ఈ దేశంలో ఇంకా పూర్తిగా గబ్బు పట్టని వ్యవస్థలు రెండు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ, సైనిక వ్యవస్థ. ఒకటి వ్యక్తి నైతిక జీవనాన్ని, మరొకటి వ్యక్తి స్వాతంత్య్రాన్ని కాపాడే ఆదర్శాలు. కానీ ఈ రెండింటి మీదా ప్రజల నమ్మకం క్రమంగా సన్నగిల్లే చాలా దయనీయమైన పరిణామాలు ఈ మధ్య మరీ ముమ్మరంగా కనిపిస్తున్నాయి. మొన్నటిదాకా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వున్న కె.జి.బాలకృష్ణన్ ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టిన కేసు నడుస్తోంది. ఇది న్యాయవ్యవస్థకి పట్టిన గ్రహణం. ఇక సైనిక వ్యవస్థలో అడపా తడపా పునాదుల్ని కదిపే చారిత్రక కుంభకోణాలు ఎన్నో తలెత్తుతూనే ఉన్నాయి.
పూర్తిగా చదవండి
Monday, April 2, 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment