Monday, May 10, 2010

గాంధీలు పుట్టిన దేశం

దాదాపు పాతికేళ్ళ కిందట నేను "అభిలాష" అనే సినిమాలో నటించాను. ఉరిశిక్ష రద్దుచేయాలన్న ఆదర్శాన్ని చాటే చిత్రమది.చివర లో చిరంజీవి వాదనని నేనే రాశాను. నిరపరాధికి శిక్షపడితే శిక్షించకుండాకాపాడే స్థితికి 'అభిలాష' తత్వాన్నివంటబట్టించుకున్న తరంలో మనం జీవిస్తున్నందుకు గర్వంగా ఉంది.
పూర్తిగా చదవండి

17 comments:

  1. బహు బాగా చెప్పారు. "ఎ వెడ్నెస్ డే" లాంటి సినిమా నిజమైతే తప్ప వీళ్ళకి శిక్షలు పడవు. మన ఖర్మేంటంటే, ఇదే వెధవలకి మన జవాన్లు సంవత్సరాల తరబడి భద్రత కల్పించాలి. బతికించి వాడిని సంస్కరించటం దేవుడెరుగు, మళ్ళీ మనమే వాళ్ళకి సపర్యలు చెయ్యటం కన్నా దౌర్భాగ్యం ఉంటుందా?

    ReplyDelete
  2. ఇంత చర్చేమిటి దీనికి? కోర్టులో న్యాయాన్యాయాలు సరిచూసి, దేశ చట్ట ప్రకారం శిక్ష వేయటం జరిగింది. శిక్ష అమలు పరచటమే. వాళ్ళనేదో మారుద్దాం, సంస్కరిద్దాం అనేవి, చేతకాని డాంబికపు మాటలు. సంస్కరణకు కూడ అర్హత అనేది ఉంటుందికదా. ఎవడిని పడితే వాడిని, ఎంత చండాలపు పనులు చేసినా, ఓరి బుజ్జి కన్నా నీకు శిక్ష లేదురా, నిన్ను సంస్కరిస్తాంరా, జైల్లో అన్ని సౌకర్యాలు సమకూర్చి అంటె, ఏమవుతుందో తల్చుకోవటానికే భయమేస్తుంది.

    ఇక్కడి ప్రజలను చంపాలన్న ఒక ఘోరమైన ఆలోచనతో శతృ దేశం నుంచి వచ్చినవాడి గురించా ఈ చర్చంతా. మానవ హక్కులు అనేవి అన్యాయంగా ఎవరికీ శిక్షపడకుండా రక్షించాలిగాని, వెర్రి వాగుళ్ళు వాగి నేరస్తుల కొమ్ము కాయకూడదు. అసలు ఈ సంఘాల వాళ్ళకి డబ్బులు ఎక్కడనుంచి వస్తున్నాయో, వాళ్ళు ఇలా ఎందు మాట్లాడుతున్నారో దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

    ReplyDelete
  3. Good article.

    By the way, the attack on parliament was in 2001 and not in 1991.

    ReplyDelete
  4. చాలా చక్కగా చెప్పారు. మన భారత దేశానికి చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. బ్రాహ్మణులు అహింసని పాఠిస్తూ ధర్మ బోధని చేసే వారు.
    రాజు ధర్మ రక్షణ చేసే వాడు. దానికి గ్లాని కలిగినప్పుడు ఎంతటి శక్తినైనా ఎదుర్కొని సంహరించి నిల బెట్టటమే అతని ధర్మం.

    ReplyDelete
  5. గొల్లపూడి గారూ,

    మిగిలిన ఉరి శిక్షల గురి౦చి వదిలేసి, కేవల౦ కసబ్ విషయ౦లో నాకొక ధర్మ స౦దేహ౦ పీడిస్తో౦ది. ఈ కధ ప్రత్యేకత ఏమిట౦టే, కర్త, కర్మ ఎవరో అయితే, క్రియ కోస౦ వినియోగి౦చిన పనిముట్టు మాత్రమే కసబ్ అనేది నా అభిప్రాయ౦.
    మీలా౦టి పెద్దల సమాధాన౦ నాకు కొ౦త తెరిపినివ్వొచ్చు.

