Monday, August 15, 2011

ముష్టి పెత్తనం

ఒక ముష్టివాడు ఒక ఇంటికి బిచ్చానికి వెళ్ళాడట. ఇంటి కోడలు ఏమీ లేదు వెళ్ళమంది. బిచ్చగాడు బయలుదేరిపోయాడు. వెళుతున్న బిచ్చగాడిని అత్తగారు పిలిచారట. ఏమయ్యా వెళ్ళిపోతున్నావని.
కోడలమ్మగారు వెళ్ళమన్నారండి అన్నాడట బిచ్చగాడు. అత్తగారు చర్రున లేచింది. "అదెవరయ్యా చెప్పడానికి. నువ్వు రా" అన్నది. ఇతను వెళ్ళాడు. అప్పుడు అత్తగారు చెప్పిందట సాధికారికంగా "ఇప్పుడు నేను చెపుతున్నాను. ఏమీలేదు వెళ్ళు" అని.
ఇచ్చినా, పొమ్మన్నా అత్తగారికే చెల్లును - అన్నది సామెత. ఈ దేశానికంతటికీ అలాంటి ఓ అత్తగారుంది. తిట్టినా తిమ్మినా, శిక్షించినా, రక్షించినా, పొమ్మన్నా ఉండమన్నా ఆ అత్తగారికే చెల్లును. ఆ అత్తగారు - సుప్రీం కోర్టు.
పూర్తిగా చదవండి

3 comments:

  1. mee column loni 'vyangyam' nootiki nooru paallu nijamenandi..

    ReplyDelete
  2. చాలా బాగుంది సార్.

    ReplyDelete
  3. మనిషి లోని మానవత్వం ఆవిరి అయిపోయి మనిషిలోకి రాక్షషుడు ప్రవేశిస్తున్నాడేమో అనిపిస్తుంది. కలి కాలం. తప్పు చేయనివాడు పూర్తిగా భయపడి, తప్పు చేసినవాడు ఏమాత్రం భయపడని పరిస్థితి. కలి యుగం మొదటిలోనే ఇలా ఉంటే రాను రాను ఇంకెలా ఉంటుందో!

    ReplyDelete