Monday, January 21, 2013

రైలు ప్రయాణం

మనం చాలాసార్లు రైలు ప్రయాణం చేసి ఉంటాం. చేస్తూనే ఉంటాం. మన కళ్ళ ముందునుంచి స్టేషన్లు వెనక్కు వెళ్ళిపోతూంటాయి. అనకాపల్లి దాటాక ఎలమంచిలి వస్తుంది, తరువాత తుని. తరువాత అన్నవరం వస్తుంది. మరేదో మరేదో. దాటిపోయే స్టేషన్లు మన గమనానికి గుర్తు. కానీ ప్రయాణమంతా మనతో వచ్చే కొన్ని దృశ్యాలుంటాయి. పచ్చని పొలాలూ, అక్కడక్కడ చెరువులూ, కాలవలూ, ఎగిరే పక్షులూ, మీద నీలపుటాకాశం - ఇలాగ. ప్రయాణంలో స్టేషన్ మజిలీ. మనతో కదిలే దృశ్యం ప్రయాణాన్ని అలంకరిస్తుంది - మనకి తెలియకుండానే. చాలామందికి స్టేషన్లు గుర్తుండవు. కానీ అందరికీ ప్రయాణం ఇచ్చిన అనుభూతి గుర్తుంటుంది - తప్పనిసరిగా. ప్రయాణానికి అనుభూతే ప్రాణం. గమ్యం లక్ష్యం.
పూర్తిగా చదవండి

3 comments:

  1. అవునండీ.. అవే ఊళ్ళు అవే ప్రదేశాలు ఐనప్పటికి ప్రతిసారి ప్రయాణం కొత్త అనుభూతిని కలిగిస్తుంది

    ReplyDelete
  2. చాలా బాగా రాశారండి...

    ReplyDelete
  3. A very good article. It was started like a short story and went on to describe, how the landmarks of our history have become nothing but blurs in the pace of our journey of descent.

    ReplyDelete