Monday, August 8, 2011

సెన్స్ ఆఫ్ హ్యూమర్

ఇది తెలుగు కాలం కనుక ఇంగ్లీషులో మొదలెడతాను. సెన్సాఫ్ హ్యూమర్ అంటే కష్టాన్నీ, నష్టాన్నీ చూసి కడుపారా నవ్వుకోవడం. మనకి ఆ అలవాటు బొత్తిగా తక్కువంటాను. స్థాళీపులాకన్యాయంగా ఇక్కడ కొన్ని ఉదాహరణలు.
ఆ మధ్య పేపర్లో ఓ వార్త చూశాను. తమిళనాడులో ఎక్కడో ఓ కుర్రాడు ఓ కక్కుర్తి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. కోర్టు ఆ కుర్రాడిని జైల్లో పెట్టింది. తీరా విచారణ జరుపుతూ బెయిల్ ఇవ్వడానికి 1200 రూపాయలు కట్టమంది. వెనకటికి ఓ పూర్వసువాసిని 'మా ఆయనే ఉంటే మంగలి ఎందుకు బాబూ' అన్నదట. ’నా దగ్గర అంత డబ్బుంటే దొంగతనం ఎందుకు చేస్తాను బాబూ?!’ అన్నాడట ఆ కుర్రాడు.
పూర్తిగా చదవండి

1 comment:

  1. అదేమిటండీ అలా అంటారు? మనకి సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ అని నేనంటాను. పొద్దున లేస్తే రాజకీయ నాయకుల సెన్సాఫ్ హ్యూమర్, తెలంగాణా హ్యూమర్ (సారీ నేను తెలంగాణా వ్యతిరేకిని), ప్రేమికుడు తన ప్రేమికురాలు ప్రేమించలేదని యాసిడ్ పోసే హ్యూమర్, ఇలా ఎన్నో హ్యూమర్లు చూస్తూనే వున్నాం. చూడండి ఎంత సెన్సాఫ్ హ్యూమర్ పెంచుకుంటున్నామో.

    ReplyDelete