ఒక దయనీయమైన కథ. అత్యంత హృదయ విదారకమైనది. పొలాల్లో కూలి చేసుకునే భార్యాభర్తలకి ఒక్కడే కొడుకు. విమానయాన శాస్త్రంలో పట్టభద్రుడయాడు. ఆస్ట్రేలియాలో ఉద్యోగానికి సిద్ధపడుతూండగా ఆక్సిడెంటయింది.
పూర్తిగా చదవండి
Sunday, April 29, 2012
Subscribe to:
Post Comments (Atom)
న్యాయవ్యస్థ వణకటం కాదు గాని, ఇలాంటి విన్నపాలు మన్నిస్తే ఈ రకమైన యూథ్నేషియ(Euthanasia) క్రిమినల్స్ చేతిలో పడి ఎన్నెన్ని వికార రూపలు ధరించి సమాజాన్ని పట్టి పీడిస్తుందో అన్న ముందు జాగ్రత్త . అటువంటి జాగ్రత్త న్యాయాధీశులు తీసుకోవటం ఎంత మాత్రం తప్పు కాదు అని నా అభిప్రాయం.
ReplyDeleteకొన్ని కొన్ని ఆలోచనలు డిబేటింగ్ కు బాగా పనికివస్తాయి, అక్కడ ఒక పధ్ధతిలో మాట్లాడటం, రాజకీయంగా అనుకూలమైనవిగా (Politically Correct)(మరణ శిక్ష రద్దు చెయ్యాలి వంటివి) ఉండి అలా ఆ మాట్లాడిన వ్యక్తికి ఒక గుర్తింపు తెస్తుంది. ఆ గుర్తింపు కోసం అలా మాట్లాడే వాళ్ళు కోకొల్లలు. వాళ్ళకు ఉన్న అసలైన అభిప్రాయం ఏమిటో ఎవరికీ తెలియదు, వాళ్ళకే తెలియదు! ఎందుకు అంటే ఏ అభిప్రాయాన్ని వెల్లడిస్తే కీర్తి, పేరు వస్తాయో అటువంటి ఆలోచనలనే తెచ్చుకుంటారు, సమాజంలో ప్రస్తుతం పేరు వచ్చే అవకాశం ఉండే అభిప్రాయాలే వెల్లడించటానికి అలవాటుపడిపోయి ఉంటారు. అవి స్వతహాగా పూర్తి స్వేచ్చతో ఆలోచించటం వల్ల వచ్చే ఆలోచనలు కావు, "కండిషన్‌డ్" ఆలోచనలు. అటువంటి అభిప్రాయాలు అమలుపరిస్తే సమాజం మీద పడే దుష్ఫలితాలు, ఆ అభిప్రాయాలు వెలిబుచ్చటం వల్ల వచ్చే "ఊహా కీర్తి" మాయలో పడటం వల్ల, వాళ్ళ ఆలోచనలలోకి రానే రావు. సమాజం మొత్తానికి సంబంధించిన విషయం ఎమోషనల్ గా అలోచించి దుందుడుకు నిర్ణయం తీసుకోవటం మంచిది కాదు, సరైన నిర్ణయం రాదు.
మెర్సీ కిల్లింగ్‌కు బదులుగా అలాంటి వారిని భరించలేని పేద కుటుంబాలను ఆదుకోవటానికి ఒక ప్రక్రియ మొదలుపేట్టి (అటు ప్రభుత్వం ఇటు స్వచ్చంద సంస్థలు కలిసి) అటువంటి వ్యక్తులను జాగ్రత్తగా చూసుకునే వ్యవస్థ ఏర్పరిచి పెంపొందించాలి. అప్పుడు పాపం ఆ ముసలి తల్లి వంటి వారు తమ సంతానాన్ని మెర్సీ కిల్లింగ్ చేస్తే కాని తమకు మనశ్శాంతిగా చనిపొయ్యే అవకాశం లేదని భావించటం జరగదు అని నా అభిప్రాయం.
మారుతిరావు గారూ! మీ వ్యాసం చరమ సత్యమైన మృత్యువు గురించి మీమాంస చేస్తూ ఆలోచనలు రేపుతూ సాగింది. మృత్యువుపై భిన్నకోణాల్లో చేసిన మీ వ్యాఖ్యానాలు ఎంత వాస్తవికమో అంత కవితాత్మకంగా ఉన్నాయి!... క్లుప్తంగా సూటిగా మరోసారి చదవాలనించేలా!
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete@శివరామప్రసాదు కప్పగంతు
ReplyDeleteచాలా చక్కగా చెప్పారండి.