Monday, February 28, 2011

ఇద్దరు పెద్దలు ఒక నివాళి

ఒక మహానటుడు:
ఈ వారం ఇద్దరు పెద్దలు వెళ్ళిపోయారు. ఇద్దరూ వారి వారి రంగాలలో ప్రసిద్ధులు, ప్రతిభావంతులు, నిష్ణాతులు, చరిత్రని తిరగరాసినవారు.
కిందటి జనవరి మొదటి తేదీన పుస్తక ప్రదర్శన ప్రారంభించడానికి ఆహ్వానించినప్పుడు - నేను కలుసుకోవాలని ఎదురు చూసిన మిత్రులు, హితులు మిక్కిలినేని. ఉదయం రైలు దిగుతూనే భార్యా సమేతంగా వెళ్ళాను.

Monday, February 21, 2011

'పేద' మెలో డ్రామా

ఆనాటి బ్రిటిష్ విన్ స్టన్ చర్చిల్ తన అనుభవాలలో చెప్పిన కథ ఇది. రెండవ ప్రపంచ యుద్ధం రోజుల్లో - ఇద్దరే పాపులర్ నాయకులు - హిట్లర్, చర్చిల్. మిగతా వారంతా వీరి తర్వాతే. ఇద్దరూ అమోఘమైన వక్తలు. రెండు వేర్వేరు దృక్పధాలకి ప్రపంచాన్ని ఆకట్టుకున్న నాయకులు - ఇద్దరూ విరోధి పక్షాలవారు.

Sunday, February 13, 2011

నీచనాయకులు

చాలా ఏళ్ళ క్రితం ఒకానొక పత్రికలో నేను టంగుటూరి ప్రకాశం గారి మీద కాలం రాశాను. వెంటనే ఒక పాఠకుడు ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ సంపాదకునికి లేఖ రాశాడు. ఆ లేఖలో వివరాలివి. ఇది ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన సంఘటన. ప్రకాశం గారు అతిధి బంగళా గదిలోంచి ఎంతకీ బయటికి రావడం లేదట. బయట కొందరు ఎదురు చూస్తున్నారు. తీరా ఆలశ్యానికి కారణం అయిన (ముఖ్యమంత్రి) చొక్కాకి తెగిపోయిన రెండు బొత్తాములు కుట్టించుకుంటున్నారట!

Sunday, February 6, 2011

అయ్యో మగాళ్ళు

దాదాపు 50 సంవత్సరాల కిందట నేనో పెద్ద కథ రాశాను. పేరు: అహంకారపు అంతిమ క్షణాలు. నాతో ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆనర్స్ చదివే సీనియర్ ఒకాయన ఉండేవాడు. నాగభూషణం. ఏలూరు దగ్గర ఏదో ఊరిలో ఉంటున్న ఓ హెడ్మాష్టరుగారబ్బాయి. తల్లిదండ్రుల్ని కాదని, ఓ టెలిఫోన్ ఆపరేటర్ని పెళ్ళిచేసుకున్నాడు. తండ్రి చదువుకి డబ్బు పంపడం నిలిపేశాడు. ఆమెకి సంపాదన ఉంది. ఇతన్ని చదివించేది. నరకయాతన పడిపోయేవాడు. మించి ఆమెని యాతన పెట్టేవాడు. సంస్కారే. చదువుకున్నవాడే.