Sunday, March 16, 2014

మళ్ళీ అవినీతికి పెద్దపీట

ఈ దేశంలో రాజకీయ నాయకుడు అన్నిటికీ తెగించి అయినా ఉండాలి లేదా వోటరు ఉత్త తెలివితక్కువ దద్దమ్మ అనయినా అనుకొని ఉండాలి. వోటరు కన్ను కప్పి ఏపనయినా చెయ్యవచ్చుననే కుత్సితపు ధీమాతో ఉండి ఉండాలి. లేదా వోటరుకి మరో గతి లేదన్న అలసత్వమయినా పెంచుకుని ఉండాలి. ఈ వ్యవస్థ బలహీనతల్ని కాచి వడబోసి అయినా ఉండాలి.
పూర్తిగా చదవండి

1 comment:

  1. మీరు పెట్టిన శీర్షికలో "మళ్ళీ" అనే మాట అవసరం లేదని నా ఉద్దేశ్యం. లేదంటే శీర్షిక "అవినీతికి నిలబడిన గౌరవం" అంటే సవ్యంగా ఉంటుందేమో! ఇక ఆం ఆద్మీ మీద ఆశలు అనవసరం. వాళ్ళేదో ముసుగులు తొడుక్కుని వచ్చిన వాళ్ళే కాని, నిజాయితీగా ప్రజాసేవ, లేదా ప్రజాసామ్య పునరుధ్ధరణ వంటివి వంటబట్టించుకున్నట్టుగా కనపడదు. వాళ్ళ నాయకులు ఒక్కొక్కళ్ళూ మాట్లాడుతుంటె, వాళ్ళు మాట్లాడినదే రైటు అనే పిడివాదం, అహంభావం ప్రతి మాటలోనూ తొణికిసలాడుతూ కనపడుతుంటుంది. ఇలాంటి వెర్రి మొర్రి చేష్టలు చేసే వాళ్ళు పరిపాలన చెయ్యటం, అవినీతి ప్రభుత్వాలకన్నా కూడా ప్రమాదం అని నా అభిప్రాయం. చేతకాని దద్దమ్మ, చవట, నిజాయితీ పరిపాలకుడి కంటే, అవినీతి పరుడైన సమర్ధత ఉన్న నాయకులే దేశానికి ఎమన్నా చెయ్యగలరు అని లోకం చూస్తుంటే అనిపిస్తున్నది. అదే రైటేమో!

    ReplyDelete