Sunday, May 29, 2011

భక్తిమార్గాలు

'మతం' రేపర్లో చుట్టడం వల్ల - మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చాలా విషయాల పరమార్ధం మరుగున పడిపోతుంది. మతం నిజానికి రంగు కళ్ళద్దం. ఈ దేశంలో మతం అన్నమాట శతాబ్దాల క్రితం లేదు. ఆ మాటకి వస్తే ఎక్కడా లేదు. ఏ పురాణాల్లోనూ ఈ మాట కనిపించదు. ఆ రోజుల్లో మనకున్నది సనాతన ధర్మం. న్యాయంగా 'ధర్మం' అంటే చాలు. అది ఆనాటిది కనుక 'సనాతనం' చేర్చాం. నిజానికి ఈ ధర్మం ప్రతి మతానికీ వర్తిస్తుంది. మనిషి చెయ్యాల్సిన విధి. ప్రవక్తల, మహానుభావుల, ప్రవచనాల, ప్రభోధాల అర్ధం ఇదే. ఈ గొడవ ఇక్కడికి చాలు.

1 comment:

  1. నిజమేనండి. మీరు రాసింది చదువు తుంటే మా ఆఫీసు లో వున్న కొంతమంది భక్తులు గుర్తుకొచ్చారు. వాటిని మూఢ విశ్వాసాలు అనలేము, అలాగని ఇదేమి పిచ్చి అని అనుకోకుండా ఉండలేము. ఒకతను పొద్దున్న సిస్టం ముందు కూర్చోగానే షూస్ లోనించి కాళ్ళు బయట పెట్టి , ఆ రోజు వచ్చిన పనికి సంబందించిన మెయిల్స్ చూస్తేనే కాని కాళ్ళు లోపల పెట్టడు. ఇంకో అతను తను పూజించే బాబా ఫొటోస్ ని తదేకంగా ఇదు నిమిషాలు చూస్తేనే కాని పని మొదలుపెట్టాడు. ఈ లోపల కాల్స్ వచ్చిన ఫోన్ తీసే పనిలేదు. ఎవరు చెప్పినా మనిషి తనను నడిపే ఆ అద్భుత శక్తి కోసం ధర్మాన్ని విడిచి పెట్టకూడదు. ప్రతి మనసాక్షి ఏది ధర్మం ఏది అధర్మం అనేదాన్ని తెలియచేస్తుంది. కాని వివేకవంతులే ధర్మాన్ని ఆచరించగలరు. దాన్ని ఎవరికోసమో చేయవలసిన అవసరం లేదు. కనీసం ఒక్కనాడైనా ధర్మం ప్రకారం మనిషి ప్రవర్తించగలిగితే వారికి కాస్తో కూస్తో పుణ్యం తప్పక దక్కుతుంది.

    ReplyDelete