Wednesday, July 31, 2013

కుక్కపిల్ల కథ

 అమెరికా నుంచి మా మిత్రుడొకాయన ఒక కార్టూన్‌ పంపించాడు. కార్టూన్‌ అంటే తెలియనివారికి -దృశ్యరూపమయిన వెక్కిరింత. దాని శీర్షిక 'ఇండియా రాజకీయాలు -మాధ్యమాల అద్భుత ప్రదర్శన'. ఒక పాత్రికేయుడు భారతీయ జనతా పార్టీ నాయకులు మోడీగారిని అడుగుతున్నాడు: ''అయ్యా, మీకే పండు ఇష్టం?'' అని. మోడీ క్లుప్తంగా 'ఆపిల్‌' అన్నారు. వెంటనే పెద్ద అక్షరాలతో టీవీ తెరనిండా ''తాజా వార్త!'' అనే అక్షరాలు. ఏమని? ''మోడీ మామిడిపళ్లని అసహ్యించుకుంటున్నారు!'' అని. వెంటనే కాంగ్రెస్‌ ప్రతినిధి ఒకాయన ఆవేశంగా కళ్లు పెద్దవి చేసి చెప్తున్నారు: ''ఇప్పటికైనా నా మాట నిజమని నమ్ముతారా? ఏపిల్‌ రంగునిబట్టి మీకేం అర్థమౌతోంది? మోడీకి రక్తదాహం! అందుకనే ఎర్రటి పండు ద్వారా ఆయన అసలు రంగు బయటపడింది!''
పూర్తిగా చదవండి 

2 comments:

  1. నరేంద్ర మోడీని రాయిటర్స్ సిబ్బంది ఇంటర్ వ్యూ చేశారు. ఈ లింకులో చూడొచ్చు-
    http://blogs.reuters.com/india/2013/07/12/interview-with-bjp-leader-narendra-modi/

    ఈ ఇంటర్ వ్యూలో ప్రశ్నలూ సమాధానాలే ఉన్నాయి. వివాదాస్పదంగా మారిన వ్యాఖ్య ను మోడీ ఏ ధోరణిలో చేసిందదీ ఇంటర్ వ్యూలో ఆ పాత్రికేయులు వర్ణించలేదు.

    కానీ మీరేమో ‘నిష్కల్మషంగా, ఏమీ నటనలేకుండా, అతి ఆర్ధ్రంగా’ మోడీ ఆ వ్యాఖ్యలు చేశారంటూ వర్ణించారు. మీ వర్ణనకు ఆధారం ఏమిటో చెబితే తెలుసుకోవాలనివుంది!

    ReplyDelete
  2. ఉద్యోగ రీత్యా నేను 79-80 లలో జంట నగరాలలోనూ ,
    84 లో ఢిల్లీ లోనూ, 2002 లో గుజరాతులోనూ , ఉండడం వల్ల ,
    డాక్టర్ గా ఊచ కోతల వల్ల భాధ పడ్డ వాళ్ళను ప్రత్యక్షంగాచు చూసిన వాడిని.
    పై వాటిల్లో అన్నిటికంటే ఘోరాతి ఘొరమైనవి, ప్రభుత్వ అండ తో జరిగింది 2002 లోనే ,
    నా స్పందన "కుక్క పిల్ల మరణం" గురించి మీ లా మాత్రం ఉండదు.

    ReplyDelete