Sunday, December 5, 2010

రామ్ తెరీ గంగా మైలీ

సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మొన్న మన పాలక వ్యవస్థకి మంచి కితాబునిచ్చారు. గత ముప్పై సంవత్సరాలలో గంగానదిలో పేరుకున్న కాలుష్యం కన్న దరిద్రమయిన స్థాయిలో దేశంలో అవినీతి ఉన్నదని.
మనదేశం ప్రజాస్వామిక దేశం అంటూ మన నాయకులు చంకలు గుద్దుకుంటూ ఉంటారు. అంటే ప్రజలు ఎంపిక చేసిన నాయకులు పాలించాలని. కాని ఈ మధ్య ఏ నాయకులూ ఏ అవినీతిమీదా నిర్ణయాలు తీసుకోవడం లేదు. శిక్షలు విధించడం లేదు. ఎవరా నిర్ణయాలు తీసుకుంటూన్నారు? సుప్రీంకోర్టు. నిజానికి ముఖ్యమైన నిర్ణయలన్నీ సుప్రీం కోర్టు తీసుకుంటోంది ఇటీవల.

2 comments:

  1. నిస్సహాయుడైన వ్యక్తి, స్త్రీ గానీ, పురుషుడు గానీ, దౌర్జన్యం గా వలువలు ఊడ్చ బడినప్పుడు ఎలా కొంత ప్రతిఘటన తరువాత లొంగి పోతారో, అలా, మనందరి గుడ్డలూ ఎప్పుడో ఊడిపోయాయి. నగ్న నృత్యం చేస్తూ ఉన్నాం అందరం. అవకాశం ఉన్నంతలో అవినీతి మనందరి బంధువూ నూ. ఇప్పుడు ఇది వ్రాసిన నేను గానీ, చదివిన మీరందరూ గానీ, ఎన్ని రూపాయలు రసీదు లేకుండా ఖర్చు పెట్టారో, అదంతా అవినీతి కి ఆసరా నే. అది మొదలు, ఎక్కడెక్కడ మనం అవినీతి కి ఆసరా ఇచ్చి పెంచి పోషిస్తున్నామో ఆలోచించండి..అడక్క పోతే ప్లాట్ఫారం టిక్కెట్ కూడా కొనకుండా మూడు రూపాయలు మిగిల్చే మహానుభావులు ఎందరో!!

    సీతారామం

    ReplyDelete
  2. గురువు గారూ,
    అల్లు గారన్నట్లు (బొంబాయి లో ఇంతే... బొంబాయి లో ఇంతే) 'ఇండియా లో ఇంతే... ఇండియా లో ఇంతే' అని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి మనది.
    ప్రభుత్వం చేసే ప్రతీదానికీ న్యాయమూర్తులు కల్పించికోవలసి వస్తూ ఉంటే సామాన్య ప్రజలకి న్యాయం అందించడానికి వారికి కూడా తీరిక ఏదీ?
    మనం తక్కువ తిన్నామా అని ప్రతీవాడూ ఇష్టం వచ్చినట్లు చట్టాన్ని ఉల్లంఘిస్తూ అవినీతి కి తమ వంతు సహకారం అందిస్తున్నారు.
    సివిక్ సెన్స్ లేక చెత్తా చెదారమూ అంతటా పోసే మనకి, ట్రాఫిక్ సెన్స్ లేక రోడ్ మన బాబుది అని ప్రవర్తించే మనకి, ఎలాగయినా పని జరిపించుకోవడానికి చేతులు తడిపే మనకి, ఇంతకన్నా మంచి నాయకులు ఎలా వస్తారు చెప్పండి?
    రాజరికం లో 'యధా రాజా తధా ప్రజ' అయితే ఇప్పుడు 'యధా ప్రజా తధా రాజా '(మాజీ మంత్రి రాజా గారు ఒక్కరే కాదు, నాయకులందరూ).
    ముందు మనం మారాలి, కనీసం మంచి పౌరులుగా ప్రవర్తించాలి. నలుగురికీ మన లొసుగులు ఎత్తి చూపించాలి (మీ, మా మారుతీయం ఒక చక్కని ఉదాహరణ)
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    ReplyDelete