. క్రిందటి సంవత్సరం 'కౌముది ' లో సీరియల్ గా వచ్చినప్పుడు ఈ తరం పాఠకులనుంచి వచ్చిన స్పందన నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇందుక్కారణం సున్నితమైన మానవ సంబంధాలకున్న బలం.. అని నాకనిపించింది. బ్లాగు మిత్రులకి కూడా దీన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ పోస్టు వ్రాస్తున్నాను.
ఈ నవల వెనుక నున్న చిన్న నేపథ్యం గురించి ఒక్క సారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ..ఇందులోని సుబ్బులు పాత్రకి మాత్రుక - నా పధ్నలుగో యేట నా ఆలోచనల్లో దొరికింది. మేము అద్దెకుండే ఇంట్లో ఒక వాటాలో ఉండే వారింటికి ఓ అమ్మాయి వచ్చింది. నా వయస్సేనేమో. ప్రేమా దోమా తెలీని దశ అది. ఒక వేళ మనస్సులో ఏదో ఆకర్షణ ఉన్నా - దానికి ఇతమిథమైన రూపం లేదు. తీరా ఆమె కొన్నాళ్ళుండి వెళ్ళిపోయాక ఓ పద్యం రాసుకున్నాను
పోయితివి నీవు నను వీడిపోయి ఎటకో
యేను నీ పదఛాయల వేగలేక
వేడి నిట్టూర్పు కెరటాల నీడలందు
జీర్ణమయిపోవు దుఃఖంపు జీరనైతి..
మరో పదేళ్ళకి సుబ్బులు ప్రాణం పోసుకుని నా నవలలో పాత్రయింది.
మీరూ చదవండి..!
Wednesday, July 28, 2010
Subscribe to:
Post Comments (Atom)
వెన్నెలకాటేసింది సీరియల్ కౌముది లో చదివేనండి . సుబ్బులు పాత్రని చాలా చక్కగా మలిచేరు. ఇప్పటి మానవసంబంధాలతో పొల్చుకుంటే 40 సంవత్సరాల వ్యత్యాసం ప్రస్పుటంగా కనిపిస్తుంది.అప్పుడు 14 సంవత్సరాల అబ్బాయి పక్కింటికి చుట్టంగా వచ్చి వెళ్ళిన అమ్మాయి గురించి భావావేసంలో కవిత రాస్తే , ఈరోజు 14 సంవత్సరాల విద్యార్థి ఢిల్లీ లో ఆటలో ఆధిపత్యం కోసం తోటి విద్యార్థి పై కాల్పులు జరిపాడు.అందుకే మీ నవలకి అంత స్పందన.
ReplyDeleteమారుతీ రావు గారు !
ReplyDeleteమీ కధల్లో నాకు నచ్చిన అంశం ఒకటి చెప్పాలి
సాధారణం గ పాతకుడికి ముందు జరగబోయే దాన్ని ఊహించే అవకాసం ఇవ్వరు మీరు .ఆసాంతం చదివించేలా వుంటుంది.
"వెన్నెల కాటేసింది"... ఈ కథ చదివిన తర్వాత నేను చెప్పగలిగే ఒకేఒక్క మాట "అత్యద్భుతం".
ReplyDeleteఇంతగా మనసుకు హత్తుకుపోయేలా ఉన్న కథని నేను ఇంతవరకు చదవలేదు...
ప్రతి సన్నివేశంలోను చదివేవారిని కథలో పాత్రలాగా ఇన్వాల్వ్ చెయ్యడంలో మీకు మీరే సాటి సర్.
Motta modata, mee navala naaku pravaahamu, alalu vunna nadilo padava prayaanamgaa saagindi. Prati kshanamoo chaala daggiragaa, hattukunnattu anipinchindi. Chaala chakkati rachana.
ReplyDelete1) Modati bhaagam (malupu kooda) subbulu vere vyaktini preminchinattu cheppadam varaku; taruvati bhaagam, ee sanghatantaa subbulu kodukuku cheputunnattu - maroka malupu. Chivari bhaagam migilinadi kadha. Malupulu baavunnaayi. Utkanthagaa kooda vundi vundhi. Konni dasaabdaala paatugaa jarige kadhalo kontha depth vastundani naa abhipraayam. Daaniki mee saili thodu ayyi alarinchindi.
2) Modati bhaagam lo, "bold font" lo mee visleshanalu baavunnaayi kaanee kadha pravaahaaniki o chinna addu kattalaa anipinchindi. Chivari rendu, moodu bhaagallo kontha gaambheeryatha chotu chesukovatam valla mallee atlaa anipinchaledu.
3) Mugimpu vishayaani ki voste, oka unnata aasayam saadhinchadaaniki konni saarlu manamu chese pani apavitram kaavacchu kaani aa aasayam sidhdhinchi manchi kaligite, tappu ledu ani anukune vaadini.
Subbulu samaja paristhithulni yedirinchi kaavalasinadi saadhinchukundi. Andulo ye tappu ledu. Kaanee tana anubhavam laaga kodukuki kooda avakoodadu ani aadurda padatam lo tappu ledu. Manamu chesina thappulu mana pillalu, man aatmeeyulu cheyya koodadu ani anukovadamu sahajam. Koduku thalli maata kante thana ishtaanike praadhaanyam ivvatam kontha sahajam (age valla meeru annattu), kontha vaalla kharma. Cheyyakundaa thalli maata vinte baagundendani naa uddesyam.
Manchi navala. I am happy to have read a novel like this in a long time.
Pl continue your efforts.
With Regards
Ram Mantravadi
ikkada raayadaaniki veelu kaananni manchi vaakyaalu unnaayandi navala lo ..
ReplyDelete