ఈ కాలమ్లో ఒక్క వాక్యం కూడా నా మాటకాదు. కేవలం జరిగిన విషయాల్ని పత్రికల్లో చదివింది చదివినట్టు చెప్పే ప్రయత్నం మాత్రం.
మొన్న బీహార్లో వినయ్ బిహారీ అనే ఓ మంత్రిగారు మొబైల్ ఫోన్లలో సినీమాలు చూడడంవల్లా, మాంసాహారం తినడం వల్లా మన:ప్రవృత్తిలో ఉద్రేకాల్ని రెచ్చగొట్టే ధోరణి పెరుగుతుందని, తద్వారా స్త్రీల మీద దౌర్జన్యాలు పెరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి మాటే ఓ గోవా మంత్రిగారు అన్నారు. పాలీగంజ్ ఎమ్మెల్యే ఉషా విద్యార్థి అన్నారు కదా? ''ఈ మంత్రిగారి భాషణ నాన్సెన్స్. మొబైల్ ఫోన్లవల్లా, మాంసాహారం వల్లా రేపులు జరగవు. పిల్లల పెంపకం లోపం వల్ల జరుగుతాయి'' అని. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు వారికి మంచి బుద్ధి నేర్పాలన్నారు. పాట్నా విశ్వవిద్యాలయ విద్యార్థినాయకుడు ఈ మంత్రి యువతకి క్షమాపణ చెప్పాలన్నారు. ''సొల్లు కబుర్లు చెప్పకు. నీపని నువ్వు చూసుకోవయ్యా'' అని మంత్రికి హితవు చెప్పారు.
పూర్తిగా చదవండి