Sunday, January 2, 2011

మూడుకథలు

ప్రతీ ఏడూ ఆఖరి రోజుల్లో పత్రికలకీ, టీవీ ఛానళ్ళకీ ఓ వార్షికం ఉంది. ఈ సంవత్సరంలో జరిగిన గొప్ప విషయాలూ, గొప్ప అరిష్టాలూ, గొప్ప అవినీతులూ, గొప్ప హత్యలూ, గొప్ప మోసాలూ - ఇలా మరోసారి అన్నిటినీ తలుచుకుని 'అయ్యో ' అనో 'ఆహా! ' అనుకుని కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడం రివాజు.
పూర్తిగా చదవండి

2 comments:

  1. గురువు గారూ,
    మీ మూడు కథలూ ఒకటి Motivation కి, ఇంకొకటి Corruption కి మరొకటి Future Fears కి ప్రతీకలు.
    మొదటి కథలో తండ్రి పోయినప్పుడు అటువంటి ప్రదర్శన ఇచ్చిన 'సచిన్ టెండూల్కర్' గుర్తుకు వచ్చాడు. జోన్ రోసెట్ లాంటి వాళ్ళు స్ఫూర్తిప్రదీకలు.
    రెండవ కథ లో శ్రీశ్రీ గారు గుర్తుకు వచ్చారు. 'ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బొయీలెవ్వరు ' అన్నారాయన. అన్యాయం గా, అక్రమం గా, అవినీతి తో పల్లకెక్కిన వాళ్ళని భరించిన బొయీలని పట్టుకుని వేధిస్తారని, పల్లకి లో వున్నవారిని అలాగే భద్రం గా వుండనిస్తారని పాపం ఆయన ఊహించివుండరు.
    మూడవ కథ మాత్రం భీతి కల్గిస్తున్న మాట వాస్తవం. భవిష్యత్తు లో ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహా వృక్షమయినట్లు యువ 'రాజా' గారి పాలన వస్తుందేమో.

    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం (బెంగళూరు)

    ReplyDelete