నాకేమో అవినీతికీ ఆరోగ్యానికీ దగ్గర తోవ ఉన్నదని అనిపిస్తుంది. దీనిని రుజువులతో సహా నిరూపించగలను. మనదేశంలో అవినీతిపరులంతా నిమ్మకు నీరెత్తినట్టు నిగనిగలాడుతూ, చలవచేసిన ఖద్దరు చొక్కాలతో, సూట్లతో, చిరునవ్వులతో హుషారుగా కులాసాగా ఉంటారు. కాని ఒక్కసారి వారిని నీతి, చట్టం వేలు చూపిస్తే చాలు - ఎక్కడలేని అనారోగ్యం వారిని క్రుంగదీస్తుంది. మీలాటి నాలాంటివారు అంతంత మాత్రం ఖాయిలా పడితే ఇంటి దగ్గర ఉండే చికిత్స చేయించుకుంటాం. కాని వీరి అనారోగ్యం అలాక్కాదు. నిన్నటిదాకా బాగానే ఉన్నా ఇవాళ మాత్రం - ఎవరూ పలకరించ వీలులేని, ఎవరితో మాట్లాడడానికీ వీలులేని, ఎవరూ కలుసుకోవడానికీ వీలులేని - ఆసుపత్రి ఇంటెన్సివ్ గదుల్లో ఉండక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
పూర్తిగా చదవండి
Sunday, May 16, 2010
Subscribe to:
Post Comments (Atom)
ఈ సంకలనం చివరి వాక్యాలతో మీ కథనానికి పరిపూర్ణత వచ్చినట్లయింది. విధి వంచితుడయిన జయేంద్ర సరస్వతీ స్వాములవారి విషయంలో, మాలాంటి సామాన్యులకి వచ్చిన నిర్లిప్తత... తొలగి పోవాలీ అంటే ఇలాంటి సమాచారం ఎంతైనా అవసరం. చెడును ఎండగట్టటంలో ఉన్న పదును... మంచిని వివరించటంలో చూపిన చొరవ రెండూ సమతూకంగా ఉండి వ్యాసం అర్ధవంతంగా వచ్చింది.
ReplyDelete