Sunday, June 6, 2010

అపకీర్తి 'కీర్తి '

ఈ ప్రపంచంలో అపకీర్తికి దక్కే కీర్తి అనన్య సామాన్యం. అప్రతిహతం. అనితర సాధ్యం. అపూర్వం. అది కాలధర్మం. నేటి లోక ధర్మం. ప్రస్థుతం నడుస్తున్న సమాజ ధర్మం. ఈ నిజాన్ని సమర్ధించడానికి నా దగ్గర బోలెడన్ని సాక్ష్యాలున్నాయి.
పూర్తిగా చదవండి

10 comments:

  1. బాగుంది. మొత్తానికి అవినీతి,అపకీర్తి యుగధర్మాలుగా వెలసిల్లుతున్నాయంటారు. నిజమే.

    బహుశా మీరు శూల్ సినిమా చూడలేదనుకుంటాను. అందులో బచ్చూ యాదవ్ పాత్రలో నటించింది మనోజ్ బాజ్పాయ్ కాదు షయాజి షిండే.

    ReplyDelete
  2. సార్....ఈ కింద పేరాగ్రాఫు చదివాక నాకు ఇహ మాటల్లేవు....ఎంత చక్కగా చెప్పారు....శతకోటి వందనాలు...

    "అసలు రహస్యం ఏమీటంటే ప్రతీ వ్యక్తి మనస్సులోనూ ఒక 'కోతి' ఉంది. తీరని కోరికలుంటాయి. తీరని కలలుంటాయి. రకరకాల వికారాలుంటాయి. సంఘ భయమో,సమిష్టి ఆంక్షలో, చట్టమో, ప్రజాజీవనమో విశృంఖలత్వానికి లక్ష్మణ రేఖను గీస్తుంది. తాము చేయలేని, చేయాలనుకుని చేయలేకపోయేది, చేస్తే బాగుణ్ణనే ఆలోచన - అలా చేసే ఎదుటి వ్యకిని చూసి ముచ్చట పడుతుంది. మనస్సులో ఏకాంతంగానయినా వత్తాసు పలుకుతుంది. 'మానవత్వం' అత్యున్నతమైన మెట్టు. మనిషి బలహీనత - సగటు మానవుడి అంతర్ చేతనకి ప్రతీక. మనకి సాధ్యంకాని బలహీనతని చాలామంది ఎదుటి వ్యక్తిలో గుర్తుపట్టి ఆనందిస్తారు. కితకితలు పెట్టినట్టు పులకిస్తారు. సంస్కారమనే ఆంక్షని అధిగమించిన ఆ అరాచకం వారి మనస్సులో ఆమోదాన్ని పొందుతుంది."

    నమస్కారాలతో

    భవదీయుడు
    వంశీ

    ReplyDelete
  3. మంచి టాపిక్.భావవ్యక్తీకరణలో మీకు మీరేసాటి సుమా.తిన్న ఆహారం వెంటనే జీర్నమైనట్టుంది మీ వ్యాసం.మహాత్ములేందరు సహాయపడినా మంచి నిలువలేదు-జాతి వైదులే కోతకోసినా నీతి బ్రతకలేదు అన్న కవి భావానికి అక్షర రూపం మీ వ్యాసం -చల్లా.జయదేవ్ /చెన్నై-౧౭

    ReplyDelete
  4. మారుతి రావు గారికి నమస్కారం

    మీరు వ్రాసిన ఈ బ్లాగు సగం మాత్రమే చూపిస్తున్నది .సినిమాల్లో
    మీరు వ్రాసే ,లేదా వేసే వేశాలవల్ల మీకలా అనిపించవచ్చు .
    కాని మీరు ఇదే బ్లాగు ఒక ఆ నలుగురు సినిమా లో జనాలకు నచ్చినది ఏమిటో ,
    కలియుగం ,తాత మనవడు ,సూరిగాడు ,మనిషికో చరిత్ర వ్రాయాలంటే చాలానే ఉన్నాయీ .
    నేను చెప్పేదిమిటంటే మీరు కాని సినిమా లో వ్రాసేవాళ్ళు ,మీడియా లో చూపించేవాళ్ళు సగటు ప్రేక్షకుడు అని ముద్రవేసే ప్రతి మనిషి లోను
    అన్ని గుణాల కు స్పందించే తత్త్వం ఉంటుంది .సినిమా లో చూపించే అవినీతి ప్రక్కనే చూపించే పరిష్కారం ఎంతో కష్టం గా ఉంటాయి .
    ఎందుకు ? తేలికగా పరిష్కారాలు చూపిస్తే కథ సాగదు కాబట్టి .
    మనిషి లో వుండే అదే కోతి మంచి గుణాలని ఉత్తెజన్నిచ్చే సినిమాలు
    ఎలా హిట్ చేసింది .

