Sunday, November 1, 2009

ఓ అజ్ఞాని ఆవేదన

ఇన్నేళ్ళొచ్చినా నాకు లోకజ్ణానం పెరగలేదు. పైగా రాజకీయ జ్ణానం బొత్తిగా కలగలేదు. ప్రాంతీయ జ్ణానం బొత్తిగా కలిసిరాలేదు. కనుక ఈ కాలమ్ ని ఓ అజ్ణాని కాలమ్ గా విజ్ణులు చదువుకోవాలని నా మనవి.
చిత్రకారుడు ఎమ్.ఎఫ్.హుస్సేన్ గారు ప్రముఖులు. సాయిబుగారు. మనదేశంలో మనం ముస్లింలను గౌరవించి నెత్తిన పెట్టుకున్నట్టు ముస్లిం దేశాలే చేస్తున్నట్టు కనిపించదు. ప్రముఖ గజల్ గాయకుడు మెహదీ హస్సన్ పాకిస్థాన్ లో అనారోగ్యంతో డబ్బులేక ఆస్పత్రిలో ఉన్నాడని పేపర్లో చదివాను. మన దేశంలో బిస్మిల్లా ఖాన్ భారతరత్న. జకీర్ హుస్సేన్, ఫక్రుద్దిన్ ఆలీ అహమ్మద్, అబ్దుల్ కలాం గారలు మనకు గౌరవనీయులైన అద్యక్షులు. అబ్దుల్ కలాంగారు భారతరత్న.
పూర్తిగా చదవండి

6 comments:

  1. కడిగిపారేయండీ సిగ్గు శరములేని నపుంసక జనాల్ని.

    ReplyDelete
  2. Namste Gollapudi Garu. Sorry for commenting in english (do not have Lekhni installed on this computer).

    This is our stupidity. I see even common people shows lots of intrest to wish a muslim friend for Ramdhan (Though that guy never wishes for a hindhu festival!!) ..

    This sick thing is became part of our blood. false secularisum and false hypocrasi..

    if you have time , please read the below article in my blog..

    http://sahithikabrlu.blogspot.com/

    ReplyDelete
  3. గొల్లపూడి గారు

    ఆవేదనండీ, ఆక్రోశమనండీ, స్వాభిమానమనండీ, ఏదో చేయ్యాలన్న కసి అనండీ, రియాక్షననండీ - మీరు చెప్పింది బానే ఉన్నది. ఒక బిస్మిల్లా ఖాన్, ఒక జాకిర్ హుస్సేన్, ఒక అబ్దుల్ కలాం, ఒక ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గురించి మాట్టాడండి ఒప్పుకుంటాను. కానీ డబ్బుల కోసం దోమ మూత్రాలు, నల్లినెత్తురు తాగి ఆ మత్తులో స్త్రీమూర్తుల, దేవతామూర్తుల బట్టలూడదీయించే ఎం.ఫ్.హుస్సేన్ గారిని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు. ఒక భారత పౌరుడిని కించపరిచే హక్కూ మీకు లేదు. అయినా మతాభిమానం ఉంటే తప్పా? ఆ మతపిచ్చలో ఇతర మతాలను కించపరిస్తే తప్పా? కళను, కళాకారులను గౌరవించలేని దేశమేమి దేశమండీ? అందుకే ఇతర దేశాలు అలాగున్నాయి. మన దేశం ఇలాగున్నది. కంచి స్వాముల వారి విషయంలో జరిగిన సంగతేమిటో మీలాటి పెద్దవారికి తెలియదు అని అనుకోను. చెప్పవలసిన అవసరమూ లేదు అనుకుంటున్నాను. అయినా ఈ జగత్తులో భారతదేశముండగా ముస్లిముల దోపిడీకీ, వారి కళల పోషణకు, కళాకారుల ఆదరణకు లోటేమీ? నుస్రత్ ఫతే అలీఖాన్ వారి స్వరం వేల సోయగాలు పోయిందని ఆనందించే భారత బిడ్డలు, హరిప్రసాద్ చౌరాసియా మాష్టారు గారు పలికించే స్వరాలను చూసి పెదవి విరిచే కాలమిది. కాబట్టి మీ ఆవేదన మీరే వుంచుకోండి. నిర్లక్ష్యం నీలయ్యగార్లు పరిఢవిల్లే మన దేశంలో, నీలయ్యగారి గోమాత తిండికిలేక ఇతరుల ఇళ్ళల్లో దూరి గడ్డనుకుని ముసలోళ్ళ తెల్లగడ్డాలు తిని లోకోపకారం చేస్తూ వుంటే చూస్తూ వూరుకోక ఈ ఆవేదన ఎందుకండీ. ఒకరోజు చదివి మరో రోజు నవ్వుకునే జనానాకు, పాకుడు పట్టిపోయిన మెదళ్ళకు మస్తిష్క చలనం తెప్పించాలన్న మీ ప్రయత్నం అభినందనీయమో, కాదో నాకు తెలియదు కానీ, మీరు వ్రాసింది మటుకు బుద్ధి లేనివారికి బోలెడు ఆవుపేడ వరుగులు తినిపించాలన్న అద్భుత ఆలోచన అని మటుకు చెప్పగలను. జనాలకు బుడమ వరుగులు, వంకాయ వరుగులు మాత్రమే తెలుసు ఇప్పటిదాకా. అందుకోండి నీరాజనాలు. జై కపిరాజా!

