Monday, September 14, 2009

గ్లామర్ అవినీతి

నాకు జర్దా కిళ్ళీ అలవాటు చేసింది మిత్రులు, దర్శకులు కె.విశ్వనాధ్. "చెల్లెలి కాపురం” సినీమాకి కధా చర్చలు జరిపే రోజుల్లో. మంచి ఆలోచన చేసినప్పుడల్లా ఉప్పొంగిపోయి తనూ ఒక కిళ్ళీ కట్టుకుని నాకూ ఒకటి యిచ్చేవారు. మంచి ఆలోచనా, చిన్న మత్తూ- రెండూ ఆనందంగా వుండేవి యిద్దరికీ. క్రమంగా మత్తే ఆలోచనయి, క్రమంగా వ్యసనమయి దాదాపు 20 సంవత్సరాలు స్థిరపడింది. నాకంటె విశ్వనాధ్ ముందు మానేశారు. నా జీవితంలో వ్యసనంగా చెప్పుకోవలసిందీ, మానెయ్యడానికి యాతన పడవలసింది జర్దా కిళ్ళీయే.
పూర్తిగా చదవండి

7 comments:

  1. >>"మన వ్యవస్థలో "అవినీతి’కి 700 పై చిలుకు ఉదాహరణలు దొరికే చోటు ఒకటుంది. అది పార్లమెంటు".

    సూపర్‌గా చెప్పారు.

    ReplyDelete
  2. మంచి వ్యాసం. మన రాజకీయ నాయకుల ద్వంద్వ ప్రవృత్తికి నిదర్శనం ఇవి.

    ReplyDelete
  3. చాలా బాగా చెప్పారు సార్! నెనర్లు!

    ReplyDelete
  4. గౌరవనీయులు మారుతిరావుగారికి,

    అంత పెద్ద మంత్రులకి కూడా పైనించి నెత్తిమీద మొట్టితేకాని బుధ్ధి రాలేదు. ఎవరికి వారికి తెలియాలికాని ఎంతమందికి ఎంతని చెప్పగలరు. దీనికి ఉదాహరణ మీరు జర్దాకిళ్ళీ మానేసిన విధానమే.

    నాకు నా చిన్నప్పటి విషయం ఒకటి గుర్తు వచ్చింది. మా నాన్నగారు సేల్స్ టేక్స్ ఆఫీసర్ గా చేసేవారు. దాని గురించి మీకు తెలిసే వుంటుంది. ఆ అవినీతి కూపంలో మా నాన్నగారొక్కరే ఆ రోజుల్లో అంటే 30యేళ్ళ క్రిందట నీతిగా వుండడానికి శతవిధాలా ప్రయత్నించేవారు. అందుకు ఫలితం ప్రతి రెండు మూడు నెలలకీ ట్రాన్స్ ఫర్లే. డీలర్సూ, ఆఫీస్ లో కొలీగ్స్ తో ఎలాగూ అభిప్రాయభేదాలే. కాని అంతకన్న క్రిందవాళ్ళు కూడా ఈయన పేరు చెప్పుకుని పబ్బం గడుపుకునేవారు. అదెలా తెలిసిందంటే టిఫిన్ తెమ్మని ప్యూన్ ని హోటల్ కి డబ్బులిచ్చి పంపించేవారు. అలాగే ఆరోజూ పంపించారు. కాని ఆరోజు రెండు పేకట్లు రెండు విధాలుగా పేక్ చేసి వున్నాయి మా నాన్నగారికి అనుమానం వచ్చి ఏ హోటల్ నించి తెచ్చాడోనని అడిగితే అప్పుడు వాడు బయటపడ్డాడు. రోజు నాన్నగారిచ్చిన డబ్బులు వాడు జేబులో వేసుకుని, ఆఫీసరుగారు తెమ్మన్నారని ఒక్కొక్కరోజు ఒక్కొక్క హోటల్ నించి తెచ్చేవాడుట. రోజూ ఇవ్వడం వాళ్ళకీ విసుగేకదా. అందుకని ఒకడి దగ్గర సగం మరొకడి దగ్గర సగం తెచ్చాడుట. ఈ విషయం తెలియగానే నాన్నగారు అందరినీ కనుక్కుని ఎవరి డబ్బు వాళ్ళకి ఇచ్చేసారు, వాళ్ళు వద్దంటున్నా కూడా. దీనికి మా నాన్నగారికి వచ్చినపేరు "చేతకానివాడు",+ 16 ఎకరాల పొలం అమ్మకం (ఆరుగురు పిల్లల్ని సెటిల్ చెయ్యడానికి). "దీని వల్ల నీకు ఏమొచ్చింది నాన్నా?" అని నేను అడిగితే, ఆయన జవాబు, "హాయిగా గుండెల మీద చెయ్యేసుకుని నిద్ర పోతున్నానమ్మా.." అని. ఇన్నేళ్ళ తర్వాత మా నాన్నగారి మాటల్లో ఎంత సత్యం వుందో నాకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మా నాన్నగారికి 96 యేళ్ళు. ఇప్పటికీ కనీసం పిల్లల దగ్గర్నించి కూడా ఏమీ ఆశించకుండా, ఆయన పెన్షన్ డబ్బులతో చదువుకుంటూ, వ్రాసుకుంటూ ఎంతో ఆనందంగా వున్నారు. మీరు వ్రాసినది చదివితే నాకు మా నాన్నగారే గుర్తు వచ్చారు. మీరు వ్రాసినలాంటివి చదివి ఎవరైనా వారంతట వారు మారుతారంటారా?

