Monday, June 25, 2012
నిజం నిద్రపోయింది
చాలా సంవత్సరాల కిందటిమాట. ఒక ఆస్తి రిజిస్ట్రేషన్‌కి 30 లక్షలు అదనంగా స్టాంపు చార్జీలు కట్టాలి. మినహాయింపుని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. లాయరుగారు చిరునవ్వు నవ్వుతూ రెండు మూడు సుళువులు చెప్పారు. ఈ చార్జీలు ఎంతకాలం కట్టకుండా వాయిదా వెయ్యాలి? అయిదేళ్లా? ఆరేళ్ల? సుళువులు వున్నాయి. మీ ఫైలు అయిదేళ్లు కనిపించకుండా మాయమయిపోతుంది. అసలు పూర్తిగా కట్టకుండా దాటెయ్యాలా? ఫైలు శాశ్వతంగా మాయమైపోతుంది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Monday, June 18, 2012
గిరీశం ఆవేదన
వెనకటికి ఒకాయన రేడియోలో కర్ణాటక సంగీతాన్ని వింటూ పక్కాయన్ని అడిగాడట;
''ఏమండీ, ఆ పాడేది ఎమ్మెస్ సుబ్బులక్ష్మే కదా?'' అని. ''తమకెందుకూ అనుమానం వచ్చింది?'' అన్నాడట పక్కాయన. ''ఏం లేదు. పాట మధ్యలో అపశ్రుతి వస్తేను'' అన్నాడట. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అయినంత మాత్రాన అపశ్రుతి రాకూడదన్న రూలు లేదు. తప్పటడుగు మానవమాత్రులకి సహజం. మొన్న పేపరు చదువుతూ ఒకాయన గుండె బాదుకున్నాడు
పూర్తిగా చదవండి
''ఏమండీ, ఆ పాడేది ఎమ్మెస్ సుబ్బులక్ష్మే కదా?'' అని. ''తమకెందుకూ అనుమానం వచ్చింది?'' అన్నాడట పక్కాయన. ''ఏం లేదు. పాట మధ్యలో అపశ్రుతి వస్తేను'' అన్నాడట. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అయినంత మాత్రాన అపశ్రుతి రాకూడదన్న రూలు లేదు. తప్పటడుగు మానవమాత్రులకి సహజం. మొన్న పేపరు చదువుతూ ఒకాయన గుండె బాదుకున్నాడు
పూర్తిగా చదవండి
Sunday, June 10, 2012
మాకొద్దీ నల్లదొరతనమూ...
విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ గారు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణాలు చేసేవారందరినీ పార్లమెంటు మెంబర్లుగా గౌరవించాలని యాజమాన్యానికి విన్నవించారు. ఇది చాలా అన్యాయమని నా మనవి. బెర్నార్డ్ షా ''ఆండ్రోక్లిస్ అండ్ లైన్'' నాటకంలో ననుకుంటాను. ఒకాయన పక్కవాడిని 'కుక్కా' అని తిడతాడు. వెంటనడుస్తున్న అతని కుక్క అభ్యంతరం తెలుపుతుంది. ''స్వామీ! ఇది అన్యాయం. నేనేం తప్పు చేశాను?'' అని. కుక్కకీ మనిషికీ ఉన్న తేడాని చక్కగా విశ్లేషించిన ఒకే ఒక్క రచయిత మార్క్‌ట్వేన్. ''ఆకలి వేస్తున్న కుక్కకి అన్నం పెడితే అది నిన్ను కరవదు. కుక్కకీ మనిషికీ ఉన్న తేడా యిదే'' అన్నాడు.
Monday, June 4, 2012
తెలుగు బురద
తెలుగు అధికార భాష అయిన రోజులివి. మన నాయకులు తెలుగుని అందలం ఎక్కిస్తున్న రోజులివి. కాకపోతే ఇందులో చిన్న తిరకాసు ఉంది. చాలామంది నాయకులకే సరైన తెలుగు రాదు. అందువల్ల వారు అప్పుడప్పుడు పప్పులో కాలు వేయడం, తప్పులో కాలు వేయడం జరుగుతూంటుంది.
Subscribe to:
Posts (Atom)