ఒక విచిత్రమైన, కాని ఆలోచింపజేసిన, ఆలోచించాల్సిన అరుదైన సందర్భం. దక్షిణామ్నాయ శృంగేరీ శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి విశాఖపట్నం వేంచేశారు. భీమునిపట్నంలో సద్గురు శివానందమూర్తివారి ఆశ్రమానికి -వారి దర్శనార్థం వెళ్లాను. శివానందమూర్తిగారు నన్ను అందరిలోనూ పిలిపించారు. స్వామివారికి స్వయంగా పరిచయం చేశారు. స్వామివారు ముందుకు వంగి ఆసక్తిగా వింటున్నారు. నన్ను ఏమని పరిచయం చేస్తారు? ప్రముఖ రచయితననా? సినీనటుడిననా? రేడియో డైరెక్టరుగా రిటైరయాననా? టీవీల్లో కార్యక్రమాలు నిర్వహిస్తాననా? మంచి వక్తననా? వీటిలో ఏదయినా లేదా అన్నీ చెప్పవచ్చు. కాని రెండే మాటలు చెప్పారు -సద్గురువులు. అవి ఇవి: ''ఈయన గొల్లపూడి మారుతీరావు. మంచి సంస్కారం వుంది'' అంతే! ఈ విశేషణాలలో ఏవో చెప్తారని ఊహించిన నేను ఈ పరిచయానికి ఆశ్చర్యపోయాను. ఆలోచించగా -కనువిప్పూ అయింది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
గురువు గారూ,
ReplyDeleteఅభినందనలు.
మీరన్నట్లు మీ గురించి చేసిన పరిచయ వాక్యం, మీకు దొరికిన అత్యున్నతమైన పురస్కారం.
సంస్కారం మన దేశపు సంస్కృతి.
ఆలోచనా ధోరణీ, వ్యక్తి శీలత, పెద్దల వారసత్వంగా, సంప్రదాయ వైభవంగా మనకి సంక్రమంచిన మహోన్నతమయిన సంపద ఇది.
పరిస్థితుల విషప్రభావాలనుంచి మనుష్యులని రక్షించేది సంస్కారం.
సత్ప్రవర్తన కి కారణమయ్యేదీ, చెడు/కీడు చేయబోయటప్పుడు విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదించేదీ సంస్కారం.
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
adbhutam!
ReplyDeleteYou deserve this sir.
ReplyDeletegauravaneeyulaina gollapooDi maarutiaraavu gaariki,
ReplyDeletesamskaaravantuDu ani pilipinchukovaDam meeku dakkina chaalaa uchitamayina birudu. idea samskaaram adhaaramugaa okappuDu ee samaajam nirmaanam jarigindi. idea manaku inTaa bayaTaa bhodinchabaDeadi mariyu manamu nearchukuneadi. I madhya vidhya kalalu oka vyaaparam ayipoayi, ummaDi kuTumbaala maayamaipoyi mariyu mata raajakeeyaalu perigipoayi janaalalo samskaaram naSinchaDam praarambhamayindi. diani valana prapanchaaniki gaDDu kaalam raakooDadani mariyu meelaanTi marinni samskaaravantulu ia prapanchaanni munduku naDuputaarani aaSistua,
Sreenivaasu