Monday, May 17, 2010

బాబాయి

"ఇచ్చుటలో ఉన్న హాయి..వేరెచ్చటనూ లేనేలేదని.."నమ్మేవాళ్ళకి నచ్చే కథ. 40 ఏళ్ళ క్రిందట నేను వ్రాసిన ఈ కథ ఈ నెల 'కౌముది ' లో అనగనగా మంచి కథ గా వచ్చింది.
పూర్తిగా చదవండి

16 comments:

  1. చాలా మంచి కథ. చదువుతుంటే కళ్లలో నీళ్లుతిరిగాయి నిజంగా.

    ReplyDelete
  2. చాలా హృద్యంగా ఉంది..ఇది నిజంగా జరిగిందా?

    ReplyDelete
  3. ఏంటది బాబాయ్.. బాబాయ్‌ని అలా చేశావ్.. సమాజంలో దిగజారుతున్న మానవ సంభందాలపై జాలి ఎంత చక్కగా వెళుబుచ్చావ్ బాబాయ్.. ఏక వచనంతో సంభందం కలిపి మరీ మాట్లాడితే మీకు కోపం‌ వచ్చిందా.. రానీయండి.. కోపం బాబాయికి కాక బండకి వస్తుందా.. హృద్యమైన మీ రచనా పాటవానికి ప్రపంచంలో‌ఉన్న అన్ని టోపీలు తీసేసినా (hats off) సరిపోవు బాబాయ్..

    ReplyDelete
  4. మీ కథ చదివానండీ. దాదాపు పదేళ్ళ క్రితం ఆంధ్రప్రభ లో వచ్చిన సీరియల్ చదివినదగ్గర్నించీ.. 'మీది ' అని తెలిసిన ప్రతి రచనా చదువుతూ ఉంటాను. కౌముది లో ఈ కథ నేను చదివి మా అమ్మ తో కూడా (లాప్ టాప్ ) లో చదవలేనే .. అని చెప్తున్నా.. వినిపించుకోకుండా.. చదివించాను. మధ్యలో వదిలిపెడితే (కళ్ళ ప్రాబ్లం) చదివి వినిపించాను.

    - కృష్ణప్రియ.

    ReplyDelete
  5. మీరు కూడా బ్లాగు ప్రపంచం లో వున్నారని ఈ రోజే చూసాను. చూడగానే ఆశ్చర్యం, ఆనందం అన్నీ ఒకేసారి కలిగాయి. మీ కథ చాలా బాగుంది. మీకు Comment రాసే అంతటి దాన్ని కాకపోయినా మీరు నా comment చదువుతారు అన్నది తల్చుకునే చాలా గర్వపడుతున్నాను.

    ReplyDelete
  6. ఏమో.. మాటలు రావటం లేదు..

    ReplyDelete
  7. ఇలాంటి కధలు చూసినపుడు మా చిన్నపుడు, పుస్తక పఠనంతో మేము పొందిన మధురానుభూతులు మళ్ళీ గుర్తుకొస్తాయి. పక్కవాడికి సహాయం చేయటంలోనే తమ సంతోషాన్ని చూసుకొనే "బాబాయి" లాంటి పాత్రల సృష్టి ఈనాటి హడావిడి జీవితాలకి చీకటిలో ఒక దివిటీలాంటిది.

    ReplyDelete
  8. gollapudi garu...zuzumura chadivaaka anipinchindi idi nijamena ani....idigo malli ippudu...idi nijamena?ee prasna mimmalni inthakumundu kooda adiganu,no answer.kanisam ipudaina chepparu?ee katha lo badha undi...okkosari badha kooda baguntundemo..babaye andariki nachuthadu kani..babaye la undatam matram nachaemo kada?bhagat singh pakkintlo puttali,manintlo kademo....

    ReplyDelete
  9. sir... hats off to your writing style. mee katha rachana, shilpam, kathanam taditarala gurinchi cheppe sahasam naaku ledu. meeru meere... manchi sahityam kosam tapinche maa lanti dahartula paaliti devullu meere. chala mandi rasevallu unnaru. kaani ee ijala gola lekunda hayiga chaduvukovadaniki, aksharallo prapanchanni choodadaniki meelanti vaari rachanalu maaku chala avasaram.
    god bless you sir.

