పాకిస్తాన్ కి తనదైన గొప్ప చరిత్ర ఉంది. ఆ దేశం అవతరించినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఎక్కువగా సైనిక నియంతల పాలనలోనే ఉంది. కాగా, ఇప్పటి ప్రజాస్వామ్యానికీ గొప్ప చరిత్ర ఉంది. ఎన్నో అవినీతి నేరాలకి అరెస్టయి, జైలుకి వెళ్ళి, దేశాన్ని వదిలి పారిపోయిన ఒక నేరస్థుడు జర్దారీగారు - కేవలం బేనజీర్ భుట్టో భర్త అయినందుకే, అదృష్టవశాత్తూ ఆమె హత్య జరిగినందుకే ఆ దేశపు అధ్యక్షుడయారు. ఇది ఆ దేశానికి గొప్ప కిరీటం.
నిజానికి రాజకీయ దౌత్యంలో - ఒక దశలో - అద్భుతమైన అవగాహన చూపించి, ప్రపంచమంతటికీ - ఒక్క ఇండియాకి తప్ప -స్నేహితుడయిన దేశంగా పాకిస్థాన్ ని నిలిపింది అయూబ్ ఖాన్ అని చెప్పుకుంటారు
Chala baga chepparandi... Chala rojula tharavatha mee voice vini santhosamga vundi.
ReplyDelete- Chandra shekar
ఆలస్యంగా కామెంట్ రాస్తున్నందుకు క్షమించాలి. ఇప్పుడే చదివాను ఈ పోస్ట్ ని. పాకీ కి ఇండియా తోటికోడలా? హ హ హ భలే నవ్వు వచ్చిందండీ. కానీ ఇండియా పాకీ కి మొగుడు అయ్యే అవకాశాలు వున్నాయంటారా?
ReplyDelete