Monday, March 7, 2011

'చావు' హక్కు

నాకు చాలా ఇష్టమైన ఆల్ర్ఫెడ్ హిచ్ కాక్ సినిమాల్లో 'ది రోప్' ఒకటి. ఒక సాయంకాలం - కేవలం ఊసుపోకకి, తమ తెలివితేటల్ని నిరూపించుకోవాలనే వికారమైన, విపరీతమైన ఆనందానికి ఇద్దరు యువకులు తన మిత్రుడిని హత్యచేసి ఒక సందుగ పెట్టెలో శవాన్ని ఉంచి, ఆ పెట్టె మీదే ఆ సాయంకాలం మిత్రులకి విందుని ఏర్పాటు చేస్తారు. వాళ్ళ టీచరు హత్యని గుర్తుపడతాడు. అప్పటి ప్రముఖ నటుడు జేమ్స్ స్టూవర్ట్ ఆ పాత్రని నటించాడు. విషయం తెలిసి షాక్ అయి వాళ్ళిద్దరినీ నిలదీస్తాడు. "మరొక వ్యక్తిని చంపేహక్కు మీకెవరిచ్చారు? మీరేం దేవుళ్ళా?" అంటాడు. సంవత్సరాలు గడిచినా ఆ సన్నివేశం నాకు జ్నాపకం వస్తూంటుంది.
పూర్తిగా చదవండి

5 comments:

  1. మారుతీ రావు గారికి నమస్కారాలు...

    ఒక కర్మకి ఫలాన్నాశించినా ఎలాంటి ఫలితమొస్తుందొ ఊహించలేం, జీవితానికి చావునాశించినా ఎప్పుడు ఎలాంటి మరణమొస్తుందో చెప్పలేం.

    ఐతే ఫలితందిశగా కర్మని చేసినట్టు, చావుదిశగా జీవితాన్ని తీసుకెల్లడమే పెద్ద ప్రశ్న!
    జీవితంలో తట్టుకోలెని, తనవల్ల కాని, అసహనమైన కోణాన్ని ఎదుర్కోవడం మనిషికి చేతకాదు.

    వాస్తవానికి మనిషి చావుని ఎక్కువసేపు చూస్తూవుండలేడు...
    కొనప్రాణం తో విలవిల్లాడుతూ కొట్టుమిట్టాడుతున్నచీమనో, బొద్దెంకనో అయితే వెంటనే చంపేస్తాడు.

    ద్రువపు ప్రాంతాలలోని ఎస్కిమో వాసుల దగ్గర ఉండే పెంపుడుకుక్కలు(eskimo dogs) ఒక్కోసారి కౄరంగా(wild) మారి అక్కడి జింకలపై(rack deer) దాడి చేస్తాయి. అప్పుడు అవి యజమాని మాటకూడా వినవు.
    ఆ ద్రువపుజింకకి తన ప్రాణం అంత సుళువుగా పోదు. ఆ ఘటన చాలా సేపు జరుగుతుంది. అప్పుడు యజమాని ఆజింకని చేరి దాని మెదడులో కత్తిని గుచ్చి మరణం ప్రసాదిస్తాడు...ఆతరువాత జింక కాళ్ళని మొక్కుతూ క్షమాపణలు వేడుకుంటాడు... ఇది వారి జీవితాల్లో సాధారణం.

    ఇది ఎవరి పోరాటమో అర్థం కాదు. వాస్తవాని ఎవరి పోరాటం వారిది.

    ఆ చీమ, ఆ బొద్దెంక తిరిగి బతక గలుగలవా? లేక ఆ జింక ఆ కుక్కలనుండి తప్పించుకోగలదా? అనే విషయాలు వెవరూచెప్పలేరు.
    కాని విలవిల లాడుతుంటే మాత్రం చూడలేడు. కాని మనిషి వాటికి చావే మేలని భావిస్తాడు.

    అతి పెద్ద ప్రశ్నేంటంటే,
    అది తట్టుకోలేని జీవితానికి స్వేచ్చనివ్వడమా? లేక నిలుపుకోలెని సహనానికి స్వేఛ్చనివ్వడమా? అంతుబట్టని విషయం?

