విద్యా వ్యాపారం ఒక విషవృక్షం. దీనికి మూలాలు ఎక్కడో ఎప్పుడో పడ్డాయి. ఈ తరంలో ఉపాధికీ, మంచి జీవనానికీ, సంపాదనకీ, కులాల వికాసానికీ, భాష సర్వ నాశనం కావడానికీ, అన్నిటికీ మించి చదువులు కార్పొరేట్ వ్యాపారం కావడానికీ -అన్నిటికీ పునాదులు ఏర్పడి తేలికగా నూటపాతిక సంవత్సరాలయింది. ''అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయిష!'' అని అనుకోవలసిన రోజులు. నాకు తెలిసింది, తెలిసినంత మట్టుకు విన్నవిస్తాను.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
ఎంత ఆవేదన పడ్డా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తెలుగువాళ్ళం ఉన్నాము. నేను చదివినంత తెలుగు కూడా మా అబ్బాయి కి చదివే వీలుకల్పించలేక పోతున్నాననే బాధ. ఆంధ్ర దేశంలోనే ఇలా ఉంటే ఇక బయటి దేశాలలోని వారి పరిస్థితి? మా మేనమామ ఇక్కడే యాభై నాలుగేళ్ళ క్రితం అమెరికా వెళ్ళాడు. నలుగురి పిల్లలకూ తెలుగు రాదు.అక్కడి వారిగా మారిపోయారు. అదే మా మేనత్త కూతురు బెంగాలీ అతన్ని పెళ్ళి చేసుకుని పది సంవత్సరాలుగా అక్కడే ఉంటూ పిల్లలకు తెలుగూ, బెంగాలీ రెండూ చదవడం రాయడం నేర్పుకుంది ఉద్యొగం చేస్తూ కూడా. పిల్లలకు మాతౄ భాష నేర్పించాలనే జిజ్ఞాస తల్లితండ్రులకు కలగాలి. అటు ఇంగ్లీషూ ఇటు తెలుగూ సరిగ్గా రాక పిల్లలు కష్టపడుతున్నారు. ఎన్ని భాషలు చదివినా మాతృభాష మీద పట్టు ఉన్న పిల్లలో ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. ఇది నిజం.
ReplyDeleteభయంకరమైన ఈ విద్యా విష సర్పం నుంచి బయటపడే మార్గాలే తెలియడంలేదు.
నమస్కారం ,
ReplyDeleteముఖస్తుతి అనుకోకపోతే .... ఉపయోగపడే ,ఆలోచింపజేసే శీర్షికలు రాస్తున్నందుకు ధన్యవాదాలు
కార్పొరేట్ సంస్కృతి బందీలైన నాలాంటి తల్లితండ్రులకు మరో దారి లేకుండా పోతున్నది , గుండెలో ఏ మూలో బాధ తొలుస్తున్న,మిగతా పిల్లల మద్య "ఆడ్మాన్ అవుట్" ల కాకూదన్న భయం ,మరో వైపు విద్య సరస్వతి పుత్రుల నుండి లక్ష్మీ పుత్రుల చేతుల్లోకి వెళ్ళింది, బడికి వెళ్ళే నా బిడ్డని చుసిన ప్రతీసారి చిన్నప్పుడు చదివిన ఓ కవిత వెంటాడుతుంది
మళ్లీ మన పాఠాల్లో పద్యాల్ని గద్యాల్న్ని జీవింపజేయాల్సి వుంది
సంస్కృతీ నిదులనిముడ్శుకున్న వేద నదులుగా ప్రవహింపజేయాల్సివుంది
మాతృభాష పేగు తెంచుకుని మరొక్కసారి మనదేశంలో పుట్టాల్సివుంది.