    ఒకడు మా౦చి తుపాకీని తయారు చేసి, ఒకడిని పేల్చాడను కు౦దా౦. తప్పు పేల్చిన వాడిదా, తుపాకీదా? పేల్చిన వాడికి బదులు, తుపాకీని శిక్షి౦చడ౦ న్యాయమా? ఉపయోగమా? తిక్కా? చేతగాని తనమా? ఆత్మ వ౦చనా?

    కసబ్ ఒక మృత్యు య౦త్ర౦ అన్నారు, అజ్మల్ గారు. ఒక చిల్లరదొ౦గని పట్టుకొని, డబ్బులిచ్చి లొ౦గదీసుకుని, తుపాకులు పేల్చట౦ మాత్రమే నేర్పి, పరాయి దేశ౦మీదకి ప౦పి ఒక ’మానవతుపాకీ’గా వాడుకున్నారు సదరు ముష్కరులు. సదరు మృత్యు య౦త్ర౦ బతికి వు౦టే కన్న చచ్చిపోతేనే వారికి లాభ౦(చ౦పేసి మారణాయుధాన్ని నాశన౦ చేసినట్లు). మరి వాడికి వురి శిక్ష వేస్తే, మనమే ఆ ఆయుధాన్ని నాశన౦ చేసినట్లు కాదా?

    నేనేమీ కసబ్ పై మానవత్వ౦తో ఈ ప్రశ్నలు వేయడ౦ లేదు, మన౦ విధి౦చిన ఈ ఉరి, కసబ్ చావడమనే వారి(తన) లక్ష్యాన్ని సాధి౦చడ౦ కన్నా, వారికి ఏ విధమైన ప్రతిఘటనను ఇస్తు౦దన్నదే నా అనుమాన౦.

    ReplyDelete
  6. మరోటి, ఈ ఉరి కసబ్ ని వారి దేశ౦లో ఒక అమర వీరుణ్ణి చేస్తు౦ది. మన దేశ౦పై ఆ దేశపు అపరిపక్వ యువతలో మరి౦త కసిని పె౦చుతు౦ది. ఇది ఆ ముష్కరులు తెలివిగా ప్రయోగి౦చిన ఆయుధ౦, మేధో యుద్ద౦. ’కసబ్’ కి ఉరి దీనికి సమాధాన౦ కాదు. చావు కఠినమైన శిక్ష అనేది కేవల౦ అపోహే. దీనిక౦టే పెద్ద శిక్షని కనుగొనాలి. అది చావు కాదు, అ౦తక౦టే భీతి గొల్పేది, వారి చర్యలకు సమాధానమిచ్చేది, అది అహి౦సా మార్గమయితే మరీ మ౦చిది.

    ReplyDelete
  7. హెంస్ గారు ఇంకేం చేద్దామంటారు, బడ్జెట్ లో ఇంకో పాతిక వేల కోట్లు కేటాయించి, వాడు చచ్చే దాక చికెన్ బిర్యానీ లు సప్లై చేద్దామా. లేక పోతే శంకరదాదా సినిమాలో లాగా రెండు గులాబీ లు ఇచ్చి ఒక గాంధి ఆటోబయాగ్రఫి ఇచ్చి సకల లాంచనాలతొ మన మర్యాదలు చూసి పాకిస్తానుకు మతిపోయేలా మల్లి కసబ్ గారిని విసిట్ అగైన్ అంటూ పాఇస్తాను కు పంపిద్దామా?