    ReplyDelete
  4. మాష్టారూ,

    మీ ఆవేదన,ఆవేశం, కొద్ది పాటి కోపం అన్నీ ఈ వ్యాసంలో నాటకీయంగా ముందుకు వచ్చాయి. నేను మీ గొంతులో ఈ మాటలు విన్నాను కూడా. గతంలో రేడియోలో కథానికలు విన్నట్లు అనిపించింది.

    పలు చోట్ల ఒక విషయాన్ని నేను ఈ మధ్య గమనిస్తున్నాను. సత్యము, ధర్మము అనే ప్రధానమైన అంశాలను ప్రక్కన పెట్టి కేవలం ప్రేమ తత్వం మీద జనరంజకమైన ఉద్బోధలు చాలా మంది చేయటం వలన అధర్మము పట్ల ఒక బలమైన అభిప్రాయం ప్రజలకు కలగటం లేదు. అదలా ఉంచి పెద్దల పట్ల, సంప్రదాయం పట్ల గౌరవం లేకపోయినా భగవంతుని చేరుకోవచ్చనే నిండైన అభిప్రాయానికి యువత దగ్గరలో ఉన్నది.

    ఇష్టం వచ్చిన రీతిలో పురాణ ఇతిహాసాలకు వ్యాఖ్యానాలు చేసేసి ప్రాచుర్యం సంపాదించాలనే ఒక హాస్యాస్పదమైన ప్రక్రియ కూడా కనిపిస్తున్నది. మరో మతంలో మీరు చెప్పినట్లు మౌలికమైన గ్రంథాల మీద నోటికి వచ్చినట్లు వాగితే ఊరుకోరు కదా! ఈ పరిస్థితులలో వేరే వాళ్లు మన గురించి వాగటం మరీ తేలికయిపోయింది...

    ఇది నాకు పనికి వస్తుందా అని యోచించి దానిని పొందటం ఒక్కటే లక్ష్యం. ఆ శాస్త్రం అభ్యసించు వారి సంప్రదాయాన్నీ, గురువులనీ, నియమాలని మటుకు మనం గౌరవించం-ఇది ఇప్పుడున్న ఒరవడి! (ఉదాహరణకి జ్యోతిష శాస్త్రం)

    సమాచారం పెరిగి సదాచారం మట్టి కలసిన రోజులు. ఇళ్లల్లో కాకుండా అందరూ బజారులోనే కాలం గడిపే కాలం.

    క్రమశిక్షణ, స్వాధ్యాయం వైపు నడిస్తే తప్ప ఆత్మగౌరవం గురించి ఆలోచన రాదు! ఆ తిట్టే వాడు మనలని తిట్టాడని కూడా చాలా మందికి తెలియదు!

    సినీ ప్రక్రియల గురించి మీరు ఎంతో అధ్యయనం చేసి యున్నారని తెలుసు. కొన్ని సంవత్సరాల క్రితం అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలప్పుడు కూడా మిమ్మల్ని చూశాను. మీ బ్లాగులో ఆ తాలూకు వివరాలు కొన్ని ఇవ్వగలరని ఆశిస్తున్నాను.

