Monday, October 12, 2009

విపత్తు- విపరీతం

చరిత్రలో ఎన్నడూ వూహించని విపత్తు ఆంధ్రరాష్ట్రంలో జరిగింది. కృష్ణా, గుంటూరు, మెహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం జిల్లాలలో కృష్ణా, తుంగభద్ర నదీజలాలు సృష్టించిన భీభత్సం భయానకం, నష్టం హృదయ విదారకం.
పూర్తిగా చదవండి

8 comments:

  1. జపాన్ ప్రభుత్వపు,తప్పుడు నిర్ణయాలు, దాని మితిమీరిన సామ్రాజ్య కాంక్ష కాకపొతే- జపాన్ అణుబాంబు దాడికి గురికావడానికి వేరే కారణం ఏముంటుంది ?

    అట్లాగే కనీ వినీ ఎరగని వరదలోస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న ముందస్తు ఆలోచన, ప్రణాళిక సామాన్య జనానికి లేకపోయినా ప్రజల్ని కాపాడే భాద్యత వున్న ప్రభుత్వానికి వుండాలి కదా?

    దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఎన్నో ప్రణాళికలు పథకాలు ప్రకటించారు. భవిష్యత్తులో మళ్ళీ ఉప్పెన వస్తే తలదాచుకోడానికి పటిష్టమైన షెల్టర్లు నిర్మిస్తామన్నారు. వాటిగురించి తర్వాత ఎవరైనా పట్టించుకున్నారా?

    ఫాక్టరీలలో, బహుళ అంతస్తుల భవనాలలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఆర్పేయడానికని ఫైర్ ఎక్స్టింగ్ విషర్లు మొక్కుబడిగా అమరుస్తారు. అసలు ప్రమాదం జరిగినప్పుడు ఒక్కటీ పనిచేయవు. వాటిని నిరంతరం తనిఖీ చేయాలి కదా.

    ఇట్లాంటి వాటిని విమర్శిస్తే తప్పేమిటి, జరిగే నష్టం ఏమిటి?

    ఇప్పుడు కాకపొతే ఇంకెప్పుడు వీటి గురించి చర్చిస్తారు?
    సహాయ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్లకు ఈ చర్చ ఏవిధంగా ఆటంకం కలిగిస్తుంది.
    వాళ్ళేమీ మనలా టీవీలు చూసుకుంటూ, పేపర్లు చదువుకుంటూ కూర్చోరు కదా.
    ఆలోచనలు సంఘర్శించక పొతే సరైన ఆచరణ ఎక్కడినుంచి వస్తుంది?

    ఇక కేసీఆర్ భాష సంగతి ... ని కాసేపు పక్కన పెట్టండి.
    పోతిరెడ్డి పాడు వంటి అక్రమ ప్రాజెక్టుల ను నిర్మించడం వల్లే శ్రీ శైలం డాంలో పరిమితికి మించి నీళ్ళను నిల్వ చేసారని, సాగు, తాగునీటికోసం నిర్మించిన నాగార్జున సాగారుకు వెళ్లాల్సిన నీటిని నిలిపివేసారని ఇది అక్రమ చర్య అనీ, దీనికారనంగానే ఈ వరదలు వచ్చాయని అంటున్నాడు కదా దాని గురించి మీరు ఎందుకు ప్రస్తావించలేదు.

    డాం ల నిర్వహణ, ప్రాజెక్టుల నిర్మాణం, నదీ జలాల్ పంపిణీ మొదలైన వాటి లోని అవకతవకలు వీటికారనంగానే భారీ వర్షాలు లేకపోయినా, ఉప్పెన విరుచుకు పడకపోయినా ఇవాళ కృష్ణా గుంటూరు జిల్లాలు నిష్కారణంగా ముంపు బారిన పడి కొట్టు మిట్టాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ఎవర్నీ తప్పు పట్ట కూడదా?

