Sunday, November 14, 2010
చిన్నచేప
ఓ సాయంకాలం నా కారు టోల్ గేటు దగ్గర ఆగింది. అక్కడ టోల్ ఆరు రూపాయలు. నా డ్రైవరుకి పదిరూపాయల నోటిచ్చాను. టోల్ కిటికీ దగ్గర , బయట ఒకాయన నిలబడి ఉన్నాడు. అయిదు రూపాయల నాణెం డ్రైవరుకి అందిస్తూ చిరునవ్వు నవ్వాడు. టిక్కెట్టు తీసుకోమన్నాను. రూపాయి చిల్లరలేదన్నాడు టోల్ మనషి. ఈ టిక్కెట్టుకీ రూపాయకీ ముడి ఉంది. రూపాయి ఇస్తే అధికారంగా టిక్కెట్టు వస్తుంది. డబ్బు గవర్నమెంటుకి చేరుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
గురువు గారూ,
ReplyDeleteమీరన్నట్లు ధనిక దేశాలలొ పెద్ద తిమింగలాలే మింగుతూవుంటాయి. మన దౌర్భగ్యం, అందరూ అందరినీ మింగాలని చూసే విచిత్ర లోకం మన దేశం, ఎందుకంటే సాయంకాలం అయ్యేసరికి చిన్న చేపలన్నీ తమ తమ రాణీ లేక రాజు చేపలకి వాటాలు పంపాలి (కల్మాడీ గారు, రాజా గారు, ఆదర్శ్ తాలూకూ వాళ్ళూ కూడ ఒక రకం గా చూస్తే ఈ బాపతే). అలా అలా ఆ వాటాలు పెద్ద తిమింగలాలకి ఎప్పటికప్పుడు చేరిపోవాలిగా మరి.
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
(మొన్నెప్పుడో నా బ్లాగ్ లో రాజా గారికి ఒక బహిరంగ లేఖ రాసాను, ఆయన ఇంకా బదులు ఇవ్వలేదు, ఎందుకనో. మీకు అభ్యంతరం లేకపోతే, ఈ పోస్ట్ కి కామెంట్ గా క్రింది లేఖను పబ్లిష్ చెయ్యగలరు)
ReplyDeleteమహారాజ రాజశ్రీ రాజా గారికి,
శుభాభినందనలు. మేము క్షేమము, మీరు క్షేమమని తెలుస్తూనే వుంది. ఈ రోజు మీ ఘన కీర్తి గురించిన వార్తలు వింటుంటే, గర్వంగా ఫీల్ అయ్యాము. ఈ మైలు రాయి అందుకోడానికి మీరు ఎంత కష్టపడ్డారో, ఎన్ని విలువలను తాకట్టు పెట్టేరో తలుచుకుని, ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నాం. కేంద్ర మంత్రిగా అవినీతి లో మీరు సాధించిన ఈ అత్యున్నత స్థాయి, మన దేశం లో ప్రజాస్వామ్యం ఉన్నంత వరకూ, ఒక బెంచ్ మార్క్ గా మిగిలిపోతుంది. లక్షల్లో అవినీతి కే ఓ న్యాయమూర్తి గారు, కేవలం కొన్ని పదుల కోట్ల అవినీతి కే ఓ ముఖ్య మంత్రి గారు, పదవులు కోల్పోయిన ఈ రోజున, మీరు ఇంకా మీ కొలువు లోనే కొనసాగడం, మీ నైపుణ్యానికి, మా అదృష్టానికి ఒక తార్కాణం. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయంటే మరి ఆశ్చర్యం ఏముంది, అసూయ ఆ మాత్రం హడావిడి చేయిస్తుంది మరి. మీరు ఇలానే మన దేశ ఖ్యాతిని ఇనుమడింప చేయాలని ఆశిస్తున్నాం. టెండూల్కర్ లా మీ రికార్డ్ లు మీరే బద్దలు కొట్టాలని మా కోరిక.
