Sunday, September 20, 2009

ఢిల్లీకి కొత్త గొడ్డు

ఈ మధ్య ఢిల్లీకి ఓ అందమయిన మంత్రి చేరారు. ఆయన న్యూయార్కునుంచి తెలివైన వ్యాసాలు రాయగా మనం పత్రికలలో చదువుకున్నాం. మనకి సంబంధించని విషయాలు ఆయన చెప్తూంటే ఆనందంగా విన్నాం. ఐక్యరాజ్య సమితిలో కబుర్లు పొరుగింటి పుల్లకూరలాంటివి. అవి వూరి, రుచి ఎక్కి నోరూరిస్తాయి. అవి విని, తిని మనం తృప్తిపడ్డాం. ఇంతకీ ఆయన పేరు శశి తరూర్. ఆయన ఆ మధ్య ఐక్య రాజ్య సమితి కార్యదర్శి కావాలని మనమంతా ఆశించాం. కొన్ని దేశాలు మద్దతు పలికాయి. ఆయన న్యూయార్కులో కార్యదర్శి అయి అక్కడి కబుర్లూ కాకరకాయలూ మనకి చెప్తూంటే మనకి తియ్యగా, పుల్లగా వినసొంపుగా వుండేవి. కాని బన్ కె మూన్ అనే ఆయన కార్యదర్శి అయిపోయారు. అటు తర్వాత ఈ అందమయిన ఉద్యోగి మనమంతా యిచ్చిన మద్దతుకి మురిసి, అది తన పరపతిగా అపార్ధం చేసుకుని- ఈ అందమయిన మేధావి ఇండియా వచ్చి - తన రాష్ట్రానికి వెళ్ళి- మొదటి సారిగా ఖద్దరు కండువా ధరించి- దేశభక్తి కబుర్లు దంచి "తెలివైన వాడు, ఉండదగిన వాడు’అని వోటర్ ని మెప్పించి, ఢిల్లీ అధిష్టానానికీ ఇలాంటి దురబిప్రాయమే కలిగించి మంత్రి అయిపోయాడు.
పూర్తిగా చదవండి

7 comments:

  1. గొడ్లు గడ్డితిని పాలు ఇస్తాయి. ఆఫ్కోర్సు, కొన్ని గొడ్లు, గడ్డి తిని పాలిస్తాయి అనుకోండి, అది సారూప్యం. అయితే, గొడ్లకు కృతజ్ఞత అని ఒకటుంటుంది. అది మనకు ఒద్దు లెండి, గొడ్ల లక్షణాలు మనకెందుకు?

    ReplyDelete
  2. మారుతీరావు గారూ, మీ satirical ire ని ఈతని మీద, మరీ ఎక్కువగా వాడారేమో అనిపిస్తుంది. Sashi Taroor ని, ఆతని కామెంటుని, కాసేపు పక్కన పెడితే, "cattle class" ఆనేది అంతర్జాతీయముగా చాలా చోట్ల వాడబడే విషయము. అది ప్రత్యేకముగ భారతీయుల గురించి ఉద్తేశించినది కాదు. మన media, మరియూ ఆ పార్టీ కొంచెము ఎక్కువ react అయింది.

    మీలాంటి పెద్దలు, ఇలాంటి insignificant issues గురించి రాసేబదులు, మన తెలుగునాడు లో జరుగుతున్న, వ్యక్తి పూజని ఆ మిగతా ప్రహసనం గురించి ఎందుకు రాయరు? మీకు అది offensive గా తోచటంలేదా? నా మటుకు అది మరీ ఎబ్బెట్టుగా ఉంది.

    ReplyDelete
  3. మనం చేతలకంటే మాటలకే ఎక్కువ విలువనిస్తాం. మన "విదేశీ" మంత్రి గారికి ఈ విషయం ఇప్పటికైనా అర్థం అయ్యిందని ఆశిద్దాం.

    ReplyDelete
  4. అయ్యా సురేష్ గారూ, ఒక్కసారికాదు ఎన్నోసార్లు ఆ విషయాలమీద రాశాను గత 26 సంవత్సరాలలో. నా జీవనకాలం మూడు సంపుటాలు తెప్పించుకు చదవండి. వివరాలు కిరణ్ ప్రభ(కౌముది) యివ్వగలరు. మీ స్పందనకి ధన్యవాదాలు.

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. చక్కటి వ్యాసం. ఇమానాల్లో దిగువతరగతినే కేటిల్ క్లాస్ అన్న మంత్రివర్యులకి మాబోటి ఎర్రబస్సుగాళ్ళు ఇంకెలా కనిపిస్తారో. అయినా రాజకీయాల్లోకి వచ్చే ముందు ప్రజలకి "సేవ" చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుని ఏరు దాటాక ఇలా తెప్ప తగలేసే "బుర్ర వాపు" మేధావులు మన దేశానికి అవసరం లేదు నా అభిప్రాయం లో. చదువు సంధ్యాలేకపోయినా పేదలకి సేవ చేద్దామనే నిఖార్సైన నాయకులూ వచ్చారొకపుడు దేశం లో. కొల్లాయి గట్టి పాదయాత్రలు చేసిన గాంధీ పుట్టిన దేశం లో ఇవాళ సాక్షాత్తూ మంత్రివర్యులు-ఎకనమీ క్లాస్ ఫ్లైట్ లో ప్రయాణించడానికి ఏవగించుకుంటున్నారు. ఇంతటి సుకుమారులకి మురికి రాజకీయాలేల, మురికి ప్రజల గోల ఏల? హాయి గా తడి గుడ్డ వేసుకుని (ఫోం బెడ్ వేసుకుని అని నా ఉద్దేశ్యం) ఇంట్లో పడుకోక!!!

    ReplyDelete