skip to main |
skip to sidebar
అక్కినేనిని 51 సంవత్సరాలుగా అతి సమీపంగా చూస్తున్నవాడిగా, 65 సంవత్సరాలుగా ఆయన చిత్రాలని అభిమానిస్తున్నవాడిగా -అక్కినేనిలో అతి విచిత్రమైన విపర్యయాలు కనిపిస్తాయినాకు. ఆయన దేవుడిని నమ్మరు. ఆయన యింట్లో గోడలకి దేవుడి పఠాలను చూసిన గుర్తులేదు. కాని దేవుడి పాత్రల్నీ, భక్తుల పాత్రల్నీ ఆయన నటించిన తన్మయత్వం, తాదాత్మ్యం అపూర్వం. కాళిదాసు, తుకారాం, నారదుడు, విప్రనారాయణ, భక్త జయదేవ -యిలా ఎన్నయినా ఉదాహరణలు మనస్సులో కదులుతాయి
పూర్తిగాచదవండి
నా జీవితంలో మొదటిసారిగా - నా ఎనిమిదో ఏట - విశాఖపట్నం మినర్వా టాకీసులో అంజనమ్మని చూశాను. ఆ సినీమా 'బాలరాజు '. అందులో ప్రముఖంగా ముగ్గురు నటీనటులు - అక్కినేని, ఎస్.వరలక్ష్మి, అంజలీదేవి. నా అదృష్టం ఏమిటంటే - నా జీవితంలో ఆ ముగ్గురితోనూ నటించే అవకాశం కలిసి వచ్చింది. మరో 14 సంవత్సరాలకు అక్కినేని కంపెనీ అన్నపూర్ణా సంస్థ ద్వారా సినీరంగ ప్రవేశం చేసి వారికి సంభాషణలు రాశాను. తర్వాతి కాలంలో వారితో ఎన్నో చిత్రాలలో నటించాను.
పూర్తిగా చదవండి
మీరెప్పుడైనా గమనించారో లేదో మంచి పోలీసు - చెడ్డపోలీసు చాలా సరదా అయిన ఆట. రోడ్డు మీద టోపీ లేకుండా వెళ్ళేమోటార్ సైకిల్ మనిషిని ఒక పోలీసు పట్టుకుంటాడు. నెలాఖరు రోజులు. బేరం ప్రారంభమవుతుంది. అలాక్కాక - అవతలి మనిషి ఏమంత్రిగారి వియ్యంకుడో, ఎమ్మెల్యే గారి బావమరిదో అయితే ఈ పోలీసు ఇరుకులో పడతాడు. అప్పుడేమవుతుంది?
అరవై ఐదు సంవత్సరాలు కుళ్ళి, అహంకారంతో, స్వార్థంతో నేరచరిత్రతో గుండెలు దీసిన ధైర్యంతో చట్టాల్నీ, చట్టసభల్నీ కైవశం చేసుకుని దేశాన్ని దోచుకుతింటున్న పాలక వ్యవస్థలో కేవలం 9 నెలల్లో రూపు దిద్దుకుని --ప్రజల మద్దతుని సాధించి, మైనారిటీ వోటుతో మెజారిటీని నిరూపించుకోవడానికి అసెంబ్లీలో నిలబడిన- ఏనాడూ నిలబడాలని,నిలబడతానని ఊహించని ఓ సాదా సీదా నేలబారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గొంతు విప్పితే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది.
పూర్తిగా చదవండి