Tuesday, January 10, 2012

తోడికోడలు నవ్వింది

నా చిన్నతనంలో - నిజానికి 20 సంవత్సరాల కిందటివరకూ - ఆడవాళ్ళు చుడీదార్ డ్రస్సులు వేసుకోవడం తెలీదు. అందరూ పరికిణీ, ఓణీలతో లక్షణంగా తెలుగుదనంతో కనిపించేవారు. అలాంటి డ్రస్సులు ప్రస్థుతం మాయమయిపోతున్నాయి. నేటి తరం సినీమాల్లో హీరోయిన్ల ఒంటి మీద బట్టలు వెద్దుక్కోవలసిన పరిస్థితి.
పూర్తిగా చదవండి

3 comments:

 1. నమస్కారం గురువుగారూ,
  చూపాల్సిన చిరునవ్వుని కప్పుకుని, కప్పుకోవాల్సినచోట విప్పుకుని తిరగటం అని నాగరికతకి కొత్త అర్థం మార్చినట్టున్నారు గురువు గారూ ఈ మధ్యకాలంలో

  ReplyDelete
 2. బాగా చెప్పారు మారుతీ రావుగారూ. కలికాలపు మహిమ అనుకుంటాను. "రామా" అంటే బూతు అవుతున్నది. పాపం దినేష్ రెడ్డిగారు కూడా అలాంటి బాధితుడే. ఈ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు (అన్నీ కాదని ఈ మధ్యనే తెలిసింది) వితండ వాదాలు చేసి, వాళ్ళు ఎవరినైతే సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నారో, వాళ్ళంటే అసహ్యం కలిగేట్టుగా సమాజం మొత్తానికి కలిగించే నేర్పు ఎంతో ఉన్న వాళ్ళు. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ అన్న వాణ్ణి చూసి ఎవరన్నా నమ్ముతారా. వాడు ఏమి మాట్టాడుతాడో, ఎందుకు మాట్టడుతున్నాడో, ఎవరు చెప్తే ఈ వాగుడు వాగుతున్నాడో అందరికీ తెలుసు. వీటిమధ్యలో నిజంగా హ్యూమన్ రైట్స్ అంటూ ఒక నిజాయితీ గలిగిన వ్యక్తి వస్తే అతన్ని ఎవరన్నా నమ్ముతారా. ఇది వీళ్ళు సాధించిన వి..జ..యం!

  దినేష్ రెడ్డి గారిని విమర్శించిన వాళ్ళకు ఒక్కటే సూటి ప్రశ్న. మీ అమ్మాయిలను కాని, మీ కుటుంబలోని ఇతర ఆడవాళ్ళను గాని ఫ్యాషన్ పేరిట వెర్రి మొర్రి గుడ్డలు వేసి రోడ్ల మీద తిరగనిస్తారా? వాళ్ళిష్టం మేము కలగచేసుకోము అని వాళ్ళని అర్ధనగ్నంగా తిరగనిస్తారా. వీళ్ళల్లో ఎవ్వరూ అలా వాళ్ళ పిల్లల్ని చెయ్యనివ్వరు. వితండ వాదం కోసం ఎవరన్నా OK మేము మా పిల్లలకి ఏ విధమైన ఆక్షలు పెట్టం అని అంటే వాళ్ళ ఖర్మ, వాళ్ళను చూసి జాలిపడాలి. ఇలాంటి వాళ్ళ వల్లే పోలీసులు సామాన్య ప్రజలు వేసుకునే దుస్తుల గురించి వ్యాఖ్యలు చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే స్థితి ఇలా వెర్రి తలలు వేసుకుంటూ పోతే, ప్రభుత్వం ప్రజలకు డ్రస్ కోడ్ నిర్బంధం చేస్తే అక్షేపించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇదీ ఈ వితండ వాదాలు చేసే సంఘాల వాళ్ళు సాధించిన వి..జ..యం!

  ReplyDelete
 3. చాలా మంచి artical రాసారు మాస్టారు...ఇది నా పేస్ బుక్ లో షేర్ చేస్తున్నాను...చాలా మంది తప్పకుండా చదవవలసిన artical

  ReplyDelete