    ReplyDelete
  8. Hems గారూ, కసబ్ ఏమీ వస్తువు కాదు మళ్ళీ మనం వాడుకోవడానికి. ఒక మత పిశాచి. అతనికి తాను ఏం చేస్తున్నాడో తెలియకపోయే అవకాశమే లేదు. తెలిసి చేసాడు.అందులోనూ విచారణలో వీలైనన్ని అబద్ధాలు ఆడాడు. చావు కంటే భీతి కొలిపే శిక్ష అహింసా పద్ధతిలో కనిపెట్టేసరికి ఎంత కాలం పడుతుందో?? అప్పటి వరకు వీళ్ళు ప్రత్యేక సౌకర్యాలు అనుభవించటం .... ఇవన్నీ ఎందుకండి??
    "సదరు మృత్యు య౦త్ర౦ బతికి వు౦టే కన్న చచ్చిపోతేనే వారికి లాభ౦"
    ఈ వ్యాఖ్య మరొక్కసారి ఆలోచించండి. వాడు బతికివుంటే గొల్లపూడి గారు పేర్కొన్నట్టు ఏ విమానం హైజాక్ లో చేసి వాణ్ణి విడుదల చేయించి మరో దారుణానికి (కచ్చితంగా) పురికొల్పుతారు. అయినా మనమూ, మన రాజ్యాంగమూ!!! ఏం మాట్లాడుతాం? ఇలాంటి వారికి ప్రత్యేక సౌకర్యాలు??
    గొల్లపూడి గారూ ! రాష్ట్రపతి పదవిలో( మాజీ, మారిన) వారు ఇలాంటి కేసులను కూడా పట్టించుకొనే తీరికలో లేరా? కేవలం 51 కేసులు, సమయం 10 ఏళ్ళు దాటినా ఇంకా పెండింగ్‌లోనే ఉంచటం?? అంత తీరిక కూడా లేకుండా ఏం పీకుతున్నట్టు?? క్షమించండి ఇది దేశంలో న్యాయం పై నమ్మకం పోతున్న ( పోయిన? ) సామాన్యుని ఆవేదన.

    ReplyDelete
  9. బాగా చెప్పారు ! ఈ లిప్ సర్వీసు చేసే పెద్ద మనుషులకు ఆ సంఘటన లో ప్రాణాలు కోల్పోయిన సామాన్య ప్రజల గురించి చెల్లాచెదురైన కుటుంబాల సంగతి పట్టదు. అసలు ఈ మేతావుల వాదన చూస్తుంటే విచిత్రం గా ఉంది. కనీసం ఈ సంఘటన తర్వాత కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా కట్టడి చేయటానికి మన ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదు అది అందరు ఒప్పుకునే సంగతే కాని దాన్ని గురించి నాయకులను నిలదీయలిసిందే కాని సాకు గా చూపిచ్చి ఉరిశిక్ష అనవరం అని చెప్పటం ఎంత వరకు సబబు, ఇల్లాంటి చర్య ఆ దేశానికి ఎలాంటి సందేశం పంపుతుంది.
    పైన కామెంట్ లో హేమ్ గారు "ఈ ఉరి వారి దేశ౦లో ఒక అమర వీరుణ్ణి చేస్తు౦ది " అని చెబుతున్నారు ఉరి తీస్తే ఒక ౫/౬ నెలల తరవాత అందరు మర్చిపోతారేమో కాని ఉరి తీయకపోతే కసబ్ ఇంకా పెద్ద హీరో అవుతాడు, కొద్దో గొప్పో భయపడే వాళ్ళు కు కూడా తెగింపునిస్తాడు .

    ReplyDelete
  10. "అభిలాష" విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ ఒకే సంఘంలో నివసించే వారిలో అనుకోకుండా జరిగే పొరపాట్లని క్షమించడానికి ఉద్దేశించింది.
    కానీ ఇక్కడ ఒక యుద్ధోన్మాది నాశనమే ప్రధానంగా వచ్చి చేయాల్సిన నష్టం మనకి చేసేస్తే మనం చేయాల్సింది చర్చ కాదు. మన శిక్షల పరిమితిని పెంచి మరొకరు రావటానికి కూడా భయపడేలా శిక్షించాలి. అదీ వెంటనే. మరొకటి. దీన్ని చేయించింది ఎవరో బహిరంగ రహస్యం. ఆ శత్రు దేశాన్ని మనం ఉన్నపళంగా ఏమీ చేయలేం కాబట్టి, మన రక్షణా వ్యవస్థని మరింత పటిష్టం చేసుకోవాలి.

