నా ఆరోగ్యానికి ముఖ్య రహస్యమొకటుంది. నేనేనాడూ తెలుగు ఛానళ్ళు చూడను. ఈ మధ్య కొన్నాళ్ళుగా విశాఖపట్నంలో ఉండడం జరిగింది. వద్దనుకున్నా - ఈ ఛానళ్ళు కళ్ళల్లో పడుతున్నాయి. అప్పుడప్పుడు - అక్కడక్కడా ఆగినప్పుడు బోధపడిన (కాదు - బోధపడని) విషయాలు కొన్ని ఉన్నాయి.
పూర్తిగా చదవండి
Sunday, October 31, 2010
Monday, October 25, 2010
పతివ్రతల దేశం
’మాంగల్యానికి మరోముడి’ సినీమాకి దర్శకుడు కె.విశ్వనాథ్. నేను రాసిన చిత్రం అది. అందులో నాకిష్టమైన పాత్ర ఒకటి ఉంది. ఆ పాత్రని గిరిజ చేసింది. నాలుగయిదు వాటాలున్న లోగిలి అది. అల్లు రామలింగయ్య, మిగతా ఎందరో అద్దెలకుంటున్నారు. ఒక ఇంట్లో భార్యా భర్తలున్నారు. భార్య సావిత్రి. మహా పతివ్రత. ఆమె భర్తని సినీమాలో ఎప్పుడూ చూపలేదు. ఒక గొంతు మాత్రం వినిపిస్తూ ఉంటుంది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Sunday, October 17, 2010
ప్రేమ పుస్తకం
నా జీవితంలో రెండే రెండు సార్లు పరిశోధనాత్మకమైన నవల రాయాలని తహ తహలాడాను. రెండూ రెండు విచిత్రమైన, అనూహ్యమైన సందర్భాలు. రాజీవ్ గాంధీ హత్యలో పాత్రను పోషించిన ఓ నర్స్ కూతురు నళిని గురించి - ఆమె పుట్టుక, పెరిగిన వాతావరణం, ఓ భయంకరమైన మారణ హోమంలో భాగం కావడానికి ఏయే పరిష్తితులు దోహదమయాయో - తీరా అరెస్టు అయాక మురుగన్ ను పెళ్ళిచేసుకుని, అతనితో సెక్స్ లో పాలుపంచుకుని బిడ్డని కనడం - ఇవన్నీ మనస్తత్వ శాస్త్రానికి, విచిత్రమైన కోణాలను ఆవిష్కరించే కథనం. రెండవది -
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Monday, October 11, 2010
కీర్తి
ఒకావిడ జీవితకాలమంతా మనస్సులోని ఆలోచనలను కాగితం మీద పెట్టేది. వాటిని పదిమందితో పంచుకోవాలనే ఆలోచనగానీ, ప్రచురించాలనే కోరికగానీ ఆమెకి కలగలేదు. కొంతకాలానికి కన్ను మూసింది. ఆమె చెల్లెలు తన అక్క వస్తువులను సవరిస్తూండగా ఈ కాగితాలు బయటపడ్డాయి. చదవగా - ఆమెకి బాగా రుచించాయి. వెంటనే పత్రికలకి పంపింది. కవితా ప్రపంచం హర్షంచింది. అక్కున చేర్చుకుంది. అచిరకలంలో అమెరికా నెత్తిన పెట్టుకునే ప్రసిద్ధ రచయిత్రిగా పేరు పొదింది. ఆవిడ పేరు ఎమిలీ డెకెన్సన్.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Monday, October 4, 2010
సమస్యకి షష్టిపూర్తి
చిన్నప్పుడు - క్లాసులోఇద్దరు కుర్రాళ్ళం దెబ్బలాడుకునేవాళ్ళం. దెబ్బలాటకు మా కారణాలు మాకుండేవి. మేం ఆశించే న్యాయమూ మా మనస్సులో ఉండేది. ఈలోగా మేష్టారు వచ్చేవారు. దెబ్బలాటకి కారణం అడిగేవారు. అంతా విని ఇద్దరికీ మొట్టికాయ వేసి - ఇలా చేయండనేవారు. అంతే. చచ్చినట్టు అలాగే చేసేవాళ్ళం. ఇక తగాదాలేదు. దానికి అప్పీలు లేదు. కారణం - మా మేష్టారుదే అంతిమ తీర్పు. ఎందుకంటే ఆయన మేష్టారు కనుక. మొట్టికాయ చక్కని ప్రతిఫలం.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Subscribe to:
Posts (Atom)