Sunday, September 19, 2010

సాహిత్యంలో జీవహింస

ప్రపంచంలో చాలామందికి పెద్ద వ్యసనం - క్రాస్ వర్డ్ పజిల్. మరో పెద్ద వ్యసనం - డిటెక్టివ్ సాహిత్యం.
చాలా గొప్ప గొప్ప వ్యక్తులు,రచయితలు -డిటెక్టివ్ నవల చదవందీ నిద్రపోని సందర్భాలున్నాయి.
అలవాటు కారణంగా 'గొప్పవారి ' జాబితాలో చేరడం దొంగదారికాదనుకుంటే - నాకూ రెండు వ్యసనాలూ ఉన్నాయి.
క్రాస్ వర్డ్ పజిలు లేని ఆదివారం వస్తే - విలవిలలాడుతాను. స్టానీ గార్డనర్,అగాధా క్రిస్టీ, కోనన్ డాయిల్, ఎడ్గార్ వాలెస్,
పీటర్ చీనీ - ఇలా ఒకసారి కాదు, నాలుగయిదుసార్లు చదివిన నవలలున్నాయి.

3 comments:

  1. నమస్కారం గొల్లపూడి గారూ.

    చాలా రోజులుగా మీ బ్లాగు చదువుతున్నాను. నేను వికీపీడియా అభిమానిని. ప్రపంచంలోని సమాచారాన్ని అంటా ఉచితంగా అందరికి సమానంగా ఇచ్చే వెబ్ సైట్ అంటే నాకు చాలా ఇష్టం.

    కానీ
    "సంప్రదాయానీ,పెద్దమనిషితనాన్నీ గౌరవించే సభ్య సమాజం ప్రయోక్తకిచ్చిన మాటని58 సంవత్సరాలపాటు, 24 వేల సార్లు నిలబెట్టుకుంటూ వస్తోంది.
    కాని కంప్యూటర్ లో వికీపీడియా నెట్ వర్క్ మొదటిసారిగా ఒక దుర్మార్గాన్ని చేసింది. తన వెబ్ సైట్ లో ఈ నాటకంలో హంతకుడెవరోచెప్పేసింది. దయచేసి చెప్పవద్దని రచయిత్రి కుటుంబం, ఎందరో అభిమానులు విజ్నప్తి చేశారు. మొరపెట్టుకున్నారు. కానివికీపీడియా వారి మాటని చెవిని పెట్టలేదు. నీతి తప్పింది. ప్రపంచంలో చరిత్రని సృష్టించిన ఓ కళాఖండంలో 'రుచి'ని శాశ్వతంగాచంపేసింది."
    ఈ విషయంలో నేను కూడా వికిపీడియాని వ్యతిరేకిస్తున్నాను.

    "ఇది భౄణ హత్యకన్న మహాపాపమనీ, సాహితీ ప్రపంచంలో జీవహింసలాంటిదని నేనంటాను"
    నిజమే సర్.

    ReplyDelete
  2. Wikipedia is a site which allows anyone to keep any information on their site. It is just a platform for the information. It is the mistake of the person(s) who have put that information.

    Even if wikipedia removes this information, there are many other sites which contains this information. It is just that, since Wikipedia is popular, everyone goes to Wikipedia first.

    ReplyDelete
  3. "మర్యాదకి ఆంక్షలుండవు. విలువలే ఉంటాయి". చాలా చక్కగా చెప్పారు. మర్యాద ఇవ్వడం సాంప్రదాయం. రూల్స్ (ఆంక్షలు) అతిక్రమించడం (రోజూ ట్రాఫిక్ లో చూస్తూనే ఉన్నాం) దిగజారుడుతనం.

    ReplyDelete