ప్రియమైన సోదరులారా!
ఈ మధ్య కాలంలో మీ గురించి ఈ దేశ ప్రజలు ఆలోచిస్తున్నట్టు మా తల్లిదండ్రులు, ఆత్మీయుల గురించి కూడా ఆలోచించడంలేదు. అందుకు బోలెడన్ని కారణాలున్నాయి. పాకిస్థాన్ మిత్రులకి 'కాశ్మీర్' ఊతపదం. కానీ మాకు మీ దౌర్జన్యకాండలు ఊతపదం. అయితే మీరు చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. మీలో చిన్న అవగాహనా లోపం ఉంది. దాన్ని తొలగించడానికే ఈ ఉత్తరం. చిత్తగించండి.
Monday, July 25, 2011
Monday, July 18, 2011
అమెరికా కర్మ సిద్ధాంతం
అమెరికాలో అన్నిటికన్నా ఆకర్షించే విషయం- వ్యాపారం. సర్వకాలసర్వావస్థలలోనూ వీటిని అమ్మవచ్చా, వీటికి బేరం ఉంటుందా, యిలాకూడా వ్యాపారం చెయ్యవచ్చా అనిపించేరీతిగా నిత్యనూతనంగా- ఎప్పుడూ కొత్త కొత్త తాయిలాలను, వరాలను కురిపిస్తూ- ఎన్నటికీ అలసిపోని, ఎప్పుడూ సాగే కర్మకాండ వ్యాపారం
Monday, July 11, 2011
ఓ అరుదైన సాయంకాలం
మహానటి సావిత్రి నా మొదటి సినీమా (డాక్టర్ చక్రవర్తి) హీరోయిన్. నా ఆఖరి రేడియో నాటకం హీరోయిన్. ఈ రెండు సంఘటనల మధ్య ఆమె జీవితంలో జరిగిన అన్ని ముఖ్యమయిన ఘట్టాలూ పరుచుకున్నాయి. ఆకాశం ఎత్తుకి ఎగసిన కీర్తి ప్రతిష్టలున్నాయి. కృంగదీసిన అపజయాలున్నాయి. అనారోగ్యం ఉంది. నిస్సహాయమైన జీవన విధానం ఉంది
Monday, July 4, 2011
దేవుడికి జ్వరమొచ్చింది
మన దేవుళ్లు ఒకొక్కప్పుడు మనకంటే బలహీనులు. బొత్తిగా ఆరోగ్యాన్ని నిలుపుకోలేనివాళ్లు.
ప్రతీ సంవత్సరం ఆషాడమాసంలోనే జగన్నాధుడికి జ్వరం వస్తుంది. ఎందుకని? ఆయనకి 108 కలశాలతో అభిషేకం జరిగినందుకు. జలుబుచేసి, ముక్కు దిబ్బడవేసి జ్వరం ప్రారంభమవుతుంది. భక్తులు ఆయనకి రకరకాలయిన లేహ్యాలను సిద్ధం చేస్తారు. అంతేకాదు. ఆయన సోదరుడు బలభద్రుడు, దేవేరిలతో మూడు రధాలతో బయల్దేరదీసి- వేరే ఏకాంతమందిరంలో వుంచుతారు. అక్కడ ఆయనకి 15 రోజులపాటు అభిషేకాలు లేవు. దేవుడు పత్యం చేస్తాడు. జలుబు తగ్గి ఆరోగ్యం పుంజుకున్నాక- మళ్లీ స్వస్థలానికి వస్తాడు.

Subscribe to:
Posts (Atom)