Saturday, July 17, 2010

మొదటి వసంతం పూర్తిచేసుకున్న 'మారుతీయం '

ఈ బ్లాగ్ ప్రాంభమయి సంవత్సరమయిందని నా మిత్రులు కిరణ్ ప్రభగారు గుర్తుచేశారు. అసలు ఈ బ్లాగ్ ని వారింట్లోనే (కాలిఫోర్నియాలో) ఆయనే డిజైన్ చేసి ప్రారంభించారు. దాదాపు 40 ఏళ్ళ కిందట పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు ఆంధ్రజ్యోతిలో కాలం రాయమన్నప్పుడు భయపడ్డాను. కారణం - అప్పుడు తలమునకలుగా సినిమాల్లో నటిస్తూండడం. కొంతకాలం తర్వాత నండూరి రామమోహన రావుగారు వత్తిడి చేసి, పురాణం మద్దతుని సంపాదించి నన్ను దినపత్రికలో రాసేటట్టు చేశారు. క్రమంగా ఆ రుచి మరిగి ఇప్పటిదాకా ఆ పనిని నిరంతరాయంగా చేస్తూ వస్తున్నాను. పుట్టిన మనిషికి ఊపిరి పీల్చడం లాగ - ఆలోచించే మనిషికి తన ఆలోచనల్ని చెప్పుకునే వేదిక 'ఊపిరి'లాంటిది. అయితే ఈ బ్లాగ్ వ్యవహారం నాకు లొంగుతుందా అని భయపడ్డాను. ఆ పనీ తానే చేస్తానన్నారు. మరొక ముఖ్యమయిన సందేహం - కొన్ని బ్లాగులు చూసినప్పుడు ఊసుపోని వ్యవహారంగా - అనవసరంగా, అర్ధంలేని కబుర్లతో కాలక్షేపంగా కనిపించింది. అది నా వంటికి పడని విషయం. కాగా అంత తీరికా, అలాంటి అభిరుచీ బొత్తిగా లేనివాడిని. కనుక - ఈ బ్లాగులో కనిపించే విషయాల్ని 'ఫిల్టర్ ' చేసే బాధ్యతా ఆయనే తీసుకున్నారు. ఇప్పుడు - సంవత్సరం తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు - అలాంటి ఊకదంపుడికి తొలిరోజుల్లో ప్రయత్నాలు జరిగి, కయ్యానికి కాలుదువ్వే పనులు కొందరు చేసినా - వాటిని ఇక్కడ మినహాయించడాన్ని గమనించి మానుకోవడమో, తప్పుకోవడమో చేశారు. అది ఆరోగ్యకరమైన పరిణామం. ఈ సంవత్సరం పొడుగునా ఈ బ్లాగు చదివేవారికి - నిజమైన, సహేతుకమైన, సలక్షణమైన సందేహాలో, విమర్శలో చేసినప్పుడు నా స్పందనని గమనించే ఉంటారు.
ఈ వార్షికోత్సవంలో నాతో నా ఆలోచనలు పంచుకునే సహృదయులందరికీ - ఆరోగ్యకరమైన సంప్రదాయాన్ని పాటిస్తున్నందుకు నా అభినందనలు, కృతజ్నతలు. అంతకు మించి - ఈ బ్లాగు వెర్రితలలు వేస్తోందనిపిస్తే ఎప్పుడో తప్పుకునేవాడిని.
కొత్త ఆలోచన వచ్చినప్పుడు, కొత్తగా వేదన కలిగినప్పుడు, ఓ ప్రాణ మిత్రుడు శెలవు తీసుకున్నప్పుడు ఓ అన్యాయం సమాజానికి జరిగిందని బాధ కలిగినప్పుడు - వెతుక్కునే స్నేహితుని ప్రతిస్పందనే ఈ బ్లాగు పరమార్ధమని నేను నమ్ముతాను. ఈ సంవత్సరం పాటూ నాతో అలాంటి ఆలోచనలనే పంచుకున్న మీ అందరికీ నా అభినందనలు. కృతజ్నతలు. మనిషి ఏకాంతంలో ఆలోచించినా తన చుట్టూ ఉన్న సమాజంలోనే, సమాజంతోనే స్పందిస్తాడు ఆ గుండె చప్పుళ్ళకు 'మారుతీయం' వేదిక కావాలని నా ఆశ. ఈ ఆశతోనే మరో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడదాం.

17 comments:

  1. హ్యాప్పీ బ్లాగ్ యానివర్సరీ సర్. కంగ్రాట్స్...

    ReplyDelete
  2. mee blog naa inspiration....yeppatikaina meelaaga raayalani chinna aasa...congrats sir..

    ReplyDelete
  3. అభినందనలు మీలాంటి వారు మరింత మంది బ్లాగుల్లోకి వస్తే వ్యక్తిగతంగా కలవలేని వారి ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకునే వీలుంటుంది..

    ReplyDelete
  4. మీబ్లాగు ప్రారంభమై ఏడాది పూర్తయ్యినందుకు శుభాకాంక్షలు!

    ReplyDelete
  5. మీ బ్లాగు మొదటి వసంతం పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు గొల్లపూడి గారు. ముందు ముందు మీరు మాకు ఎన్నో ఆలోచింపజేసే టపాలు అందిస్తారని ఆశిస్తూ సెలవు.....

    ReplyDelete
  6. మీలాంటి పెద్దలు ఈ వేదిక మీద సంవత్సర కాలంగా చేస్తున్న కృషి ఎన్నోవిధాలుగా మేలు కలిగిస్తుందని నమ్ముతున్నాను .ధన్యవాదములు

    ReplyDelete
  7. Congrats and expecting for more and more articles from you..

    ReplyDelete
  8. many happy returns of the day sir and my sincere thanks to kiranprabha garu to initiate you to ignite the minds of millions...

    ReplyDelete
  9. శుభాకాంక్షలు. మీతో బ్లాగ్ లో పలు విషయాలమీద మాట్లాడటం మాకు విజ్ఞానదాయకమేకాదు, గొల్లపూడి అనే ఛత్రం కింద మేమూ ఉన్నామన్న ఆనందం కూడా ఉంటుంది. ఇది అతిశయం కాదు.

    ReplyDelete
  10. sir,
    many many returns of the day.
    but......... a little bit Disappointment. as a versatile writer already u got sufficient name and fame.why do not you encourage new writers and blogger ,(like me ? ) with your valuable comments.as an experienced writer, we really need your valuable comments which makes us a little bit happy and make us keep track of our skills.
    తల్లి బిడ్డను వేలు పట్టి నడిపించినట్టు ,ఒక అనుభవమున్న రచయిత వర్ధమాన రచయితకు తన సద్విమర్శ తో "రచన" అనే నడక నేర్పినట్టు !తప్పేదైనా వుంటే సహృదయం తో మన్నించగలరు .

    ReplyDelete
  11. అభినందనలు గొల్లపూడి గారు

    ReplyDelete
  12. Maruthi rao garu: So blessed to be able to take a peak into your mind every week. Your thought provoking articles (The best one is "Venaka.padadaaniki mundu.padandi.....Mundu padadaaniki venaka padandi", an article about how people are scrambing to get ahead to be recognized as Backward). It was a master piece, though not available on this site.

    Would it be possible to load your articles that were written prior to Koumudi and this blog?

    ReplyDelete
  13. congrats sir, having the audio version of blog is excellent!! expecting more thought provoking articles from you.

    ReplyDelete