Tuesday, November 26, 2013

మనిషీ - మహాత్ముడూ

ఈ మధ్య నార్వే, స్వీడన్ దేశాలకు వెళ్ళాను. ఆ దేశాలలో పర్యటించేటపుడు నన్ను ఆకర్షించేది చుట్టూ కనిపించే భవనాలూ, కట్టడాలు కాదు. వాళ్ళ జీవన సరళి, వ్యక్తిత్వ వికాసం, సామాజిక శీలం.
పూర్తిగా చదవండి

Wednesday, November 13, 2013

ఎవడబ్బ సొమ్ము?

బస్సు చార్జీలు పెరిగాయి. సందేహం లేదు. సామాన్య మానవుడి జీవితం మీద ఇది గొడ్డలి పెట్టు. ఈ కారణంగా ఖర్చులు, నిత్యావసర వస్తువులు, ఇతర సంభారాల ధరలూ - అన్నీ పెరుగుతాయి.
ఇవాళ పేపర్లో ఒక సుందర దృశ్యాన్ని (ఫోటో)ని ప్రచురించారు. ఓ పార్టీ హర్తాళ్ చేస్తూ బస్సుని తాళ్ళతో లాగుతున్నారు. ఇది ఊహించిన, సబబైన నిరసన. కానీ దీనికి బాధ్యులు?
పూర్తిగా చదవండి

Friday, November 8, 2013

టాగోర్ నోబెల్ కి నూరేళ్ళు

చాలామందికి గుర్తుండకపోవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి సరిగ్గా నూరేళ్ళ కిందట - 1913లో విశ్వకవి రవీంద్రనాధ్ ఠాకూర్ అందుకున్నారు. నిజానికి యూరోపియన్ దేశాలకి చెందని రచయిత మొదటిసారిగా సాహిత్యపు బహుమతిని అందుకున్న మొదటి సందర్భం ఇదే. అటు తర్వాతే పెరల్ బక్, నయాపాల్ వంటివారిని నోబెల్ బహుమతి వరించింది. తూర్పుదేశాల ఆలోచనా స్రవంతిని, తాత్విక చింతననీ మరో 20 సంవత్సరాల ముందే పాశ్చాత్యులకు పరిచయం చేసి, వారిని నిశ్చేష్టులను చేసిన ఘనత మరొకరికి దక్కుతుంది. ఆయన స్వామి వివేకానంద. ఇద్దరూ భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతీకగా నిలిచిన బెంగాలు దేశస్థులు కావడం యాదృచ్చికం.
పూర్తిగా చదవండి

Sunday, October 27, 2013

మళ్ళీ తాజ్

నేనూ మా ఆవిడా తాజ్‌మహల్‌ చూసి 51 సంవత్సరాలయింది. అప్పుడు ముగ్గురం కలిసి చూశాం. మేమిద్దరం, మా చేతిలో పదినెలల మా పెద్దబ్బాయి. అప్పుడే ఆలిండియా రేడియోలో చేరిన రోజులు. నా వయస్సు 24. మా ఆవిడ 22. ఢిల్లీ ట్రెయినింగ్‌కి పదిరోజులు పిలిచారు. ఢిల్లీ వెళ్లడం మా ఆవిడకి కొత్త. అప్పుడు నా జీతం 260 రూపాయలు (1963 మాట). అయితే అప్పటికే 'డాక్టర్‌ చక్రవర్తి' రాసి ఉన్నాను. కనుక కాస్త డబ్బు చేతిలో ఉన్న పరిస్థితి. మళ్లీ ఇలాంటి అవకాశం ఎప్పటికో? ఇద్దరం వెళ్లాలని నిశ్చయించుకున్నాం
పూర్తిగా చదవండి

Monday, October 21, 2013

అరాచకానికి ఎల్లలు

ఓ యింటిముందు రాలుగాయి కుర్రాళ్లు సీనారేకు డబ్బాలు మోగిస్తూ అల్లరి చేస్తున్నారు. ఇంట్లో ముసలాయన గుండె ఆ శబ్ధానికి రెపరెపలాడుతోంది. ఆపమంటే ఆగరని తెలుసు. రోజూ అదేవరస. ఏం చెయ్యాలి? ముసలాయన అఖండమైన మేధావి. బయటికి వచ్చి వాళ్లందరినీ పిలిచాడు. ముసలాయన్ని అనుమానంగా చూశారు కుర్రాళ్లు. ఆపమంటే రెచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాని వాళ్లని ఆపమనలేదు. ''మీరెంతమంది?'' అన్నాడు.
పూర్తిగా చదవండి

Saturday, October 19, 2013

సరికొత్త దేవుడి కథ

మా పెద్దబ్బాయి చెన్నెలో ట్రావెల్స్‌ సంస్థని నడుపుతాడు. ప్రతీ రెండు మూడేళ్లకీ పాతబడిన, మరమ్మత్తుకి వచ్చిన కార్లని అమ్మి కొత్త కార్లని కొంటూంటాడు. కాని ఎన్ని ఏళ్ళయినా మార్చని, అమ్మని ఓ పాతకారుండేది. నాకు అర్థం కాలేదు. ''అన్నీ అమ్ముతున్నావు. దీన్ని ఎందుకు అమ్మవు?'' అన్నాను. మా అబ్బాయి నవ్వాడు. గర్వంగా సమాధానం చెప్పాడు. చెన్నైలో చీపాక్‌ గ్రౌండుకి ఒకసారి సచిన్‌ టెండూల్కర్‌ ఆ కారులో వెళ్లాడట. అది ఒక గొప్ప అనుభవానికి గుర్తు. ఈ కారు ఒక జ్ఞాపిక. అదీ 41 సంవత్సరాలుగా క్రికెట్‌ని ఆరాధిస్తున్న ఓ భక్తుడి తాదాత్మ్యం.
పూర్తిగా చదవండి..

Tuesday, October 8, 2013

అమ్మా కొడుకుల భాగోతం

వ్యాపార లావాదేవీలలో ఎప్పుడూ ముగ్గురుండాలి (రాజకీయం వ్యాపారమయి చాలాకాలమయింది). మొదట ఇద్దరు చర్చలు జరుపుతారు. మూడో వ్యక్తి ఆ చర్చలకి దూరంగా ఉంటాడు. తీరా నిర్ణయాలన్నీ జరిగిపోయాక -వాటిని ఆ మూడో వ్యక్తి వింటాడు. ఇందులో ఎవరికి నచ్చకపోయినా, కొత్త కిరికిరి పెట్టాలన్నా ఈ మూడో వ్యక్తికి వెసులుబాటు ఉంటుంది. అన్నీ తమకి అనుకూలంగా లేకపోతే ఆ ఒప్పందాన్ని గంగలో కలిపే అవకాశమూ అతనికే ఉంటుంది. అంటే ఏతా వాతా ఏ ఒప్పందానికయినా ఆఖరి నిర్ణయం దూరంగా నిలిచిన ఈ మూడో పెద్దమనిషిది.
 పూర్తిగా చదవండి