Monday, April 11, 2011

అన్నా..ఆహా..ఆహాహా.

ఉద్యమాలూ, నిరాహార దీక్షలూ, నినాదాలూ, బుకాయింపులూ దైనందిన కార్యక్రమాలుగా మారిపోయిన ఈ రోజుల్లో - మహాత్మాగాంధీని 'పాత చీపురుకట్ట'లాగా వాడుకుంటున్న కాలంలో, 'దేశసేవ' అనే బూతుమాటని 'మాటలు కూడా సరిగ్గా చెప్పలేని ప్రతీ దోపిడీదారుడూ వాడుకుని నిచ్చెన ఎక్కుతున్న ఈనాటి వైకుంఠపాళీ రాజకీయాల్లో, లాప్ టాపులూ, గ్రైండర్లూ, మంగళసూత్రాలూ వొడ్డి - ఎవడి బాబు సొమ్ముతోనో ఓట్లు కొనుక్కోడానికి పందెం కాస్తున్న పార్టీలు పేట్రేగిపోతున్న నేపధ్యంలో, ఈ దేశంలో 'అవినీతి' ముద్రపడిన నాయకులు పిఏసి సమావేశాలకి అలా షికారు వెళ్ళినట్టు వెళ్ళి మాయమవుతున్న తమాషాని చూస్తున్న ఓ మామూలు, నేలబారు మనిషి - కేవలం 'నీతి' పెట్టుబడిగా ఎంత సాధించవచ్చునో, దాని ప్రభావం ఎంత ఉండగలదో - అన్నా హజారే గతవారం రోజులుగా నిరూపించారు. ప్రజల నైరాశ్యం, ఆవేశం అనే కార్చిచ్చు ఎంత ఉధ్రుతంగా దేశమూ, రాష్ర్టమూ, జిల్లా, గ్రామం స్థాయిని దాటి ఎలా రేగిందో కోట్లాది మంది విస్తుపోయేలాగ, ఆవేదనతో రెచ్చిపోయేలాగ చేయగలదో గత ఏడురోజులూ నిరూపించాయి. గంటల్లో ఢిల్లీ సింహాసనం పునాదుల్తో కదిలింది. నాయకులు అర్ధంకాక దిక్కులు చూశారు.
పూర్తిగా చదవండి

5 comments:

 1. Lokpal Bill: Govt agrees to terms fearing RSS

  http://indiatoday.intoday.in/site/Story/134760/india/lokpal-bill-government-agree-to-terms-fearing-rss.html]

  One of the major considerations of the government to somehow reach a consensus with Anna Hazare was the possibility of a takeover of his movement by a resolute Opposition and the most effective "cultural" organisation doing politics in the country - the Rashtriya Swayamsevak Sangh (RSS).

  Besides planting their popular mascot, yoga guru Ramdev, who performed a series of antics at Anna Hazare's protest site on Friday afternoon, the RSS had passed a resolution exhorting its cadre to actively join the social activist's movement against corruption.
  "We have passed a resolution. Our friends and supporters across the country have been asked to actively join Anna's movement. Corruption is an evil that concerns every citizen of India. Therefore, the RSS lends its support," Madhav said.
  This confirmed what was being suspected in the ruling establishment from the beginning of Hazare's agitation. RSS general secretary Suresh Joshi has written a letter extending support to Hazare.

  The letter was duly handed over to Hazare by RSS spokesperson Ram Madhav on Friday.

  ReplyDelete
 2. మారుతీరావుగారూ,

  అసందర్భం కావచ్చు, మన్నించండి. మిమ్మల్ని సినిమాలలో చూడటమే. ఈ బ్లాగు ద్వారా ఇల్లా అయినా కలుసుకోవటం కడు ఆనందదాయకం.

  ఇక విషయానికొస్తే, నేనూ హజారేగారికి మద్దతుగా నాలుగైదు టపాలు టపటపా రాసేసినవాడినే. దేశములో న్యాయవ్యవస్థ సైతం విలువల వలువలు వదిలేస్తున్న ఈ తరుణంలో లోకపాల్ వ్యవస్థ మాత్రం మరో సి.బి.ఐ కాదన్న భరోసా ఏమి లేదు కదా! పోరాడి సాధించుకున్న సమాచార హక్కు ఎలా అభాసుపాలవుతోందో చూస్తున్నాం కదా! మీ వ్యాఖ్యానం....?

  అచంగ, ప్రెస్టన్, ఇంగ్లాండ్

  ReplyDelete
 3. మారుతీ రావు గారు..ఇక్కడ నేను రాస్తున్నది అసందర్బం అయినా మీ నుంచి ఒక పుస్తక సహాయాన్ని పొందటం కోసం నేను ఇది రాస్తున్నాను. అప్పుడెప్పుడో పుస్తకండాట్ నెట్ లో హెడ్దీ లేమర్ ఆత్మకథ గురించి మీరు చెప్పాక ఆ పుస్తకాన్ని చదవాలన్న ఆసక్తి కలిగింది.ముఖ్యం గా Ectasy and me అన్న ఆ టైటిల్, హెడ్డీ లేమర్ గురించి వికీపీడియా ద్వారా తెలుసుకున్న కొంత సమాచారం నాలో ఈ పుస్తకాన్ని చదవాలన్న ఆకాంక్ష ను మరింత పెంచాయి.ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరు..హైద్రాబాద్ లో కానీ బెంగుళూర్ లొ కానీ..పోనీ ఏదైనా లైబ్రరీ లో..ఒకవేళ ఎక్కడా లేకపోతే మీ దగ్గరున్న పుస్తకాన్ని జిరాక్స్ తీయించుకోవటానికి అనుమతిస్తారా? నాకు ఈ పుస్తక సహాయాన్ని చేస్తారని ఆశిస్తున్నాను.
  నేను అమీర్ పేట్ సమీపం లో వున్నాను. నా మెయిల్ ఐ.డి.jagan.d.mohan@gmail.com

  ReplyDelete
 4. 14.04.2011
  గురువు గారూ,
  మీకు 72వ జన్మదిన శుభాకాంక్షలు.
  భగవంతుడు మీకు ఎల్లవేళలా సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ...
  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం & కుటుంబ సభ్యులు

  ReplyDelete
 5. మీకు జన్మదిన శుభాకాంక్షలు...మీఎరు ఇంకా ఎన్నో రాయాలని మాలతివారిని గైడ్ చెయ్యాలని కోరుతూ
  లక్ష్మీ రాఘవ

  ReplyDelete