Friday, November 8, 2013

టాగోర్ నోబెల్ కి నూరేళ్ళు

చాలామందికి గుర్తుండకపోవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి సరిగ్గా నూరేళ్ళ కిందట - 1913లో విశ్వకవి రవీంద్రనాధ్ ఠాకూర్ అందుకున్నారు. నిజానికి యూరోపియన్ దేశాలకి చెందని రచయిత మొదటిసారిగా సాహిత్యపు బహుమతిని అందుకున్న మొదటి సందర్భం ఇదే. అటు తర్వాతే పెరల్ బక్, నయాపాల్ వంటివారిని నోబెల్ బహుమతి వరించింది. తూర్పుదేశాల ఆలోచనా స్రవంతిని, తాత్విక చింతననీ మరో 20 సంవత్సరాల ముందే పాశ్చాత్యులకు పరిచయం చేసి, వారిని నిశ్చేష్టులను చేసిన ఘనత మరొకరికి దక్కుతుంది. ఆయన స్వామి వివేకానంద. ఇద్దరూ భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతీకగా నిలిచిన బెంగాలు దేశస్థులు కావడం యాదృచ్చికం.
పూర్తిగా చదవండి

2 comments:

  1. ఓ మంచి సంఘటనని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అండి. గీతాంజలి అంటే మణిరత్నం పేరే గుర్తుకు తెచ్చుకునే రోజుల్లో ఉన్నాం. చలం గారి అనువాదం చదివి, ఎన్నో సార్లు నేను పరవశించిపోయాను. మాటల్లో చెప్పలేని అనుభూతి అది. నా దృష్టిలో హృదయం నుంచీ వచ్చే కవిత్వం, చదివే మనిషిలో మనిషితనాన్ని తట్టి లేపుతుంది. (భాష, ప్రాంత, దేశ వగైరా అన్ని సంకెళ్ళు తెంపేస్తూ) బహుశా అత్యుత్తమ స్థాయి లో ఉన్న ఏ కళ అయినా, ఫలితం అలానే ఉంటుందేమో. మీ మాటల్లో గీతాంజలి గురించి వినాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది, మీకు సమయం చిక్కనప్పుడు, తప్పకుండా వివరంగా రాయాలని వినమ్రంగా వేడుకుంటున్నాను. - విజయ భాస్కర్. (చాలా కాలం క్రితం నేను నా బ్లాగు లో రాసుకున్నాను, "అంతులేని ఒంటరి ప్రయాణానికి ఒకే ఒక వస్తువు తోడుగా తీసుకెళ్ళాలి అంటే, నేను గీతాంజలి పుస్తకాన్ని తీసుకువెళ్తాను" అని.)

    ReplyDelete
  2. సార్ నేను అవకాశం దొరికినప్పుడల్లా మీ బ్లాగ్ చదువుతుంటాను.
    మీ రచనలలు అనుభవపూర్వకమైనవి కనుక నన్ను అవ్వి ఆలోచింపజేస్తాయి. ఏదో చదివామా వదిలేశామా అనట్టు కాకుండా విశ్లేషణాత్మకంగా ఉంటాయి మీ రచనలు.
    క్రమం తప్పకుండా మీరు నిబద్ధతతో రాసే విధానం నాకు స్ఫూర్తినీయంగా అనిపిస్తుంది. నేను కూడా అప్పడప్పుడు రాస్తుంటాను. అయితే ప్రయత్నలోపం ఇంకా పని ఒత్తిడి కారణంగా నాకు ఎంతో ఇష్టమైన రచన అనే అలవాటుకు దూరంగా ఉంటున్నాను.
    చెన్నై వచ్చినప్పుడు ఒకసారి తప్పకుండా మిమ్మల్ని కలిసి సంభాషించాలని కోరుకుంటూ,
    ఆదిత్య కప్పగంతుల.

    ReplyDelete