Wednesday, September 30, 2009

రేడియో తాతయ్య

ఈ తరంలోనే కాదు ఆ నాటి తరంలో కూడా చాలామందికి అంతగా తెలియని రేడియో తాతయ్య గురించి సాక్షి లో నేను వ్రాసిన వ్యాసాలు. ఇంతవరకూ మీరు చదివి ఉండకపోతే ఇప్పుడు చదవండి.

మొదటి భాగం రెండో భాగం

Monday, September 28, 2009

ఎస్.వరలక్ష్మి అస్తమయం

"బాలరాజు’ సినీమాని నా తొమ్మిదో యేట మా అమ్మ వొడిలో కూర్చుని చూశాను విశాఖపట్నం మంగరాజుగారి పూర్ణా హాలులో. అది ఎస్.వరలక్ష్మిగారి మొదటి సినీమా. ఆ రోజుల్లో సినీమా అంటే ఓ వింత ప్రపంచంలోకి తొంగి చూడడం లాంటిది. నటీనటులు ఏ గంధర్వ లోకం నుంచో దిగివచ్చినట్టు అబ్బురంగా వుండేది. విభ్రమంతో, చొంగలు కారుతూ ప్రేక్షకులు చూసేవారు. వారిలో ఓ తొమ్మిదేళ్ళ కుర్రాడూ ఉన్నాడు.
పూర్తిగా చదవండి

Sunday, September 20, 2009

ఢిల్లీకి కొత్త గొడ్డు

ఈ మధ్య ఢిల్లీకి ఓ అందమయిన మంత్రి చేరారు. ఆయన న్యూయార్కునుంచి తెలివైన వ్యాసాలు రాయగా మనం పత్రికలలో చదువుకున్నాం. మనకి సంబంధించని విషయాలు ఆయన చెప్తూంటే ఆనందంగా విన్నాం. ఐక్యరాజ్య సమితిలో కబుర్లు పొరుగింటి పుల్లకూరలాంటివి. అవి వూరి, రుచి ఎక్కి నోరూరిస్తాయి. అవి విని, తిని మనం తృప్తిపడ్డాం. ఇంతకీ ఆయన పేరు శశి తరూర్. ఆయన ఆ మధ్య ఐక్య రాజ్య సమితి కార్యదర్శి కావాలని మనమంతా ఆశించాం. కొన్ని దేశాలు మద్దతు పలికాయి. ఆయన న్యూయార్కులో కార్యదర్శి అయి అక్కడి కబుర్లూ కాకరకాయలూ మనకి చెప్తూంటే మనకి తియ్యగా, పుల్లగా వినసొంపుగా వుండేవి. కాని బన్ కె మూన్ అనే ఆయన కార్యదర్శి అయిపోయారు. అటు తర్వాత ఈ అందమయిన ఉద్యోగి మనమంతా యిచ్చిన మద్దతుకి మురిసి, అది తన పరపతిగా అపార్ధం చేసుకుని- ఈ అందమయిన మేధావి ఇండియా వచ్చి - తన రాష్ట్రానికి వెళ్ళి- మొదటి సారిగా ఖద్దరు కండువా ధరించి- దేశభక్తి కబుర్లు దంచి "తెలివైన వాడు, ఉండదగిన వాడు’అని వోటర్ ని మెప్పించి, ఢిల్లీ అధిష్టానానికీ ఇలాంటి దురబిప్రాయమే కలిగించి మంత్రి అయిపోయాడు.
పూర్తిగా చదవండి

Monday, September 14, 2009

గ్లామర్ అవినీతి

నాకు జర్దా కిళ్ళీ అలవాటు చేసింది మిత్రులు, దర్శకులు కె.విశ్వనాధ్. "చెల్లెలి కాపురం” సినీమాకి కధా చర్చలు జరిపే రోజుల్లో. మంచి ఆలోచన చేసినప్పుడల్లా ఉప్పొంగిపోయి తనూ ఒక కిళ్ళీ కట్టుకుని నాకూ ఒకటి యిచ్చేవారు. మంచి ఆలోచనా, చిన్న మత్తూ- రెండూ ఆనందంగా వుండేవి యిద్దరికీ. క్రమంగా మత్తే ఆలోచనయి, క్రమంగా వ్యసనమయి దాదాపు 20 సంవత్సరాలు స్థిరపడింది. నాకంటె విశ్వనాధ్ ముందు మానేశారు. నా జీవితంలో వ్యసనంగా చెప్పుకోవలసిందీ, మానెయ్యడానికి యాతన పడవలసింది జర్దా కిళ్ళీయే.
పూర్తిగా చదవండి

Monday, September 7, 2009

ఒక నివాళి- ఒక విశ్లేషణ

నా అరవయ్యో యేట రాజకీయాలనుంచి వైదొలగుతాను- అన్నారు రాజశేఖరరెడ్డి ఆ మధ్య. ఈ మధ్య ఎవరో ఆ ప్రస్థావన తెస్తే "ఒకటి రెండు పనులు చక్కబెట్టి ఆ పని చేస్తాను” అన్నారు.
పూర్తిగా చదవండి