2G , 3G , లే కాక, 4G , 5G కూడా త్వరలోనే రావాలి, మీరు మళ్లీ మీ ప్రతిభను ప్రదర్శించాలి. మొన్నెప్పుడో ఒబామా గారు, మనల్ని అభివృద్ధి చెందిన దేశం అననే అన్నారు, దేని లోనో చెప్పకుండా. ఈ సారి, నోబుల్ లాంటి అత్యున్నత పురస్కారం మీకు (మీదైన విభాగంలో) రావాలని మా డిమాండ్. లక్ష డెబ్బై ఆరు వేల కోట్లను (కాగ్ లెక్క ప్రకారం) , మన జనాభా తో భాగించి, నా న్యాయమైన వాటాని నాకు online transfer చేస్తారనే నమ్మకం తో ఇంక ముగిస్తున్నాను. (ఎకౌంటు వివరాలు మీకు SMS లో పంపగలను) ఈ సారి, మీరు IPO ఆలోచన కూడా చేయగలరు.
కనిమొళి గారికి కూడా, మా అభినందనలు తెలియచేయండి.
మీ శ్రేయిభిలాషి, (మీ శ్రేయస్సే మా శ్రేయస్సని నమ్మే)
విజయ్ భాస్కర్.
చిన్న చేపల అవినీతి భాగోతాన్ని గురిచి పెద్ద రామాయణమే రాసారు సర్ !పట్టుబడిన ప్రతి వాడు ఈ మధ్య ఒక కొత్త పల్లవి ఎత్తుకున్నాడు ."పెద్ద పెద్ద రాజాలను వదిలేసి మేము చిన్న వాళ్ళమే దొరికామా అని ఒక డంటే.. మేము ఫలానా వర్గానికి చెందా మనే మమ్మల్ని ఇరికిస్తున్నారు అనే ఎదురు దాడికి దిగుతున్నారు ఇంకొంతమంది .లంచం ఇవ్వటం తీసుకోవటం తప్పని ఒక్క అవి తీసుకునే అవకాశం లేనివాళ్ళే వాపోతారు అని సాధారణ జనం అభిప్రాయ పడుతున్నారు. వీటన్నిటిని గురించి కూడా మరెప్పుడైనామీరు రాస్తే చదవాలని వుంది.కృతజ్ఞతలు సర్ !
ReplyDeleteచిన్న చేప ను పెద్ద చేప చిన్న మాయ ను పెను మాయ అన్నట్లు ఉంటుంది మన ప్రభుత్వ సంస్థల పనితీరు. రూపాయి ఏ కదా అని ఉరుకునేట్లు లేదు. పోనీ ఆ రూపాయి సక్రమంగా ప్రభుత్వ ఖజానా కు చేరితే మాత్రం ఏమి జరుగుతుంది అన్నది మనకు తెలిసిన విషయమే... సంవత్సరం కి ఒక సారి ప్రవేశ పెట్టె బడ్జెట్ లో అది ఏదో ఒక సహాయ నిధి కి కాని పధకానికి కాని కేటాయిస్తారు. మా పార్టీ పాలన లో ఇంత చేసాం అని చెప్పుకొని..ప్రకటిస్తారు .. అందులో పేదవాడి నోటికి చేరేది పది పైసలు ఉంటుంది అన్న నమ్మకం లేదు దాన్ని మధ్యలో చిన్న చేపలు పెద్ద చేపలు మింగేస్తాయి. అవినీతి అల అంచలు అంచలు గా పేరుకు పోయింది మన దేశం లో. దానికి ప్రతి భారతీయుడు కారణమే.. హైదారాబాద్ లో పాస్ పోర్ట్ త్వరగా రావాలి అంటే బ్రోకేర్ దగ్గరికి వెళ్తాం అది మన అవసరం. అలంటి బ్రోకర్ల వల్ల ఎంత మంది ఉద్యోగులకు మనం లంచం పోస్తున్నమో తేలేదు, ఎంత మంది దేశద్రోహుల కు పాస్ పోర్ట్ పొందే అవకాశం ఇస్తున్నామో తెలీదు. భారతావని అనే తులసి వనం లో వ్రేళ్ళ తో పెకిలించాల్సిన గంజాయి మొక్క ఈ అవినీతి. కష్టమే కవోచు అసాధ్యం మాత్రం.. దానికి మీరు(ఎవరినా) తొలి అడుగు వెయ్యాలి.
ReplyDelete