skip to main |
skip to sidebar
నేను పుట్టిన పదేళ్ళకి ఆవిడ మొదటి కథ పుట్టింది. పేరు 'రవ్వల దుద్దులు '. ఏలూరులో ఆవిడ చిన్నతనం గడిచింది. తెలుగు భాషని డ్రాయింగు రూముల్లోకి తెచ్చిన కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారు, బంగారు మామని పరిచయం చేసిన కొనకళ్ళ వెంకట రత్నంగారు, ఎంకి - నాయుడు బావ సృష్టి కర్త నండూరు సుబ్బారావుగారు, 'బాలబంధు ' బి.వి.నరసింహారావుగారు మొదలైన వారు ఇంటికి తరచు వచ్చిపోతూండేవారు.
పూర్తిగా చదవండి
పేదవాడి జీవనాధారం ఉల్లిపాయ. మా చిన్నతనంలో మా అమ్మమ్మ పులుసిన చద్దన్నంలో కాస్త నూనె వేసి చేతికి చిన్న ఉల్లిపాయని ఇచ్చేది. ఇప్పటికీ తలుచుకున్నా మత్తెక్కించే ఆహారం అది. తెలంగాణాలలో ఇప్పటికీ బడుగుజీవులకు ముఖ్య ఆహారం గొడ్డుకారం. పచ్చి ఉల్లిపాయ, ఎండు మిరపకాయలు, ఉప్పు. ఇంతే.
పూర్తిగా చదవండి
ఒక్కొక్కప్పుడు ఉద్యమాల వల్ల సాధించేవాటికన్నా ఉద్యమాల కారణంగా కలిసివచ్చే మేళ్లు -కొండొకచో రుచికరంగానూ, కడుపునింపేవిగానూ ఉంటాయి. అలాంటి సందర్భం -ఈ మధ్య చెన్నైలో కనిపించింది. అవేమిటి? టొమాటోలూ, ఉల్లిపాయలూ, అల్లం. ఎలాగో చెప్తాను. ఈ మధ్య ఉధృతంగా తెలుగుదేశంలో ఉద్యమం సాగుతోంది. ఎటునుంచీ లారీలూ, వాహనాలూ కదలడం లేదు.
పూర్తిగా చదవండి
ఈ దేశంలో నిజాయితీ బొత్తిగా చెల్లని సరుకు. ముఖ్యంగా ఆఫీసర్ల నిజాయితీ పక్కలో బల్లెం. ఆ విషయం ఎరిగిన చాలామంది ఐయ్యేయస్ ఆఫీసర్లు దీపముండగానే యిల్లు చక్కబెట్టుకుంటున్నారు. పాపం, శ్రీలక్ష్మి, రాజగోపాల్ వంటివారు వీధినపడి, కొందరు జైళ్ళలో పడినా మొత్తానికి నిజాయితీని అటకెక్కించడం బాగా కిట్టుబాటవుతున్న సందర్భాలే కనిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి