Monday, July 26, 2010

కోమాలో మన దేశం

కొన్ని రోజుల కిందట భారత పరిశ్రమ సమాఖ్య యూరోపు విభాగపు డైరెక్టర్ మోహన మూర్తి అనే ఆయన జర్మనీలో ఒక చర్చ కార్యక్రమంలో పాల్గోన్నారట. ఆ చర్చలో పాల్గొన్న వారంతా ఈ మూర్తి గారిని చూసి "ఏం బాబూ! మీ దేశం కోమాలో ఉందా? కళ్ళు తెరుస్తోందా ?" అని వెక్కిరించి ముక్కుమీద వేలేసుకున్నారట. వాళ్లు చెప్పే వివరణలు వింటూ ఈయన తెల్ల మొహం వేసారట. మూర్తి గారికి సరైన అనుచరులు లేరు. నన్ను తీసుకెళ్ళి వుంటే - యూరోపు ప్రముఖుల కళ్ళు తెరిపించే లాగ - మనవాళ్ళు "కళ్ళు" తెరుచుకునే ఉన్నారని చెప్పి ఒప్పించేవాడిని.

6 comments:

  1. ఇన్ని అలజడుల మధ్య బతుకుతున్నాము కదా. మనం కోమాలో లేము. అలా అనుకునే మిగిలిన ప్రపంచమే వుంది కోమాలో.

    ReplyDelete
  2. మనం ఏమైనా చేయాలీ అంటే తెల్లటి కాగితాల్లాంటి కొత్త జనరేషన్ తో మొదలు పెట్టాలి. నైతికవిలువలు వారి రక్తంలోకి ఎక్కేలా చేయాలి. అపుడే, కనీసం కొన్ని సంవత్సరాల తరువాత అయినా చక్కటి విలువలతో దృఢమైన సమాజాన్ని సాధించగలం, ఈ వెక్కిరింతలని నివారించగలం.

    ReplyDelete
  3. అయ్యా!

    యెందుకొచ్చిందండీ మనకీ కంఠశోష!

    యువతకి కావలసిందేమైనా చెప్పామా? వాళ్ళ విజయాల గురించీ, వుద్యోగాలగురించీ, తినబోయే రుచుల గురించీ, ఇంకా.......ల గురించీ?

    ఐతేనే చదువుతారు మన బ్లాగులు!

    లేదా, ఉప్మాలో కరేపాకులు మరి.

    ReplyDelete
  4. apptiki vELa mimchi pOtumdi... yes its high time to stop beating around the bush and start a real fight against all such scroundals like the principal of a school in hyderabad who raped `just 20 times' his 17yrs student.. how brutus and rediculous it is ...
    very good article on the existing bad situation in the society ... salutes to u sir

    ReplyDelete
  5. సార్,
    ఇక్కడ మీరు వ్యాపార వేత్తలను, చదువు కున్న మధ్యతరగతి వారిని వది లేశారు. ఎక్కడొ అమెరికా నుంచి వచ్చి బిల్ గట్స్ మే నెల ఎండలో బీహార్ లో ఉన్న మారు మూల పల్లెకు వెళ్ళి తన ఫౌండేషన్ కార్యక్రమాల అమలును స్వయం గా పర్యవేక్షించటానికి వచ్చాడు. అతను తాను సంపాదించిన సంపదలో అధిక భాగాన్ని ఒక 50సం|| టైం ఫ్రేం పెట్టుకొని సహాయ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నాడు. ఇక మన దేశం లో వ్యాపార వెత్తల విషయానికి వస్తే లక్షల కోట్ల టర్నో వర్ కలిగిన అన్నదమ్ములిద్దరు గాస్ బావుల పైన అధికారం కొరకు తగవులు వేసుకొంట్టూ సుప్రిం కోర్ట్ వరకు వెళ్ళారు. ప్రతి రోజు పేపర్ లో విరి గొడవ వివరాలు అగ్ర భాగాన నిలిచాయి. కూడూ గుడ్డా చిక్కని వారు కోట్టుకున్నా ఒకవిధం, ఇన్ని లక్షల కోట్లు సంపాదించిన వారు కూడా ఇంకా సంపాదించాలనే కాంక్షతో కోట్టు కోవటం ఎమి న్యాయం? వీరంతా విజేతలు అని వీరి మీద పుస్తకాలు రాసి విరిని రొల్ మోడల్స్ గా చేసెవారు సమాజం లో సామాన్య మానవుడికి ఎమీ సందేశాన్ని పంపుతున్నారు?

    ReplyDelete
  6. Oka tandri tana kuturuni chusina kallato epudite pakkavadi kuturini kuda chudagalugu tado appudu samajamlo maarpu sadhyam. Ika allanti rojulu ravemo!

    ReplyDelete