ఒకావిడ జీవితకాలమంతా మనస్సులోని ఆలోచనలను కాగితం మీద పెట్టేది. వాటిని పదిమందితో పంచుకోవాలనే ఆలోచనగానీ, ప్రచురించాలనే కోరికగానీ ఆమెకి కలగలేదు. కొంతకాలానికి కన్ను మూసింది. ఆమె చెల్లెలు తన అక్క వస్తువులను సవరిస్తూండగా ఈ కాగితాలు బయటపడ్డాయి. చదవగా - ఆమెకి బాగా రుచించాయి. వెంటనే పత్రికలకి పంపింది. కవితా ప్రపంచం హర్షంచింది. అక్కున చేర్చుకుంది. అచిరకలంలో అమెరికా నెత్తిన పెట్టుకునే ప్రసిద్ధ రచయిత్రిగా పేరు పొదింది. ఆవిడ పేరు ఎమిలీ డెకెన్సన్.
పూర్తిగా చదవండి
Monday, October 11, 2010
Subscribe to:
Post Comments (Atom)
Excellent. Recently after reading some Telugu blog posts, I just felt the same about Gandhi.
ReplyDeleteRegards,
~సూర్యుడు
మీరు చెప్పింది అక్షరాలా నిజమండి. గాంధీగారు కుళ్ళు రాజకీయాలు ఆడేవారని, అసలు మహాత్ముడంటే గాడ్సే గారేనని కొందరు (స్వయంప్రకటిత మేతావులు) జాతకరీత్యా ఋజువులు చేసేశారు కూడా.
ReplyDeleteగొల్లపూడి గారికి నమస్సుమాంజలి.
ReplyDeleteమీరు ఈ వారం వ్రాసిన కీర్తి అను వ్యాసం సందర్భోచితంగా వున్నది. మీరు చెప్పినట్లే, కీర్తికి రెక్కలు ఉన్నట్లు స్పష్టంగా తెలియుచున్నది. మిలీనియం మహానీయుడని ప్రపంచ వ్యాప్తంగా కీర్తించబడిన మహాత్మా గాంధీజీని సైతం జనం మరచే రోజులు రావటం బహు బాధాకరము. అయితే, కొన్ని తరాల వరకు నిలిచే కీర్తిని సంపాదించాలంటే, మానవాళికి మహోపకారం చేసిన వారికే సాధ్యం. నేడు మంచిని చెప్పేవారు, వినేవారు ఇద్దరూ కరువవుతున్నారు. మంచి కంటే, చెడుని త్వరగా ప్రజలకు చేరవేసే ప్రసారమాధ్యమాలు ఉన్న నేటి తరంలో, కీర్తిమంతులకు చోటు ఎక్కడుంది. ఒకప్పుడు జీవితాన్ని పణంగా పెట్టి , తమ తమ రంగాల్లో కృషి చేసి, మానవాళికి మేలు చేసిన ఎందరో మహానుభావులను మనం మరచిపోరాదు. వారి జీవితాల్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసికోవాలి. వారి సందేశాల్ని, తర తరాలకూ అందించగలిగితే, అంతకన్నా, గొప్ప పని వేరొకటి ఉండదు. ఇలాంటి పలు విభిన్నకరమైన విషయాలపై మీ దృష్టి సారించటం అభినందనీయం. మరొక్కసారి మీకు ధన్యవాదములు.
గొల్లపూడి గారికి,
ReplyDeleteనమస్కారములు.
కీర్తికి గుప్పుమని ఎగిరిపోయే రెక్కలున్నాయి.
ప్రతీ ఊరిలో ఉండే గాంధీ బొమ్మ ని ప్రక్కకి నెట్టేసి మాజీ దివంగిత గూండా నాయకుల విగ్రహాలు వెలుస్తున్నాయి. కీర్తిని బలవంతం గా సెంటర్ల లో విగ్రహాల ద్వారా, వక్రించిన చరిత్ర తో పాఠ్యపుస్తకాల ద్వారా కొత్త తరం మీద రుద్దుతూ ఉన్నారు.
కీర్తి రెక్కలు కత్తిరించే జనాలు తయారయ్యారు.
యం.వి.బాలసుబ్రహ్మణ్యం
I strongly feel the need to bring to limelight the heroic, patriotic lives of several other great people. Here Iam not thinking about 'the wings of fame'. Many times I painfully think about lesser known and unsung heroes. Not because they need fame but because the nation can draw inspiration and enthusiasm by many fold ways from their lives.
ReplyDelete"కొందరికి కీర్తి వాళ్ళు పోయాక వస్తుంది. కొందరికి వాళ్ళు పోవడం వల్ల వస్తుంది. కొందరికి పోగొట్టడం వల్ల వస్తుంది. కొందరికి ఇలా పోగొట్టే మహానుభావుల భార్యలు కావడం వల్ల వస్తుంది."
ReplyDeleteఇలాంటి వాక్యాలు మీరు తప్ప ఎవరూ వ్రాయ లేరు గురువు గారూ...
నేను మాధురి గారితో పూర్తిగా ఏకీభవిస్తాను. స్వాతంత్ర్యం రావడానికి గాని, ఈనాడు మనమందరం వెచ్చగా నిద్దర పోతుంటే, మంచు కొండలలో కాపలా కాసే సరిహద్దు రక్షక దళం లో, పోలీసు తదితర రక్షణ వ్యవస్థ లో కానీ, చాలా మంది ఉంటారు, వారి త్యాగాలు, వారికే తెలుసు.
వారి అందరికీ, ఈ సందర్భము లో, నా (మన అందరి) హృదయ పూర్వక నమస్సుమాంజలి
భవదీయుడు
సీతారామం
prakasam kadu nellore pottisreeramulu district
ReplyDelete