    ReplyDelete
  5. డియర్ గొల్లపూడివారూ!

    'చాలా బాగుంది'--అని సూర్యుడికి దివిటీ చూపించలేను!

    చాలా సంతోషం.

    స్వయం గా యెదురుగా నిలుచొని మాట్లాడుతున్నట్టు, మీ గొంతు వినడం ఇంకా అద్భుతం గా వుంది.

    ధన్యవాదాలు.

    ReplyDelete
  6. మిమ్మల్నిలా బ్లాగ్ ద్వారా కలవడం ఎంతో సంతోషంగా ఉంది..

    చాలా బాగా రాసారు..

    అయితే.. మీరో విషయం గమనించారా.. సినిమాలో హీరో ని కొట్టే విలన్ ని చూసి పళ్ళు కోరికే వాళ్ళున్నారు.. అదే విలన్ ని హీరో జయించేటప్పుడు చప్పట్లు కొడతారు.. హీరో విజయాన్నే ఆకాంక్షిస్తారు..

    నా ఉద్దేశం లో విలన్ కేవలం వినోదం (మీవ్యాసం లో మీరన్న కోతిని తృప్తి పరిచే వినోదం అంతే )..

    కానీ ఈ వినోదం వెయ్యి తలలెత్తింది..ఒక వ్యసనంలా .. ఒక క్యురియాసిటిలా .. ఒక ఎక్సైట్మెంట్ లా ..

    ReplyDelete
  7. నమస్సులు,

    ఈ బ్లాగ్ పోస్టు, నా మనోభావాలకి అద్దం పట్టింది. ఎ గారు వ్రాసినట్లు, మనిషి (సగటు ఏమిటో నాకు తెలీదు) అన్ని భావాలకీ ఉత్తేజితుడవుతాడు నిజమే.. కాని, స్పందనలు ఒకే మనిషిలో వేరు వేరు సందర్భాలలో వేరు వేరు గా ఉంటాయి. అదే భిన్న వ్యక్తులలో ఇంకా వేరు గా ఉంటాయి. తీసే విధం గా తీస్తే గాంధీ సినిమా హిట్ అవలేదా? అంత పేరు బాండిట్ క్వీన్ కి వచ్చిందా? ఇక్కడ సమస్య అది కాదు. మనిషి ఇవ్వాళ అపకీర్తి కి ఇచ్చినంత ప్రాముఖ్యత మంచి కి ఇవ్వతల్లేదు అన్నది అంతర్లీన భావన. అబ్దుల్ కలాం గారు వ్రాసినట్లు, రాజకీయ కుంభకోణం మీద వార్త మొదటి పేజీ లోనూ, ఒక అర్థ శాస్త్ర విమర్శ మధ్య పేజీ లోనూ ఉంటుంది. ఎంత మంది ఏది చదువుతారు, ముందు గా ఏది చదువుతారు అన్నది, పునాది గా వార్తా పత్రికలూ ఆయా పేజీలు కేటాయిస్తాయన్నది నిజం.

    కాకపొతే, సమస్య అందరికీ తెలిసినదే, గురువు గారు తన బాణీ లో నాటుకునీ లా మరో సారి చెప్పారు. బావుంది. కానీ పరిష్కార మార్గం ఏమిటి? అనారోగ్యం వచ్చి చేడుతూంటే, మన వంట్లో, ఇంట్లో, తోటలో, పెంపుడు జంతువులలో, మనం ఎంతో శ్రద్ధ తీసుకుని బాగు చెయ్యడానికి ప్రయత్నిస్తామే, అలాంటిది, మన దేశానికి పట్టిన ఈ చీడ ఎలా పోతుంది? ఈ ఆక్రోసనికి పరిష్కార మార్గం చూపించిన వాళ్ళు దార్శనికులు. గురువు గారు ఆ మార్గం చూపించి ఉంటే ఇంకా బాగుండేది.