    మీ ఆరోగ్యం ఎలా ఉంటోంది సార్? 'నెట్' లోకి వచ్చి శ్రమ అనుకోకుండా కనెక్ట్ అయిన పెద్ద వారిలో మీరొకరు. ఇలా మీరెన్నో నిజాలు నిర్మొహమాటంగా మీ శైలిలో చెబుతూనే ఉండాలని కోరుకుంటూ...

    శలవు.

    అనేక నమస్కారములతో,

    వేదాంతం శ్రీపతిశర్మ
    www.srikaaram.wordpress.com
    www.sripati.com

    ReplyDelete
  5. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని ..అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని..

    మా ఆవేదనకు ఆక్రోశానికి అక్షరరూపం మీ వ్యాసం.

    ReplyDelete
  6. గొల్లపూడిగారూ.

    నమస్తే. ఒక సామాన్య పౌరుడు తన మనస్సులో అనుకుంటూ మధన పడుతున విషయానికి అక్షర రూపం ఇచ్చారు. 1950-60లలో అన్ని రంగాల్లోకి కమ్యునిస్టు భావజాలం బాగా నింపుకుని, మేధావులుగా పేరొంది, ముఖ్యంగా వార్తా పత్రికలలోకి చొరబడ్డారు. ఆ ఒరవడి ఇంకా కొనసాగుతున్నది. ఇవ్వాళ మేధావి అంటే, కమ్యునిస్టు పదానికి పర్యాయపదం. ఒక్క పత్రికలేకాదు, యూనివర్సిటీలు, కాలేజీలు, సాహిత్యం,బ్లాగులు ఇలా అనేక రంగాల్లో చాప కింద నీరులాగ చేరి మన సమాజాన్ని దాదాపుగా నిర్వీర్యం చేశారు. లౌకిక వాదం అన్న ఒక పిచ్చను బాగా పట్టించారు. లౌకిక వాదానికి ఎంతవరకు వక్ర భాష్యం చెప్పవచ్చో అంతవరకు వెళ్ళి అందరిని తప్పు దోవ పట్టించి, వాళ్ళు ప్రవచించేదే లౌకికవాదం అన్న స్థాయికి దిగజారిపొయ్యారు. వీళ్ళు ఇదేదో వాళ్ళా వాళ్ళ బుర్రల్లో పుట్టిన ఆలోచనలు బయట పెట్టటంకాదు. పరాయి దేశం నుంచి దొంగ చాటుగా వచ్చే నిధులు కైంకర్యం చేసి ఒక పథకం ప్రకారం తమ స్వామి భక్తిని చాటుకుంటున్న పధ్ధతి. ఒక యూనివర్సిటీలో ప్రొఫెసరు, మేధావి ముద్ర వేయించుకున్నవాడు (ఆంబోతుకు అచ్చు పోసినట్టు)ఒకసారి హైదరాబాదు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో పెద్ద గొంతుకతో అక్కడెక్కడో యూరప్‌లో క్రొవేషియా దేశంలో జరిగిన అకృత్యాల గురించి ఆక్రోసిస్తున్నాడు. ఇతగాడికి మన దేశంలో కాశ్మీరు నుండి వెళ్ళగొట్టబడిన, వేలాది మంది హిందువులు కనపడరు. కారణం, వాళ్ళ గురించి మాట్లాడితే అతనికి పేరు రాదు కదా మరి. ఆ వచ్చే డబ్బులు కూడ ఇవ్వరు మరి.

    సామాన్య పౌరుడికి ఇవన్ని మనకెందుకు అని తప్పుకు తిరుగుతున్నంతవరకు, మనకున్న పీఠాధిపతులు హాయిగా నేతి గారెలు భోంచేస్తూ, ఆశ్రమాల్లో సుఖ జీవితం జరుపుతున్నన్నాళ్ళూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. హిందువులకు నాయకత్వం ఏది. రాజకీయ నాయకత్వం లేదు, మత నాయకులు అసలు లేనేలేరు. మరింతకంటే ఏమౌతుంది.

    ReplyDelete