కామన్వెల్తు క్రీడలవల్ల చాలా ఘోరాలూ, అవినీతీ సాగిపోతోందని, కోట్ల కోట్ల డబ్బు కాజేశారని, మన దేశం పరువు ప్రతిష్టలు మంటగలిసి పోతున్నాయని ఈ మధ్య చాలా ఛానళ్ళూ, పత్రికలూ ఘోషిస్తున్నాయి. కాని వీరికి దృష్టి లోపం ఉన్నదనీ, అవన్నీ కిట్టని వాళ్ళ మాటలనీ నేను రూఢీగా చెప్పగలను.
పూర్తిగా చదవండి
Sunday, September 26, 2010
Sunday, September 19, 2010
సాహిత్యంలో జీవహింస
ప్రపంచంలో చాలామందికి పెద్ద వ్యసనం - క్రాస్ వర్డ్ పజిల్. మరో పెద్ద వ్యసనం - డిటెక్టివ్ సాహిత్యం.
చాలా గొప్ప గొప్ప వ్యక్తులు,రచయితలు -డిటెక్టివ్ నవల చదవందీ నిద్రపోని సందర్భాలున్నాయి.
అలవాటు కారణంగా 'గొప్పవారి ' జాబితాలో చేరడం దొంగదారికాదనుకుంటే - నాకూ ఈ రెండు వ్యసనాలూ ఉన్నాయి.
క్రాస్ వర్డ్ పజిలు లేని ఆదివారం వస్తే - విలవిలలాడుతాను. స్టానీ గార్డనర్,అగాధా క్రిస్టీ, కోనన్ డాయిల్, ఎడ్గార్ వాలెస్,
పీటర్ చీనీ - ఇలా ఒకసారి కాదు, నాలుగయిదుసార్లు చదివిన నవలలున్నాయి.
Monday, September 13, 2010
'సత్యా' గ్రహం
ఈ దేశానికి మహాత్ముడు సత్యాగ్రమనే ఆయుధాన్నిచ్చి నిన్నటికి సరిగ్గా 104 సంవత్సరాలయింది. ఎవరీ మహత్ముడు? ఏమిటీ సత్యాగ్రహం?
ఈ దేశంలో పదిమందిని - చాలామంది నాయకులతో సహా - ఈ ప్రశ్న వేస్తే చాలా విచిత్రమైన సమాధానాలొస్తాయి. ఆ మధ్య ఓ టీవీ ఛానల్ మన జాతీయ గీతాన్ని ఎవరు రాశారు? అని కొందరు నాయకుల్ని ప్రశ్నలు వేసింది. చాలామంది నాయకులు తెల్లమొహం వేశారు. ఎక్కువ మంది వెర్రితలలు వేశారు. కొందరు నిస్సహాయంగా తలలూపారు. గాంధీజీకి కూడా అలాంటి గతిపట్టే రోజులు దగ్గరికి వచ్చాయేమో!
పూర్తిగా చదవండి
ఈ దేశంలో పదిమందిని - చాలామంది నాయకులతో సహా - ఈ ప్రశ్న వేస్తే చాలా విచిత్రమైన సమాధానాలొస్తాయి. ఆ మధ్య ఓ టీవీ ఛానల్ మన జాతీయ గీతాన్ని ఎవరు రాశారు? అని కొందరు నాయకుల్ని ప్రశ్నలు వేసింది. చాలామంది నాయకులు తెల్లమొహం వేశారు. ఎక్కువ మంది వెర్రితలలు వేశారు. కొందరు నిస్సహాయంగా తలలూపారు. గాంధీజీకి కూడా అలాంటి గతిపట్టే రోజులు దగ్గరికి వచ్చాయేమో!
పూర్తిగా చదవండి
Sunday, September 5, 2010
సహజీవనం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకి ఒక క్రిమినల్ కేసులో శిక్షవేసింది న్యాయస్థానం. పార్టీ వర్గాలు శివమెత్తారు. ఊళ్ళనిఅల్లకల్లోలం చేశారు. 2000 ఫిబ్రవరి 2 వ తేదీన ధర్మపురిలో కొందరు నాయక భక్తులు - కోయంబత్తూరు వ్యవసాయవిశ్వవిద్యాలయం బస్సుకి నిప్పంటించారు. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు - 44 మంది ఉన్నారు. కాలుతున్న మంటల్లోంచిబయటపడలేక ముగ్గురమ్మాయిలు - కోకిలావని, గాయత్రి, హేమలత అక్కడికక్కడే కాలి బూడిదయిపోయారు. ఇందుకుకారణమయిన ముగ్గురు స్వామి భక్తులు నెడుం చెళియన్, రవీంద్రన్, మునియప్పన్ అరెస్టయారు. విచారణలు జరిగాక - సేలంకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ అన్ని కోర్టులూ వీరికి మరణ శిక్షను ఏకగ్రీవంగా అంగీకరించాయి. మొన్ననే సుప్రీం కోర్టు ఈ శిక్షనుఖరారు చేసింది - పదేళ్ళ తర్వాత.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Subscribe to:
Posts (Atom)