    ReplyDelete
  10. నా బ్లాగ్ లో “బాబాయి” కధ చదివాక ఎందరో స్పందన నన్ను ఒక విధంగా ఆశ్చర్యమూ, మరో విధంగా ఆనందపరిచింది. బాబాయి కొత్త తరం పాఠకుల్ని సంపాదించుకోవడం చాలా సంతోషించదగిన విషయం. ఇది తేలిగ్గా 40 ఏళ్ల కిందట రాసిన రచన. ఆప్పట్లో నాకు శంబల్ పూర్ బదిలీ ఆయింది. నిజంగా అనాటి శంబల్ పూర్ లో తెలుగుమాటవినడం కొంతకాలం ఆబ్బురంగా, ఆపురూపంగా గడిచింది. ఈ ఆనుభవాలకు లోనయి- విపరీతంగా నష్టపోయి, మిగతావారిని అ నష్టం నుంచి కాపాడగలిగే పాత్ర- బాబాయ్ అ విధంగా మనస్సులో కదిలింది. విజయవాడలో బాబాయ్ హొటల్ వుంది. ప్రొప్రయిటర్ కి ఆందరూ బాబాయిలే. ఆది ఒక స్పూర్తి. శంబల్ పూర్ లో ఒంటరితనం మరొక స్పూర్తి. ప్రపంచంలో చాలాబలమయిన అయుధం –శాంతి. ఉదాహరణలు- బోలెడు- జీసస్, గాంధీ, మదర్ దెరెస్సా, నెల్సన్ మండేలా. మరొక పదునయిన అయుధం? మంచితనం. పదిమందికీ తలలో నాలుక కావడం. ఆయితే ఇది ఒక్కనాటితో సాధించేదికాదు. ఒక్క జీవితం సాధించగలిగేదికాదు. బాబాయి ఓ పెద్ద సరోవరంలో ఓ మూల పూసిన చిన్న కలువపువ్వు. తన చుట్టూ ఉన్న చిన్న ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఓ నేలబారు మనిషి. బహుమతి- రెండు చిన్న అపిల్ పళ్లు. వాటి విలువ ఓ జీవితకాలం మంచితనం. ఓ మంచి మనస్సు జరిపిన నిశ్శబ్ద విప్లవం. రెండు ఆపిల్ పళ్ళు ఓ ఉద్యమం విజయం.
    కధ ఇంత మాట్లాడదు. మాట్లడనక్కరలేదు. ఆయినా పాఠకులకి ఆందుతుంది. ఆందుకు ఉదాహరణ_ 40 ఏళ్ల తర్వాత ఈ కధ సంపాదించుకున్న రెండో తరం పాఠకులే!- మీరే!
    గొల్లపూడి

    ReplyDelete
  11. చాలా బాగుంది!

    >> నా కష్టం నాకే ప్రత్యేకం. ధైర్యంగా, రహస్యంగా అనుభవించాను.

    బిలాస్పూర్/ఝర్సుగూడ నుంచి జం షె డ్ పూర్ వెళుతూ ఈ వాక్యాన్ని చాలా సార్లు చదివా

    మొదటి సారి చదివినపుడు, కళ్ళు చమర్చాయి. బాబాయి లో ఒక గొప్ప హీరో (నాయకుని) పాత్ర చిత్రణ కనిపించింది

    రెండవ సారి: బాబాయి ప్రవృత్తి & ఆలోచనా విధానం పరస్పర విరుద్ధం గా అనిపించాయి

    మూడవ సారి చదివినప్పుడు, ఇలాంటి మంచి కథలలో రంధ్రాణ్వేషణ చెయ్యకూడదనిపించి ముగించాను ;)

    ReplyDelete
  12. I like the story(?) very much. Iam happy to see many readers like myself. This is an example to the fact that a good story is accepted anytime. It flows with the passing time.
    My guru Grand Master Choa KOk Sui always said what was said in varioue religions...

    Do to others what you want others to do to you.
    Donot do to others what you donot want others to do to you.

    While it is difficult to follow either of these,'Babai'is a blend of both. We need n number of Babais in today's world...to repair the human relations and establish peace.

    Please keep posting good, old stories in your blog along with the satires and discussions on contemporary issues. It gives great relief.

    ReplyDelete
  13. offtopic:

    మాధురి:

    మీ గురువు గారేవ్వరో నాకు తెల్వదు గానీ, ఇంచుమించు ఇదే విషయాన్ని తిక్కన గారి భారతంలో విదురనీతి లో చెప్పారు:

    ఒరులేయవి యొనరించిన
    నరవర, తన మనంబునకప్రియంబగు, దా
    నొరులకు నవి సేయకునికి పరాయణ
    పరమ ధర్మ పధములకెల్లన్!

    ReplyDelete
  14. WitReal garu,

    Thank you for the 'aanimuthyam'. My guru said that he is not the one who said these two 'essentials' for spiritual growth. He said that he passed on to us that was passed on to him.

    Iam sorry for the delay in responding. I was away on a holiday and couldn't open this blog till now.

    ReplyDelete
  15. గొల్లపూడి సార్..!, బాబాయ్ కథ చాలా బాగుంది...,నిజానికి ఇది మీరు 40 సంవత్సరాల ముందు రాసినా, ఈ కథ వ్యక్తిత్వం సంఘంలో విలువలు గురించి తెలిసిన ఎవరినైన ఆలోచింపచేస్తుంది. నేను చివరి నేల నుండి తెలుగులో బ్లాగులు రాయడం మొదలుపెట్టాను ..., కంప్యూటర్లో తెలుగు విప్లవం మీద గట్టిగా శ్రమించడానికి ప్రయత్నిస్తున్నాను ...నాకు మీ ఆశిర్వాదాలు కావాలి...!

    ReplyDelete