Sunday, May 26, 2013

మూడు 'చెప్పుల' కథలు

ఎన్‌.టి.రామారావు గారు 'దాన వీర శూర కర్ణ' మొదలైన చిత్రాలు చేసే రోజుల్లో చాలా బిజీ. నేనూ చాలా చిత్రాలకు రాసే రోజులు. రామారావుగారితో ఎప్పుడు చర్చలు జరపాలన్నా, కథ చెప్పాలన్నా, జరుగుతున్న కథకి సవరణలు వినిపించాలన్నా ఉదయం మూడు గంటలకు ఆయన దగ్గరకు వెళ్లాలి. బహుశా ఏ రెండుకో రెండున్నరకో లేచి, కాలకృత్యాలు తీర్చుకుని పట్టుపంచె కట్టుకుని ముందుగదిలో కూర్చునేవారు.
 పూర్తిగా చదవండి

3 comments:

  1. మూడు చెప్పుల కథలు చాలా అద్భుతంగా చెప్పారండీ మారుతీ రావు గారూ. రెండో కథలో చెప్పులు దొంగలించి బడినాయనే నాకనిపించడం లేదు. ఎవరో ఒక సంగీత ప్రయుడు పరాకుగా వాటిని ముందు రోజు వేసుకుని వెళ్ళి పోయి ఉండాలి. మర్నాడుఆ విఝయం గుర్తించినా, చేయ గలిగినదేమీ లేదు. తన చెప్పులు ఆ సరికే మరొకరి పాలయి ఉంటాయని అనుకోవచ్చును. మర్నాటా సంగీత సభకు తొలి నాడు పొరపాటున తొడుక్కొని పోయిన చెప్పులనే వేసుకుని వచ్చి ఉండ వచ్చు.


    ఏమయినా, ఆ వ్యక్తి మంచి సంగీత ప్రియుడనడంలో మాత్రం ఏమీ సందేహం లేదు.

    ReplyDelete
  2. Sir I am your big fan and I would like to appreciate you for sharing your valuable moments. By the way in the last weekend I watched the movie "Manishiko Charitra" and your performance is over the top. It just not acting and it's more than that for sure. Please keep on sharing sir.

    ReplyDelete
  3. మారుతీరావుగారూ, నమస్కారం. తన కళపట్ల గారడీవాడిలో ఉన్న పవిత్రభావన నన్ను ఎంతో కదిలించింది. అతని వ్యక్తిత్వాన్ని ఎంతో ఉన్నతంగా చూపించింది. విచిత్రం ఏమిటంటే, పండితులలో, విద్యావంతులలో, రచయితలలో కూడా తమ విద్య లేదా కళపట్ల అలాంటి పవిత్రభావన లోపించడం. ఒక యూనివర్సిటీలో ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు కలసి పని చేస్తూ ఉండేవారు. అందులో ఒకాయనకు పైకి కనిపించే చర్మవ్యాధి ఉంది. రెండో ప్రొఫెసర్ ఒకసారి ఆయనను దూషిస్తూ, ఆయన చర్మవ్యాధిని కూడా ఆక్షేపిస్తూ ఛందోబద్ధంగా పద్యాలు రాసి సొంత పత్రికలో ప్రచురించాడు. అందుకు జవాబుగా అవతలి వ్యక్తి కూడా ఈయనను దూషిస్తూ పద్యాలు రాసి ఇంకో పత్రికలో ప్రచురింపజేశాడు. ఈ పరస్పర దూషణ పద్యాలు చూసి నేను నిర్ఘాంతపోయాను. ఎంతో అపురూపంగా, పవిత్రంగా భావించే కవిత్వాన్ని అందులోనూ ఛందోబద్ధ కవిత్వాన్ని హేయమైన దూషణకు దుర్వినియోగం చేసిన ఈ ప్రొఫెసర్ల అల్పత్వంతో పోలిస్తే అంత విద్యాగంధం లేని గారడీ వ్యక్తి చాలా ఉన్నతుడు.
    నేనోసారి తెలిసిన ఓ ప్రెస్ కు వెళ్ళి యజమానితో మాట్లాడుతున్నాను. ఈ మధ్యనే ప్రచురించామంటూ ఓ కవితాసంపుటి నా ముందుకు తోశాడు. ఓ సినీ రచయిత రాసిన కవిత్వం అది. నేను కాసేపు ఆ పుస్తకం తిరగేసి మళ్ళీ ఆయన ముందు పెట్టేశాను. "అదేమిటి, మీకు ఇచ్చాను, తీసుకెళ్ళండి" అన్నాడు. అప్పుడు నేను నిష్కర్షగా, "అందులో అంగవైకల్యాన్ని ఆక్షేపించే కవిత ఒకటుంది. అంతకన్నా కుసంస్కారం ఉండదు. ఈ కవికి కవికి ఉండవలసిన ప్రాథమిక సంస్కారం కూడా లేదు. ఈ అపవిత్రరచనను ఇంటికి కూడా పట్టుకెళ్లమంటారా?" అన్నాను.
    దీనికో కొసమెరుపు. మూడు నాలుగు రోజుల తర్వాత లెటర్ బాక్స్ లోంచి నాకు వచ్చిన ఉత్తరాలు, బ్రౌన్ కవర్ తో ప్యాక్ చేసిన ఓ పుస్తకం తీసుకుని ఇంట్లోకి వెళ్ళాను. ప్యాక్ విప్పి పుస్తకం చూశాను. ఆశ్చర్యం, అది ఆ సినీ రచయిత రాసిన కవితాసంపుటి! నేరుగా ఆయనే నాకు పంపించాడు. వద్దనుకున్న పుస్తకం ఇంటికే వచ్చింది. దానిని టీపాయ్ మీద పెట్టేసి ఆలోచనలో పడ్డాను. దానిని ఏంచేయాలో నాకు అర్థం కాలేదు.
    మీ రచన చదివాక ఈ రెండు ఉదంతాలూ నాకు గుర్తొచ్చాయి.

    ReplyDelete