    భవిష్యత్తులో కూడా ఇట్లాగే మానవ తప్పిదం వల్ల , మానవ స్వార్ధం, పాలకుల అసమర్ధత వల్ల జరిగే వరద నష్టానికి బలి అవుతూ పోవాల్సిందేనా ? ? సమాధానం చెప్పండి.

    ReplyDelete
  2. రాజన్నగారూ
    మీరడిగిన ప్రశ్నలకూ నా కాలంకీ ఏమీ సంబంధంలేదు. వాటి సమాధానాలు నా దగ్గర లేవు. ఈ సమయంలో "విపరీతా'ల గురించి ఈ కాలం. ఆ ప్రశ్నల టైమింగ్, కేసీఆర్ ధోరణి గురించే నా కాలం.గమనించగలరు.

    ReplyDelete
  3. గొల్లపూడి గారు మీ ఆర్టికల్ బాగుందండి . KCR గారు మీతో పాటు నాక్కూడా అభిమాన నాయకుడు సుమండీ ఎప్పుడన్నా దిగులు గా ఉన్నప్పుడు అయ్య గారివి రెండు ప్రసంగ పాఠాలు విన్నానంటే చాలు ఉత్సాహం ఉరుకులేస్తది (KCR అభిమానులు దయచేసి నన్ను క్షమించండి :)) .
    రాజన్న గారు మీ అన్నట్లు మీరన్నట్లు ప్రశించాల్సిన్దె కాని ఎవరని మల్ని మనమే ఎందుకంటే ఆ నాయకులు మనం ఓట్లు వేస్తేనే కదా గెలిచారు మరి. ఓటు విలువ వంద రూపాయలకు కూడా పడిపోయిన సభ్యసమాజం లో ఉన్నాము మనము అందుకే సర్దుకుపోవాలి మరి.

    ReplyDelete
  4. >>>>> చరిత్రలో ఎన్నడూ వూహించని విపత్తు ఆంధ్రరాష్ట్రంలో జరిగింది. కృష్ణా, గుంటూరు, మెహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం జిల్లాలలో కృష్ణా, తుంగభద్ర నదీజలాలు సృష్టించిన భీభత్సం భయానకం, నష్టం హృదయ విదారకం.<<<<<<

    ఎంత గొప్పగా వుందో మీ కాలం ప్రారంభం.
    జరిగిన నష్టం గురించి నిజంగానే మీరు బాధాతప్త హృదయంతో ఏదో వివరించ బోతున్నట్టు ప్రతీ పాఠకుడు ఆశిస్తారు.

    ఆ తర్వాత
    >>>> ఛానళ్ళు నెగిటివ్ ఆలోచనని ఫిల్టర్ చేసి, వీలయినంత ఆశనీ, ఉపకార ధోరణినీ కలిగించాలి. <<<<
    అంటూ చక్కని సలహా లేదా నీతి బోధ కూడా చేసారు.
    కొన్ని చానళ్ళ వికృత వ్యాఖ్యానాలని, కేసీఆర్ తిట్ల పురాన్నీ ప్రస్తావించి ముగించారు.

    ఇప్పుడేమో
    >>>> మీరడిగిన ప్రశ్నలకూ నా కాలంకీ ఏమీ సంబంధంలేదు. వాటి సమాధానాలు నా దగ్గర లేవు. ఈ సమయంలో "విపరీతా'ల గురించి ఈ కాలం. ఆ ప్రశ్నల టైమింగ్, కేసీఆర్ ధోరణి గురించే నా కాలం.గమనించగలరు.<<<< అంటున్నారు.

    ఇందులో ఏమైనా ఔచిత్యం, టైమింగ్ వుందా. ఇది కూడా ఒక "విపరీతం" గా అనిపించడం లేదూ?

