Monday, April 18, 2011

ఓ గుండయ్య కథ

నేను దైవ భక్తుడిని. కాని చదువుకున్న దైవభక్తుడిని. చదువుకోని దైవభక్తుడు తన విశ్వాసానికి సమాధానం చెప్పలేడు. కాని అతను నాకంటే చాలా విధాలుగా, చాలా కారణాలకి నాకంటే గొప్ప దైవభక్తుడు కావచ్చు. నేను కారణాలు చెప్పగలను.
మన దేశంలో రకరకాల ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ వ్యాపార కేంద్రాలు. నేను 20 సంవత్సరాలు ఆకాశవాణిలో పనిచేశాను. కాని ఏనాడూ ఆకాశవాణి గొప్పతనాన్ని బేరీజు వేసే ప్రయత్నం చెయ్యలేదు. పక్కన హిరణ్య కశిపుడు ఉంటేగాని ప్రహ్లాదుడి గొప్పతనం అర్ధం కాదు. ఇన్ని ఛానళ్ళు సామూహికంగా ఆ ఉపకారం చేస్తున్నాయి. నేను ఎక్కువగా ఛానళ్ళు చూడను. చూడకుండా జాగ్రత్త పడతాను. అది నా ఆరోగ్య రహస్యం.

1 comment:

  1. చేతనయితే దిక్కుమాలిన కార్యక్రమాలను కట్టిబెట్టి మంచి పాటల్ని ప్రసారం చెయ్యండి. మంచి సంగీతాన్ని పంచండి. మంచి మాటల్ని చెప్పండి.... you are innocent. good music is allergic to our channels. classical music is an aversion. please do not give them such suggestions.please conserve your energy.

    madhuri.

    ReplyDelete