    బుధజన విధేయుడు
    సీతారామం

    ReplyDelete
  8. chinna porabatu, tenemansulu lo Rammohan de negative role, hero Krishna hero ne

    ReplyDelete
  9. నిజం చెప్పారు
    అపకీర్తి కి కీర్తి ఎక్కువ ...
    మరి ఈ అపకీర్తి వల్ల వచ్చే కీర్తి కోసం పాకులాడే వాళ్ళు లేక పోలేదు అండి.
    మీరు అన్నట్లు అది వాడుకునే రాజకీయ రంగ ప్రవేశం వేసి, జనాల్ని ఏలుతున్నారు.
    ఇంకా ఇలా అపకీర్తి మూట కట్టుకున్న వాళ్ళ సినిమాలే మనం చూడగలం, జీవిత చరిత్రలు గా
    ఇది ఇక్కడ భారత దేశం లోనే కాదు విదేశాల్లో ను ఉన్నదే
    దానికి మీరు చెప్పిన హిట్లేర్ పాత్ర ఒక ఉదాహరణ అయితే కల్పిత GOD FATHER DON పాత్ర మరో ఉదాహరణ.
    ఇలాంటి సినిమాలే మనం చూస్తాం వాళ్ళనే గుర్తు పెట్టు కుంటాం
    మనం ఎక్కువ అపకీర్తి నే గుర్తు పెట్టుకుంటాం.
    ఉదాహరణకు సానియా మిర్జా అనగానే మనకు పాకిస్తానీ భర్త మరియు తన చిట్టి చిట్టి దుస్తులు ముందు గుర్తుకు వస్తాయి తర్వాత తన టెన్నిస్.


    జోహార్ అండి మీ చతురతకు
    పదం పదం ముందు వెళ్లి చదవాలి అని ఆశ రేపుతూ రాయటం లో మీకు మీరే సాటి.
    మిమల్ని పొగిడే అర్హత వయసు లేక పోయిన, కూతురు లాంటి దాన్ని అనుకోని నా వందనాలు స్వీకరించండి

    ReplyDelete
  10. గొల్లపూడి గారికి నమస్సుమాంజలి. మీ వ్యాసం బాగుంది. మీరు చెప్పినట్లుగానే ప్రస్తుత సమాజంలో అపకీర్తికి ఆపాదించే గొప్పతనం కీర్తికి లభించుట లేదు. కాని " కడదాకా పోరాడితే కన్నీళ్లు తుడవగలవు " అనే సత్యాన్ని నమ్మిన ఎందఱో మహానుభావుల కృషి, త్యాగ ఫలితమే నేటి మన దేశ స్వాతంత్ర్యం. ప్రస్తుతమున్న దేశ రాజకీయ, సామాజిక పరిస్థితులలో నేరస్తులు, సమాజ సేవా దృక్పధం లేని వాళ్ళు మనలను ఏలుచూ వున్నారు లేదా మనలను ప్రభావం చేసే స్థితిలో వున్నారు . కాని ఏ దేశమేగినా గాంధి లాంటి గొప్ప దేశభక్తులు,మదర్ థెరిస్సా లాంటి సమాజ సేవకులే అజరామరంగా నిలిచారు. కాబట్టి నా దృష్టిలో ఈ అపకీర్తికి లభించే ప్రాధాన్యం శాశ్వతం కాదు. "నాకేంటి " అని అడగని వారు ఉద్యమించనంత కాలం, ఈ బాధలు తప్పవని అనుకొంటాను. మొత్తంమీద, మీరు చేసిన విశ్లేషణ చాలా బాగుంది. భరాగో గారి మృతి గురించి ఈ రోజే తెలిసింది. మీకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తునాను. మరొక కవిరాజు మనలను వీడిపోయారు. మరొక్కసారి మీకు వందనం.

    ReplyDelete