Monday, April 25, 2011

అవినీతికి గొడుగు

మనం అవినీతికి 'నీతి' గొడుగు పట్టడం ప్రారంభించి చాలా ఏళ్ళయింది. తమకు గుర్తుందా? ఆ మధ్య ప్రభుత్వం మనతో లాలూచీ పడింది. "మీరు నల్లధనం ఎలా, ఏ అవినీతి పనిచేసి సంపాదించారని మేం అడగం. మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి.40 శాతం మాకివ్వండి. మిగతా 60 శాతం మీ దగ్గరే ఉంచుకోండి" అన్న స్కీము పెట్టింది. ఎందరో పెద్ద మనుషులు సంతోషించారు. వేలకోట్ల ధనం పాతర్లోంచి బాంకుల్లోకి బదిలీ అయిపోయింది. ఇది ఊళ్ళని కొట్టేవాళ్ళని మంగళహారతి ఇచ్చి సత్కరించడం లాంటిది. అయితే లాభసాటి వ్యాపారం. ఎవరికి? కొల్లగొట్టేవాళ్ళకి..

Monday, April 18, 2011

ఓ గుండయ్య కథ

నేను దైవ భక్తుడిని. కాని చదువుకున్న దైవభక్తుడిని. చదువుకోని దైవభక్తుడు తన విశ్వాసానికి సమాధానం చెప్పలేడు. కాని అతను నాకంటే చాలా విధాలుగా, చాలా కారణాలకి నాకంటే గొప్ప దైవభక్తుడు కావచ్చు. నేను కారణాలు చెప్పగలను.
మన దేశంలో రకరకాల ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ వ్యాపార కేంద్రాలు. నేను 20 సంవత్సరాలు ఆకాశవాణిలో పనిచేశాను. కాని ఏనాడూ ఆకాశవాణి గొప్పతనాన్ని బేరీజు వేసే ప్రయత్నం చెయ్యలేదు. పక్కన హిరణ్య కశిపుడు ఉంటేగాని ప్రహ్లాదుడి గొప్పతనం అర్ధం కాదు. ఇన్ని ఛానళ్ళు సామూహికంగా ఆ ఉపకారం చేస్తున్నాయి. నేను ఎక్కువగా ఛానళ్ళు చూడను. చూడకుండా జాగ్రత్త పడతాను. అది నా ఆరోగ్య రహస్యం.

Monday, April 11, 2011

అన్నా..ఆహా..ఆహాహా.

ఉద్యమాలూ, నిరాహార దీక్షలూ, నినాదాలూ, బుకాయింపులూ దైనందిన కార్యక్రమాలుగా మారిపోయిన ఈ రోజుల్లో - మహాత్మాగాంధీని 'పాత చీపురుకట్ట'లాగా వాడుకుంటున్న కాలంలో, 'దేశసేవ' అనే బూతుమాటని 'మాటలు కూడా సరిగ్గా చెప్పలేని ప్రతీ దోపిడీదారుడూ వాడుకుని నిచ్చెన ఎక్కుతున్న ఈనాటి వైకుంఠపాళీ రాజకీయాల్లో, లాప్ టాపులూ, గ్రైండర్లూ, మంగళసూత్రాలూ వొడ్డి - ఎవడి బాబు సొమ్ముతోనో ఓట్లు కొనుక్కోడానికి పందెం కాస్తున్న పార్టీలు పేట్రేగిపోతున్న నేపధ్యంలో, ఈ దేశంలో 'అవినీతి' ముద్రపడిన నాయకులు పిఏసి సమావేశాలకి అలా షికారు వెళ్ళినట్టు వెళ్ళి మాయమవుతున్న తమాషాని చూస్తున్న ఓ మామూలు, నేలబారు మనిషి - కేవలం 'నీతి' పెట్టుబడిగా ఎంత సాధించవచ్చునో, దాని ప్రభావం ఎంత ఉండగలదో - అన్నా హజారే గతవారం రోజులుగా నిరూపించారు. ప్రజల నైరాశ్యం, ఆవేశం అనే కార్చిచ్చు ఎంత ఉధ్రుతంగా దేశమూ, రాష్ర్టమూ, జిల్లా, గ్రామం స్థాయిని దాటి ఎలా రేగిందో కోట్లాది మంది విస్తుపోయేలాగ, ఆవేదనతో రెచ్చిపోయేలాగ చేయగలదో గత ఏడురోజులూ నిరూపించాయి. గంటల్లో ఢిల్లీ సింహాసనం పునాదుల్తో కదిలింది. నాయకులు అర్ధంకాక దిక్కులు చూశారు.
పూర్తిగా చదవండి

Monday, April 4, 2011

కాలం గురించి ' కాలమ్'

నేను 30 ఏళ్ళుగా కాలం రాస్తున్నాను. ఆ మధ్య మిత్రులు, ప్రముఖ సినీనటులు వంకాయల సత్యనారాయణ అమ్మాయి నా రచనల మీద పరిశోధన చేస్తానంటూ వచ్చారు. నేను నా కాలంల మీద చెయ్యమన్నాను. తెలుగు పత్రికా ప్రపంచంలో ఎందరో మహానుభావులు కాలంస్ రాస్తూ వచ్చారు. ఆ విధంగా ఈ పరిశోధన మార్గదర్శకం కాగలదని నా ఆలోచన. నిన్ననే డాక్టరేట్ సిద్ధాంత గ్రంధాన్ని నాకు చూపించింది చి.లావణ్య.