    ధన్యవాదాలతో

    సత్య



    అదే బుద్ధిని ఇప్పుడు మనుషులపై

    ReplyDelete
  2. వున్నాడో లేడో తెలీని దేవుడిచుట్టూ, వాడిచుట్టూ అల్లుకుపోయిన మతంచుట్టూ మన నైతికత ఎందుకు పరిభ్రమిస్తుండాలి? ఎంతకాలం పరిభ్రమిస్తుండాలి? ఒక వ్యక్తి బ్రతికుండటం సమాజానికి చేటు అని భావించి మరణశిక్ష విధించే అధికారం ప్రభుత్వానికి వున్నట్లే. ఇలాంటి బ్రతుకు బ్రతకాల్సిన అవసరం నాకు లేదు అననుకున్నవేళ మరణించే హక్కు వ్యక్తులకూ వుండాలి. జీవించమని బలవంతపెట్టే అధికారం ప్రభుత్వాలకుండటం నాకు నచ్చదు. కాకపోతే ఇక్కడ ఆహారాన్నాపుచేయడం అనేది అమె "హుందాగా" చనిపోవడానికి ఎలా దోహదం చేస్తుందో బొత్తిగా అర్ధం కాలేదు.

    ReplyDelete
  3. మనసు భారమైంది. Shanbagh ను బ్రతకనివ్వడమే మంచి నిర్ణయం. మనం దేవుళ్ళం కాదు గాబట్టి.

    ReplyDelete
  4. Indian Minervaగారు, ఇందులో మతం ప్రసక్తి లేదండి. మౌలికమైన మానవుని మనోభావాలకి సంబంధించినదే ఇది.

    నా ఉద్దేశ్యంలో, ఏ మానవత్వం, జబ్బుతో ఉన్న మనిషిని లేదా వృద్ధాప్యంతో కృశించిపోయిన మనిషిని కూడా బతికించడానికి మానవ ప్రయత్నం చెయ్యమని ప్రోత్సహిస్తుందో, అదే మానవత్వం, బతకు దుర్భరమైపోయి మరింక చెయ్యగలిగేది ఏమీ లేని వాళ్ళకి చావే మేలేమోనన్న ఆలోచనని కూడా కలిగిస్తుంది. మొదటిది నైతికమైతే రెండోదికూడా నైతికమే. ప్రాణాలు పోసే హక్కు లేనివాళ్ళకి తీసే హక్కు లేదన్న వాదన సమంజసమే అనిపిస్తుంది. కాని, ప్రాణాలు నిలిపే హక్కు మనిషి తీసుకున్నాడు కదా. ఎన్ని రకాల జబ్బులకి మనిషి మందు కనిపెట్టి వాళ్ళందరి ప్రాణాలు నిలపెడుతున్నాడు. వయసుడిగి, సహజంగా బలహీనపడిపోయిన శరీరాన్ని సైతం మందులూ మాకులూ ఇచ్చో, కృత్రిమ శ్వాసలు పెట్టో ప్రాణం నిలపడానికి ప్రయత్నించడం లేదూ. అంటే "సహజ" మరణంపై కూడా మనిషి ఎప్పుడో తన యుద్ధాన్ని ప్రకటించి, ప్రాణాలు నిలిపే అధికారాన్ని తీసుకున్నాడు కదా. మరి ప్రాణాన్ని రక్షించనక్కర లేదనుకున్నప్పుడు మానేసే హక్కు తనకి లేదా?

    నైతికత కన్నా, ఆచరణలో ఎదురయ్యే చిక్కులే ఇందులో ఎక్కువ. మారుతీరావుగారు చెప్పినావిడ విషయంలో ఆవిడకి ప్రాణం నిలుపుకోవాలని ఉన్నదా లేదా అని నిర్ణయించడం కష్టం. ఆవిడ తరఫున వేరే వాళ్ళు నిర్ణయించ వచ్చా అన్న దగ్గర చిక్కొస్తుంది. అలాంటి నిర్ణయం ఇతర సందర్భాలలో అనేక ప్రమాదాలకి దారితీసే అవకాశం ఉంటుంది. అంచేత ఇలాంటి సందర్భాలలో దీనికి అనుమతివ్వడం కోర్టుకి సాధ్యం కాదు. అంతేకాని ఇందులో నైతికత ప్రసక్తి లేదని నేననుకుంటాను.

    ఒక వ్యక్తి తాను మరణించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు, దానికి తగిన ఆధారాలున్నప్పుడు, దాన్ని అనుమతించాలన్నదే నా అభిప్రాయం కూడా. ఇది ధర్మానికి సంబంధించిన విషయం కాని, చట్టానికిందులో ప్రమేయం అనవసరం.

    ReplyDelete
  5. guzaarish movie choosi chala upset ayya...ippudu ee post...matallo cheppaleni badha manasuni melipedutundi....tappu okaru chestey siksha okaru anubhavistaru eppudu endukani... ilanti sensitive matters lo edupu agatam ledu ee madhya... :(

    ReplyDelete