skip to main |
skip to sidebar
ఎన్.టి.రామారావు గారు 'దాన వీర శూర కర్ణ' మొదలైన చిత్రాలు చేసే రోజుల్లో చాలా బిజీ. నేనూ చాలా చిత్రాలకు రాసే రోజులు. రామారావుగారితో ఎప్పుడు చర్చలు జరపాలన్నా, కథ చెప్పాలన్నా, జరుగుతున్న కథకి సవరణలు వినిపించాలన్నా ఉదయం మూడు గంటలకు ఆయన దగ్గరకు వెళ్లాలి. బహుశా ఏ రెండుకో రెండున్నరకో లేచి, కాలకృత్యాలు తీర్చుకుని పట్టుపంచె కట్టుకుని ముందుగదిలో కూర్చునేవారు. పూర్తిగా చదవండి
నిన్నకాక మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికలు ఎన్నో కొత్త విషయాల్ని చెప్పక చెప్తున్నాయి. ఇప్పటికే రాజకీయ నాయకులకీ, దేశానికీ అర్థమయ్యే విషయం -చదువుకున్న వాడి దగ్గర్నుంచి, మామూలు మనిషి వరకూ రాజకీయ పార్టీల నైచ్యాన్నీ, నమ్మకద్రోహాన్నీ, అవినీతినీ, బుకాయింపునీ, నిరంకుశత్వాన్నీ, గూండాయిజాన్నీ, దోపిడీని, రంకుతనాన్ని గమనిస్తున్నారని, అసహ్యించు కుంటున్నారని. అవకాశం వచ్చినప్పుడల్లా స్పష్టంగా తమ అసహ్యాన్నీ, అసహనాన్నీ ప్రకటిస్తున్నారనిపూర్తిగా చదవండి
సినిమా తెరకెక్కి వందేళ్లయింది. నేను సినిమాకెక్కి ఏభై యేళ్లయింది. 1913లో దాదా సాహెబ్ ఫాల్కే 'రాజ హరిశ్చంద్ర' మొదటి చిత్రం. 1963లో 'డాక్టర్ చక్రవర్తి' నా మొదటి చిత్రం. సినిమాతో నా బంధుత్వాన్ని చెప్పడాని కే, చెప్పడం వరకే ఈ విషయం.నేను సినిమాలో తొలిపాఠాలు నేర్చుకున్న రోజుల్లో -సినిమా బాగా ఆడడానికి ఏయే హంగులు ఉండాలో ఎవరూ ప్రసస్తంగానయి నా మాట్లాడిన గుర్తులేదు. వ్యాపారపరంగా ఏ సినిమా డబ్బు చేసుకుంటుందో కూడా చెప్పిన గుర్తు లేదుపూర్తిగా చదవండి
వరం అర్హతతో వచ్చేదికాదు. సాధించుకుంటే దక్కేది కాదు. అప్పనంగా కొట్టేసేది. అది దేవుడయినా, యజమాని అయినా, నాయకుడయినా -ఆయన ఇష్టప్రకారం ఇచ్చేది. దాని పరిమితి ఎదుటివాడి దయా దాక్షిణ్యం. హిరణ్యకశిపుడు చావులేని వరం అడిగాడు. ''అది కుదరదు. ఎలా చావకూడదనుకున్నావో చెప్పు'' అన్నాడు బ్రహ్మదేవుడు
పూర్తిగా చదవండి