    గుండెల్ని మండించే ... "చరిత్రలో ఎన్నడూ వూహించని విపత్తు" గురించి రాస్తూ సమస్య మూలాల జోలికి మీబోటి పెద్దలు కూడా వెళ్ళకుండా తప్పించుకోవడం విచారకరం. హాస్యం పేరుతొ చితిలోని నిప్పుతో చుట్ట వెలిగించుకునే ప్రయత్నం చేయడం బాధ కలిగిస్తోంది.
    ఇందుకే నేమో పరులకు చెప్పేటందుకే నీతులు అన్నారు .

    ReplyDelete
  5. కాదేది కవితకి అనర్హం అన్నట్లు, మన రాజకీయ నాయకులకు, మీడియాకి ఈ పరిస్థితి కూడ మాంచి అవకాశం గానే కనిపిస్తున్నట్టుంది. ఈ పబ్లిసిటి మాట ఎలా వున్నా, ఎంతో కొంత అసలు బాధితులకు చేరితే మంచిదే. అమావాశ్య చీకటిని వెలిగించడానికి డబ్బు ని వృధా చెయ్యడానికి బదులు, కొంతైనా మనం ఆ మొత్తాన్ని వరద బాధితుల సహాయార్థం ఉపయోగిస్తే మన దీపావళి మరింత అర్థవంతం గా వుంటుంది.

    ఇక కామెంట్స్ విషయానికి వస్తే, రచయతకి తను చెప్పాలనుకున్న విషయాన్ని, తను రాయాలనుకున్న కోణం లో రాసే అధికారం, హక్కు వున్నాయి. మనం దానిని ఒప్పుకోవాలి, గౌరవించాలి. ఇలాంటి ఆర్టికల్స్ ని ప్రతీ పాఠకుడి అభిప్రాయాలకు, విజ్ఞానానికి సరిపోయేలా రాయడం దాదాపు అసాధ్యం. కానీ, మన కామెంట్స్ ని ఆహ్వానిస్తూ, అవసరం అనిపించినప్పుడు జవాబు కూడా ఇస్తున్న గొల్లపూడి గారిని అభినందించకుండా వుండలేకపొతున్నాను.

    ReplyDelete
  6. @@:గుండెల్ని మండించే ... "చరిత్రలో ఎన్నడూ వూహించని విపత్తు" గురించి రాస్తూ సమస్య మూలాల జోలికి మీబోటి పెద్దలు కూడా వెళ్ళకుండా తప్పించుకోవడం విచారకరం. హాస్యం పేరుతొ చితిలోని నిప్పుతో చుట్ట వెలిగించుకునే ప్రయత్నం చేయడం బాధ కలిగిస్తోంది.
    ఇందుకే నేమో పరులకు చెప్పేటందుకే నీతులు అన్నారు .

    three options:

    1) only GOD can strighten the current things. అంతా దేవుడి మీద భారం వేసి మౌనంగా భరించడం. దేవుడి ఒకరి వైపు మాత్రామే ఆలోచించడు కాబట్టి this is the best option and he will take care of it. మనకి ఓపిక కావాలి అంతే.

    2) ఓపిక వుంటే మీ ఆవేశం తగ్గించుకోవడానికి ఒక బ్లాగు పెట్టుకొని దాంట్లో మీ ఆవేదనను వ్రాసుకొండి. Like me :(

    3) మీ జీవితం ప్రజల భవిష్యత్తు కోసం అంకితం చేయదల్చుకుంటే ఎదైనా ఉద్యమం స్టార్ట్ చేయండి like KCR.

    ReplyDelete
  7. Anantapur: Krishna River doesn't flow through Anantapur. So there are no floods in Anantapur

    ReplyDelete
  8. a2zdreams said...
    "3) మీ జీవితం ప్రజల భవిష్యత్తు కోసం అంకితం చేయదల్చుకుంటే ఎదైనా ఉద్యమం స్టార్ట్ చేయండి like KCR."

    hhaaa.hhaa.. haaa..

    KCR is a buffoon in AP Politics. He gets elected only to resign! :D and he thinks that is the only quality of 'magaadu'!

    ReplyDelete