మన దేశంలో చట్టానికి కళ్లు లేవు. కాని కాళ్లున్నాయి. కళ్ల ముందు జరిగిన సంఘటన ఆయినా ఎవరూ నోరెత్తరు. రాజధాని నగరం నడిబొడ్డులో ఒకాయన యిద్దర్ని రోడ్డు మధ్య నిలబెట్టి కారు ఆపి, తన మనుషుల్ని పిలిపించి చావగొట్టించడాన్ని- ఎంత లేదన్నా వందమంది చూసి వుండాలి. కాని మన పోలీసులకి ఫిర్యాదు కావాలి. దాని గురించి రిపోర్టు కావాలి. ఆ తర్వాత చర్య. ఈ ఆకృత్యాన్నిజరిపింది ఓ సినీ కధానాయకుడు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
చక్కని ఉదాహరణలతో సూటిగా మీరు రాసింది బాగుంది. అతి మొహమాటాల, పాడు మర్యాదల హిపోక్రసీనీమా రంగంలో ఉంటూ కూడా హీరో కొడుకు గురించి ఇలా నిష్కర్షగా రాయటం మరీ బాగుంది.
ReplyDeleteఅభినందనలతో పాటు ఈ సందర్భంగా మీరు పదేపదే వాడే ఓ పోలికకు నా నిరసన కూడా!
‘అధికారం చట్టానికి గాజులు తొడుగుతుంది’- అసమర్థత అని చెప్పటానికి గాజులు తొడగటాన్ని ప్రతీకగా వాడటం మీ రచనల్లో తరచూ కనిపిస్తుంటుంది. గాజులను ధరించే అసంఖ్యాకమైన స్త్రీలను ఈ పోలిక అవమానించేలా ఉంటుందని మీకు అనిపించదా?
అమెరికాలోనే కాదు సర్, ఆఫ్రికాలోని రువాండాలో కూడా పోలీస్ పవర్ ఇంతే. మా దేశంలో ఒక చెట్టుని గుద్దితే రుపాయల్లో లక్ష జరిమానా, ఒక విద్యుత్ స్థంభాన్ని గుద్దితే రెండు లక్షలు జరిమానా. ముందు ఆ వాహనాన్ని స్వాధీనపరచుకుని ఒక వారం గడువిస్తారు, ఆ లోగా ఆ వ్యక్తి సొమ్ము కట్టి విడిపించుకుంటాడా సరే. లెకపోతే ప్రభుత్వం వేలం లో ఆ వాహనాన్ని అమ్మి జరిమానా సొమ్ము మినహాయించుకుని మిగతాది ఆ వ్యక్తికి తిరిగి ఇచ్చెస్తారు.
ReplyDelete