Monday, October 10, 2011

మెక్సికో మార్కు పెళ్ళిళ్ళు

ఈ మధ్య మెక్సికోలో కొత్తరకమైన పెళ్లి చట్టాలు అమలులోకి తేవాలని తలపోస్తున్నారు. ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుని -తీరా ఇద్దరి మధ్యా సంబంధం పొసగక విడిపోవాలని -విడాకులు తీసుకోవాలని తంటాలు పడే నూతన దంపతులు ఎక్కువగా కనిపిస్తున్నారట. వారి సౌకర్యార్థం అసలు పెళ్లిళ్ల లైసెన్సులనే రెండేళ్లకు పరిమితం చెయ్యాలని ఆలోచిస్తున్నారట.

4 comments:

  1. పండగ నాడు కూడా పాత మొగుడేనా అన్నా సామెతకి ఇప్పుడు చేతల రూపం వచ్చిందనమాట!

    ReplyDelete
  2. "సంప్రదాయం సత్ప్రవర్తనకి దగ్గరతోవ. నమ్మకమయిన రేపుకి పునాది. పెళ్లి అనే వెండి పళ్లానికి ఆధారమైన గోడ."

    సత్ప్రవర్తనకి అర్థం మారిపోయిన రోజులండి ఇవి. ' సత్తు ' ని గురించి ఈరోజుల్లో ఎవరాలోచిస్తున్నారు? రేపు, ఉంటుందో లేదో తెలీదు. ఇంక ఇలానే ఉంటుంది అని ఎలా నమ్మగలరండి? వెండికి ఈ మధ్య కాలంలో ధర పెరిగినంత మాత్రాన, బంగారానికి సాటి అవుతుందా? హాయిగా బంగారం లాంటి ' మళ్ళీ పెళ్ళి, ఎవరితోనైనా రెడీ ' అనే కాన్సెప్ట్ ఉండగా ఈ వెండికి, సత్తుకి విలువెవరు ఇస్తారండి? విలువేలేని వాటికి మళ్ళీ సత్ప్రవర్తన, సాంప్రదాయం అనే గోడ, పునాది కూడానా?

    నిజవే. పెళ్ళికి విలువెక్కడ ఉంది? అదేదో సినిమాలో కవిత చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ చేసుకునేదే పెళ్ళి. సోమవారం ప్రేమ, మంగళవారం పెళ్ళి, బుధవారం అప్పటి దాకా కాకుంటే కాపురం, గురువారం అభిప్రాయభేదం, శుక్రవారం విడాకులు, శనివారం పబ్బుకెళ్ళి బాధ మర్చిపోవటం (ఆడ, మగ తారతమ్యం లేని అతి గొప్ప బాధానివారిణి) ఆదివారం సింగిల్ అని రిలేషన్ షిప్ స్టేటస్ మార్చుకుని I am now available అని నలుగురికీ సిగ్గులేకుండా చెప్పుకుని ' మళ్ళీ ' కి రెడీ అయ్యే రోజులు కదా ఇవి. ఎంచక్కా వారంలో తేలిపోతుంది జీడిలా జీవితాంతం పట్టుకు వేలాడకుండా.

    మొన్నా మధ్య ఒక స్నేహితులింట్లో వాళ్ళ చుట్టం ఒకాయన కలిశాడు. ఆ మనిషి స్టేటస్ ' సింగిల్ ' ట. మంచి అమ్మాయి కోసం చూస్తున్నారు అని చెప్పుకొచ్చారు. వివరాలడిగితే ఆ ' మనీషి ' కి మూడు పెళ్ళిళ్ళయ్యాయట. నాలుగో పెళ్ళాం కోసం ప్రయత్నం. మొదటి ఆవిడని ఈయన ప్రేమించలేకపోయాడట, రెండో ఆవిడ ఈయన్ని ప్రేమించలేకపోయిందట. మూడో ఆవిడకి ఈయనకి మొదటినించి సరిపడలేదుట. ప్రేమని వెతుక్కుంటున్నాను అని పాపం వాపోయాడు. మరి ఇంత ప్రేమరాహిత్యంలోనూ మొదటి భార్యతో ఇద్దర్నీ, రెండో భార్యతో మరొకర్నీ పిల్లల్ని కన్నాడట. వెఱ్ఱి కానీ ప్రేమకి, పిల్లలు పుట్టటానికి సంబంధం ఎక్కడుంది? ప్రేమ దారి ప్రేమదే, పెళ్ళి దారి పెళ్ళిదే, పిల్లల దారి పిల్లలదే. శోభా డేని తిట్టిపోస్తాం కానీ ఆవిడ ఫాలో అయిందే చెప్పుకుంది. ' నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలు ' అంటూ. ఎంత చక్కటి నిజం. ఒక్కరితో పెళ్ళైతే వాళ్ళతోనే బావిలో కప్పలా ఉండాలి. అదే ఒకరికన్నా ఎక్కువ చేసుకుంటే వాళ్ళందరి కుటుబాలు మనవే. వసుధైక కుటుంబానికి ఇంతకన్నా చక్కటి నిర్వచనాన్ని ఎవరైనా ఇవ్వగలరా?

    ReplyDelete
  3. ఇన్నివంకరటింకరలు తయారయ్యాక ఇంకా 'పెళ్ళి' అనే మాటకేమయినా అర్ధం మిగిలి ఉన్నదా అటువంటి సమాజాల్లో? అయనా అలాంటి చోట 'మంచి అమ్మాయి' లేదా 'మంచి అబ్బాయి' అంటే యేమన్నమాట? యెలా అర్ధం చెప్పాలో తెలియటంలేదు.

    ReplyDelete
  4. మన పురాణాల్లోని గాంధర్వ వివాహాల సంగతేమిటి? అష్టవిధ వివాహాలని అంగీకరించారు ఉ కదా. మనం ప్రాజాపత్య వివాహాన్ని ఇప్పుడు ఆనుసరిస్తున్నాము. .అదే మాసాంప్రదాయం కూడా.కాని ఈరోజుల్లో మైనార్టీ తీరేక వివాహం వారి వారి విజ్ఞతకే వదిలి వేయడం మంచి దనుకొంటాను.

    ReplyDelete