Thursday, January 6, 2011

ఎర్రసీత

దాదాపు పదిహేను సంవత్సరాల క్రిందట సీరియల్ గా నేను వ్రాసిన నవల ఇది. ఈ నవలకి వచ్చిన అభినందనలన్నీ ఒక ఎత్తు ఐతే నాలుగేళ్ళ క్రిందట , కరడుగట్టిన హంతకుడిగా పేరుతెచ్చుకున్న చర్లపల్లి జైలులోని ఒక ఖైదీ వ్రాసిన ఉత్తరం ఒక ఎత్తు. ఆ ఉత్తరాన్ని ముందుమాటగా ప్రస్తావిస్తూ - ఈ నెల నుంచీ ఈ నవల 'కౌముది ' మాసపత్రికలో సీరియల్ గా వస్తోంది. ఆసక్తికకరమైన ఆ ఉత్తరంతో కూడిన మొదటి భాగాన్ని ఈ నెల కౌముదిలో చదవొచ్చు.

1 comment:

  1. అవును సర్, ఎర్రసీత నాకు బాగా గుర్తుంది. ఇంటర్మీడియెట్ చదువుతున్న రోజుల్లో అనుకుంటాను..ప్రతి వారం ఎర్రసీత కోసం ఎదురు చూడ్డం భలే ఉండేది. ఇంట్లో వాళ్లమంతా రాత్రి భోజనాలప్పుడు పుస్తకాల గురించి మాట్లాడుకుంటూ తినే వాళ్లమేమో, ఎర్రసీత రోజుల్లోనూ, సాయంకాలమైంది రోజుల్లోనూ తప్పకుండా వాటి ప్రస్తావన ఉండేది.

    మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారన్నమాట. తప్పక చదవాలి.

    ReplyDelete