Tuesday, February 23, 2010

పులి పిల్లి పెళ్ళి కథ

టైగర్ వుడ్స్ ప్రపంచం విస్తుపోయి చూసేంత గొప్ప ఆటగాడు. ఇంతవరకూ ఎవరూ సాధించలేనన్ని విజయాలూ, ఎవరూ సాధించలేనంత డబ్బూ, కీర్తీ సంపాదించాడు. స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ ఆటకోసం చదువుని మధ్యలో మానుకున్నాడు. ఆయనకి స్విస్ పెళ్ళాం వుంది. పిల్లలున్నారు. డబ్బు, కీర్తి ఒకప్పుడు మనిషిని తల్లకిందులు చేస్తుంది. చదువూ, సంస్కారం ఆ వికారాన్ని ఏ కాస్తో ఆపగలుగుతుంది. అయితే- అన్నీ ఉన్న టైగర్ అందరూ ఊహించలేనన్ని “అందమయిన“ నేరాలు చేశాడు. కనీసం పది మంది అందకత్తెలతో శృంగారం నెరపాడు.
పూర్తిగా చదవండి

8 comments:

  1. సంప్రదాయంగా పెళ్ళి చేసుకున్నవారు మాత్రం నిజాయితీగా కాపురం చేస్తున్నారా? నేనేమీ ఆ టైగర్ అభిమాని కాదు కానీ సంప్రదాయ వివాహ వ్యవస్థని అంత బలంగా నమ్మడం అవసరమా? అగ్ని సాక్షిగా పెళ్ళి చేసుకున్న మగవాళ్ళే భార్యని ఉంపుడుగత్తెని చూసినట్టు చూస్తుంటారు.

    ReplyDelete
  2. ప్రవీణ్, ప్రతిదానికీ ఎ౦దుకు మన స౦స్కృతిని కి౦చపరుస్తారు?

    మీ వుద్దేశ్య౦ ఏమిటి? స౦ప్రదాయాలు పీకి పారేద్దామనా? స౦ప్రదాయాలు అ౦త అవసర౦ లేనివయితే అవి లేని సమాజాలు ఇప్పటికే ఏర్పడి ఉ౦డాలికదా? స౦ప్రదాయాలు, కట్టుబాట్లు ఊరకే రాలేదు. అవి సమాజానికి అవసర౦, వాటిని మెరుగు పరుస్తూ కొనసాగి౦చడ౦ అత్యవసర౦. స౦ప్రదాయాలు వద్దనడ౦,ఇ౦ట్లో ఎలుక దూరి౦దని ఇల్లు తగలబెట్టటమే.

    ఒకడు స్వేచ్చాశృ౦గార౦ నాగరిక సమాజానికి చిహ్నమ౦టాడు. మరి నీ పెళ్ళా౦ అలా చేస్తే ఒప్పుకు౦టావా అ౦టే వ్యక్తిగత దాడి అ౦టూ తప్పి౦చుకు౦టాడు. వ్యకిగత౦గా ఒక నీతి, సమాజానికో నీతా?

    అ౦తమాత్రాన, స౦ప్రదాయాలను నేనే౦ నెత్తికెత్తుకోవట్లేదు, కొన్ని పొరపాట్లను విసర్జి౦చి ఔన్నత్యాన్ని గుర్తి౦చాలి. మన స౦స్కృతీ స౦ప్రదాయాల్లోని పొరపాట్లను బూతద్ద౦లో చూపి ప్రజలను గ౦గవెర్రులెత్తి౦చి౦ది చాలు. ఇప్పటికైనా వాటిని కాపాడుకోక పోతే, మన సమాజ౦ చాలా త్వరగా విచ్చిన్నమవుతు౦ది.

    ReplyDelete
  3. Extra marital affairs have been in vogue from time immemorial, India not being an exception. These kind of activities are coming out more and more in number because of the expanding media. Infact, for many men,this is 'gaming'( shamefully ). The tears of Tiger's mother consoling her son is a drama. This is a simple example of 'Dhutarashtra prema'.She wouldn't've tolerated if her husband did the same to her.

    ReplyDelete
  4. ఇంద్రియాలని ఉత్తేజపరిచే విషయాల గురించి ఆలోచించే కొలదీ ఆసక్తి పెరుగుతుంది. దాని వలన కోరిక, కోరిక వలన కోపం.. అవివేకం. మంచి చెడ్డల విచక్షణ పోతుంది. బుద్ధి నశిస్తుంది. మానవుడు పతనమౌతాడు.

    సుమారుగా, ఓ ఏడాది క్రితం సత్యం రాజు గారి గురించి రాస్తూ మీరు రాసిన మాటలు.. నాకు ఎందుకో మళ్ళీ గుర్తొచ్చాయి. మనిషి పతనం ఏదో ఆక్సిడెంట్ లా జరిగేది కాదు. ఓ విలేకర్ల సమావేశంలో ఓ రెండు కన్నీటి బొట్లతో మాసిపోయేదీ కాదు. ఇందులో మనకి వచ్చేదీ.. పోయేదీ కూడా ఏమీ లేదు. గొప్ప వాడి పరువు, ఉన్నా, పోయినా విశేషమే కాబట్టి, ఇంకో నాలుగు రోజులు టైగర్ గారి గోడు వినక తప్పదు మరి.

    ReplyDelete
  5. పెద రాయుడుగారూ
    వెనకటికి ఒకాయన రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నాదట.నా కాలం ఉద్దేశమూ సంప్రదాయాని మనం పరిరక్షించుకోవాలన్నదే. అమెరికాలో ప్రస్థుతం మాధ్యమాలు సంప్రదాయం ముసుగులో వ్యాపారాన్ని మాత్రమే జరుపుతున్నాయని. వారి బాధ టైగర్ పెళ్ళాంతో కాపురం చెయ్యడం లేదని కాదు. ప్రేయసుల కధకి గిరాకీ కల్పించాలని. అదే నా కాలం తాత్పర్యం.

    ReplyDelete
  6. ఇక్కడ దూరి సంబంధం లేని విషయం రాస్తున్నాను అన్యధా భావించొద్దు, మిమ్మల్ని చాలా రోజుల తరువాత వెండితెరపై చూసి ఆనందించాను, కనిపించినందుకు ధన్యవాదాలు. మీరున్నది ఒక సన్నివేషమే అయినా అందులో ఒక ఇంపాక్ట్ ఉంది. ప్రస్థుత రాజకీయాలను ధైర్యంగా బాగా తెరకెక్కిన ఆ సినిమాతో మీ అనుభవం గురించి ఓ నాలుగు ముక్కలు చెప్పవచ్చు కదా!

    ReplyDelete
  7. ఈ ఆవేదన అందఱూ పడితే అసలు మన దేశం సగం బాగుపడినట్లేనండీ. అద్భుతంగా చెప్పారు. నమోవాకాలతో భవదీయుడు.

    ReplyDelete