    ReplyDelete
  5. చాలా బాగా చెప్పారండి. మనం బడాయిగా చెప్పుకోవటమే కానీ, నిజమైన ప్రజాస్వామ్యం కానేకాదు. పెద్ద పెద్ద వ్యాపారులు మాత్రమే ఉండగలిగిన మౌర్యా షెరటాన్ లో రోజుకు లక్ష ఇచ్చి ఒక కేంద్రమంత్రి ఉంటున్నాడంటే, ఏమిటి దానర్ధం? ఎన్నికల సమయంలో ఆయన ప్రకటించిన ఆస్తుల వివరాలతో ఈ ఖర్చు సరిపోల్చి అసలు సంగతి ఎవరైనా బట్టబయలు చేస్తే బాగుణ్ణు.

    ReplyDelete
  6. మారుతి రావు గారు,
    మూడు నెలల తరువాత కనీసం ప్రణబ్ ముఖర్జి గారన్నా దానిని గుర్తించారు. మరి మీడియా వాళ్ళు ఎమీ చేస్తున్నారు? వారిలో ఒక్కరికి కూడా ఇది తప్పు/అసంబద్దంగా కనిపించలేదా? ఒక్కసారి కూడా దీని గురించి ఎక్కడా రాయలేదు/ప్రస్తావించ లేదు ప్రణబ్ ముఖర్జి గారు వారిని ఖాళీ చేయమని చెప్పె వరకు. ఇంగ్లిష్ మీడియా అంతా కాంగ్రెస్ పార్టి కి భాజా భజంత్రిలు మోగిస్తూ రాహుల్ గారి గొప్పతనాన్ని ఉరూరా చాటిచెప్పటం తప్ప ఒక్కరు కూడా తటస్థ వైఖరి అనుసరించటం లేదు. ఇదే పనిని బి.జే.పి వారు చెసి ఉంటె మీడియా వారు ఆ పార్టిని తూర్పార బట్టె వారు.

    ReplyDelete
  7. WELL SAID SRIKAR. YOU HAVE JUST EXPOSED THE DOUBLE STANDARDS OF THE SO CALLED MEDIA. SOME CHANNELS LIKE ND TV ARE JUST CONGRES MOUTH PIECES. WHEN SUCH CHANNELS ARE ON THEIR SIDE, WHY CONGRESS IS WASTING THEIR MONEY AND EFFORT IN APPOINTING A BUNCH PEOPLE AS THEIR SPOKESMEN!! THERE IS ANOTHER PERSON CALLED RAJDIP SARDESAI WHO IS HAVING SOME PSYCHOLOGICAL PROBLEM IN NOT BEING ABLE TO SEE PROPERLY WHEN IT COMES TO BJP OR HINDUS.

    ReplyDelete