Sunday, April 18, 2010

మాంచి సినీమా కధ

లాభసాటి అయిన స్క్రీన్ ప్లేకి మూల సూత్రం- ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని మభ్యపెట్టడం, మోసం చేయడం. తలుపు తీసుకుని హీరోయిన్ వస్తుందని ఆశిస్తాడా? ఎలుగుబంటి వస్తుంది. ఇద్దరికీ పెళ్ళి అయిపోయిందని ఊపిరి పీలుస్తాడా? ఓబులేసు వస్తాడు. ఇది సర్వకాల సర్వావస్థల్లోనూ చెల్లే పడికట్టురాయి.
ఇప్పుడు అసలు కధ. జామపండులాగ పిటపిటలాడే ఆడపిల్ల. పేరు సానియా మీర్జా. వొంట్లో అన్నిభాగాలూ ఎగిరిపడేటట్టుగా, తొడలు కనిపించే చిన్న నిక్కరుతో టెన్నిస్ ఆట ఆడే సౌందర్యరాశి. ఆమె ఆటకంటే ఆమెనే ప్రపంచం అబ్బురపాటుతో చూసి ఆనందించింది. ఇలాంటి సౌందర్యరాశులు ఎక్కువగా టెన్నిస్ లోనే కనిపిస్తారు.ఆ ఆకర్షణ పొట్టి నిక్కర్లలో, బిగించిన బ్లౌజుల్లో ఉందేమో. అలనాడు అన్నా కోర్నికోవా అనే గుంట ఇలాగే చాలామంది మతులు చెడగొట్టింది. తరవాత్తరవాత- ఆటకంటే వొళ్ళు రాణిస్తోందని కనిపెట్టి- మోడలయి వొంటినే నమ్ముకుంది.
పూర్తిగా చదవండి..

12 comments:

 1. అన్నా కౌర్నికోవా అంత గొప్ప ఆటగత్తె కాకపోవచ్చు, కానీ ఆమె స్ఫూర్తితో రష్యన్ టెన్నిస్‌లో పుట్టుకొచ్చిన నిఖార్సైన ఆటగత్తెలు చాలామందున్నారు. వాళ్ల మూలాన అమ్మాయిల టెన్నిస్ అమెరికన్ ఆధిపత్యం నుండి రష్యా అధీనంలోకి వెళ్లిందనేది నిజం.

  అలాగే, 'పొట్టి నిక్కర్' సానియా వ్యక్తిగతంగా ఆటలో సాధించినది ఎక్కువ లేకున్నా, భారతదేశంలో టెన్నిస్ పట్ల ఆదరణ, ఆసక్తి పెంచిందనేది నిజం.

  ReplyDelete
 2. >>ఆటకంటే వొళ్ళు రాణిస్తోందని కనిపెట్టి- మోడలయి వొంటినే నమ్ముకుంది.
  హహహ!!

  ReplyDelete
 3. గురజాడ,రాచకొండ,తంబు,భరాగో,గొల్లపూడి వ్రాతలలో ఓ ప్రత్యేకత ప్రస్ఫుటంగా కనిపిస్తూంది. అదేమిటో వివరించ లేము గాని అది విశాఖ ప్రాంతం వారికే చెల్లుతొందని మాత్రము గట్టిగా చెప్పగలము.

  నరసింహ మూర్తి.

  ReplyDelete
 4. అన్నా కౌర్ని కోవా..గొప్ప ఆటగత్తే...కాకపోయినా స్ఫూర్తి ఇచ్చింది కదండీ??ఎలానో?అదే మరి మారుతీరావు గారు మొదటి పేరా లో చెప్పింది...

  ReplyDelete
 5. koddi kalam nunchi ee column follow avutunnanu chakkani vyakhyanam sutimettani vyangyam mottam meeda chala baguntunnai

  ReplyDelete
 6. Really,
  I've also been thinking of the whereabouts of Mahaa.

  ReplyDelete
 7. టైటిల్ చూసి, ఇదేదో శశిథరూర్ వ్యవహారం మీద అనుకున్నా ;)

  నేను, ఎనభయ్యో దశకం అంధ్రజ్యోతి జీవనకాలం రోజుల నుండి మీ అభిమానిని (రచనలకి)....

  నిర్మొహమాటంగా చెప్పలంటే, గత కొద్ది కాలంగా మీ రచనలలో రైటు వింగు అభిప్రాయాలు కనిపిస్తున్నాయి.

  ఈ సానియా వ్యవహారాన్ని ఇంత పీకి పాకం పెట్టాల్సిన అవసరం లేదేమో? పైగా, ఆమెకి ఇంతకు ముందు నిఖా అయ్యింది అని వ్రాశారు. ఆది సరి కాదు.

  ReplyDelete
 8. mee screen play chaalaa baavundi.....

  ReplyDelete
 9. Idi Sania vyavahaaraanni peeki paakam pedutunnadigaa kanipisthunnaa, antharleenanga enno prasnalani vedika meediki thechhe vyaasam.

  Many newspapers and channels have focussed on the entire episode from different angles but nobody asked the whereabouts of Mahaa, as far as I have observed. I read a bit more about Mahaa in another blogger's post.

  As per many discourses I've heard, a religion has to update itself with the changing scenario of the world and make certain changes, maybe, without changing the basic dharmam. It could be the dispute of Srinivasa Kalyanam outside India or Nikhaah over phone, Pativrataa dharmam or a man and a woman staying under one roof before marriage.....the religious leaders should periodically meet to discuss the changing world and decide on amendments in religion, also taking into consideration the views and opinions of the general public.

  ReplyDelete
 10. @WitReal
  నిర్మొహమాటంగా అడగాలంటే- 30 ఏళ్ళుగా నా రచనలు చదువుతున్న నా అభిమాని నా “వింగు”ని పట్టుకోలేకపోవడం నా గొప్పతనమంటారా? మీ బలహీనత అంటారా?
  అవును. సానియా నిక్కా విషయంలో మీరు రైటే.
  గొల్లపూడి మారుతీరావు

  ReplyDelete
 11. saar... meeru keka...
  mee rachana "ChEtagaani Manam" chadivina taruvaata mee abhimaaninayyanu. sagaTu bhaarateeyudi manasuni chadivaaru meeru...

  ReplyDelete