    ReplyDelete
  11. ghoramaina tappulu chesi samajaniki desaniki hani kaliginchina variki teevra dandana vidhinchi amaluku nochukoka nilichina kesula karanamga malli malli dadi chesedaniki avakasamistunna mana rajyanga vyavastapai samanyudiki nammakam potunnadi.gandhi siddhantam nammukunte manalni vadili podani veedemi englishuvadu kadu.asamardha nayakulunnanta kalam vallu chelaregutune vuntaru.supreme courtlo teerpu icchaka amaluparachadaniki addu emiti?yenduku?sravya gari abhiprayam to eekibhavistunnanu

    ReplyDelete
  12. what hems said is wrong to its totality. but kasab should NOT be hanged just like that. each of his organs like fingers/hands/legs should be cut and this should happen for few days to a week so that he will come to know the real pain behind killing any person. also, it is a threatening call to fellow colleagues sitting there in his country and watching the show all these year plus.

    ReplyDelete
  13. మీ ఆర్టికల్ తో పాటూ కామెంట్స్ కూడా బావున్నాయి. అందరూ కరెక్టే, దృక్పధం వేరు అంతే. వీలైనంత మందిని చంపి, చావడానికి వచ్చిన వాడికి జైలు శిక్ష లేక ఉరి శిక్ష, రెండూ తక్కువే. ఇలాంటి నేరాలకు సరిపడే శిక్షలు ఇంకా మన IPC లో లేవేమో కూడా. ఏ సౌదీ న్యాయ స్థానాల సహకారమో తీసుకోవాలి. నాకు అవకాశం ఇస్తే, ఓ కాలు, ఓ చెయ్యి, రెండు కళ్ళు తీసి మా చెన్నై రోడ్ల మీద వొదిలేస్తాను. (చెన్నై ఎందుకంటే, వాడికి బాష కూడా అర్థం కాదు, వాడి బాధా ఎవడికీ అర్థం కాదు) తెలిసో, తెలియకో మీడియా కూడా ఇలాంటి మానవ మృగాలకి సెలబ్రిటీ హోదా ఇస్తోంది. నన్ను అడిగితే, మూడో కంటి వాడికి తెలీకుండా, ఏ సౌదీ శిక్షో వేసి ఏ రోడ్డు మీదో వోదిలేయాలి.

    ReplyDelete
  14. ఈ రోజు పుడుతున్న ఆకలికి మొన్న తినేసిన భోజనం సమాధానం కాదు కదండీ... ఎవరి భావావేశాలు, భావ సారూప్యాలు ఎలా ఉన్నా మంచి,చెడులు.. న్యాయాన్యాయాలు అన్నీ relative phenomena కదండీ.. నెల్సన్ మండేలాని అప్పుడే చంపేసి ఉంటే ఆయన కాకుంటే ఇంకొకరుంటారు.. randomగా జరుగుతుండే ప్రపంచంలో వ్యవస్థని ఒకరు కాకుంటే ఇంకొకరు.. ఒక సమర్ధుడు కాకుంటే ఇంకొక సమర్ధుడు నాశనమైనా/పాలించి పెంపొందించటమైనా చేస్తాడు.. అంతెందుకూ మీరైనా కసబ్‌ను ఏమి చేస్తే కరెక్టో డైరెక్టుగా చెప్పకుండా కార్నర్ చెయ్యబడకుండా తప్పించుకున్నారు కదా.. కసబ్‌ని ఏమి చేస్తే కరెక్టో కంటే.. ఏమి చెయ్యాలో తెలియకుండా సందిగ్ధంలో ఉంచేయటమైతే ఖచ్చితంగా తప్పవుతుంది.. వాళ్ళంతా కలిసి దాడి చేసే సమయంలో దొరికినవాడ్ని దొరికినట్టు కాల్చినప్పుడు కేరింతలు కొట్టే జనం మరియు ప్రభుత్వం మరియు యంత్రాంగం ఇన్నాళ్ళ తర్వాత అలా ఎందుకు చెయ్యలేవంటే.. అంతే సమయానుగుణంగా.. ఉద్రేకాలు.. ఆవేశాలు తగ్గిపోతాయ్... మీవైనా.. నావైనా జస్ట్ అభిప్రాయాలే... if we are the persons to act in this issue instead of speaking like this.. I know that the first thing that would be done is hanging of that bloody rascal named KASAB.

    ReplyDelete
  15. People who say that punishing criminals is not human should first realize that punishing the innocent, who have not done any crime, is barbareous.

    ReplyDelete